ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు
నారా చంద్రబాబు నాయుడు రా కదలిరా బహిరంగ సభ విజయవంతమైన సందర్భంగా నియోజకవర్గ టిడిపి కార్యాలయంలో నియోజకవర్గ నాయకులు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసిన తిరువూరు నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ శావల దేవదత్. ముఖ్యఅతిథిగా టిడిపి సీనియర్ నాయకులు కేశినేని శివనాథ్ (చిన్ని) పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో కేశినేని చిన్ని మాట్లాడుతూ
తిరువూరు నియోజకవర్గంలో ఒక వ్యక్తికి ఎమ్మెల్యేగా టిడిపి తరఫున పోటీ చేయడానికి 5 సార్లు అవకాశం కల్పించింది, వాళ్ల సతీమణికి జిల్లా పరిషత్ చైర్మన్గా అవకాశం ఇచ్చింది.
ఆ వ్యక్తి వైసీపీలోకి వెళ్లి చంద్రబాబు నాయుడు పై అసత్య ప్రచారాలు చేయడం ఎంతవరకు సమంజసం-కేశినేని చిన్ని
ఇంకో వ్యక్తికి రెండు పర్యాయాలు ఎంపీగా అవకాశం కల్పించింది టిడిపి పార్టీ ఆ వ్యక్తి విజయవాడ పార్లమెంట్ పరిధిలో 60 శాతం టిడిపి పార్టీని ఖాళీ చేపిస్తానని ప్రగల్భాలు పలకటం విడ్డూరంగా ఉంది-కేశినేని చిన్ని
కేశినేని కుటుంబానికి ఎంపీగా అవకాశం కల్పించింది టిడిపి అధినేత చంద్రబాబు.. చిన్ని
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
చంద్రబాబు నాయుడుకి, టిడిపికి అండగా ఉండాల్సింది పోయి కేశినేని నాని చంద్రబాబు ని విమర్శించటం ఆయన దిగజారుడు తనానికి నిదర్శనం-కేశినేని చిన్ని
టిడిపిని వీడి వైసీపీలోకి వెళ్లిన వారికి చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేస్తే జగన్ టికెట్ ఇస్తాడాని వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేస్తున్నారు-కేశినేని చిన్ని
ఒక నాయకుడిగా కంటే కార్యకర్తగా ఉండటం నాకు ఎంతో ఇష్టం ఎందుకంటే తెలుగుదేశం పార్టీని నాయకులు మోసం చేశారు కానీ, కార్యకర్తలు మోసం చేయలేదు అందుకనే నాకు కార్యకర్తగానే ఉండటం ఇష్టం... చిన్ని
చంద్రబాబు నాయుడు ఏ బాధ్యత ఇచ్చిన దానికి కట్టుబడి ఆ బాధ్యతను నెరవేర్చుతాను-కేశినేని చిన్ని
విజయవాడని అభివృద్ధి చేసింది టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు. కానీ ఆయన దయతో ఎంపీగా గెలిచిన నాని విజయవాడకి చంద్రబాబు ద్రోహం చేశాడు అనటం దుర్మార్గం.... చిన్ని
చంద్రబాబు నాయుడు విజయవాడ పార్లమెంట్లో ఒక కార్యకర్తని ఎంపీ అభ్యర్థిగా పెట్టిన లక్షన్నర మెజార్టీతో గెలిపిస్తారు -కేశినేని చిన్ని
టిడిపి అధినేత చంద్రబాబుని నువ్వు విమర్శిస్తున్నావ్ నీకు త్వరలోనే ప్రజలు తగిన బుద్ధి చెబుతారు. కేశినేని చిన్ని.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి