హిమాచల్ ప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే ఆశిష్ శర్మ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖుకు సమోసాలు ఆర్డర్ చేశారు! సీఎంకు సమోసాలు ఆర్డర్ చేసినట్లు స్వయంగా ఎమ్మెల్యేనే ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఓ వైపు రాష్ట్రంలో నిరుద్యోగం, ఆర్థిక సంక్షోభం వంటి సమస్యలు పెరుగుతుంటే... సమోసాల అంశంలో సీఐడీ విచారణకు ఆదేశించడం విడ్డూరమన్నారు. ఇది తమను తీవ్రంగా నిరాశపరిచిందని వ్యాఖ్యానించారు. ఈ తీరును నిరసిస్తూ తాను సీఎంకు 11 సమోసాలు పంపించానన్నారు. ఆయనకు ప్రజా సమస్యలను గుర్తు చేసేందుకు మాత్రమే తాను ఇలా చేశానని స్పష్టం చేశారు. మరో బీజేపీ సీనియర్ నేత, హిమాచల్ ప్రదేశ్ మాజీ సీఎం జైరాం ఠాకూర్... బీజేపీ కార్యకర్తలకు సమోసా పార్టీ ఇచ్చి ఈ వివాదంపై వ్యంగ్యంగా స్పందించారు. అక్టోబర్ 21న సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు సీఐడీ కార్యాలయానికి వెళ్లారు. ఈ కార్యక్రమం కోసం అధికారులు ప్రముఖ హోటల్ నుంచి సమోసాలు తెప్పించారు. అయితే వాటిని సెక్యూరిటీ స్టాఫ్ ఆరగించినట్లు వార్తలు వచ్చాయి. సీఎంకు చేరాల్సిన సమోసాలు ఎలా మిస్ అయ్యాయో గుర్తించేందుకు సీఐడీ విచారణకు ఆదేశించినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. దీంతో ప్రతిపక్ష బీజేపీ నుంచి విమర్శలు వచ్చాయి.
ఇంకా చదవండి: నామినేటెడ్ పోస్టుల రెండో జాబితా విడుదల! నేమ్స్ లిస్ట్ మీకోసం..!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
నామినేటెడ్ పోస్టుల రెండో జాబితా! ఈసారి వారికి అవకాశం పక్కా! చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!
నేడు సీ ప్లేన్‌లో శ్రీశైలంకు సీఎం చంద్రబాబు! మీరు ఎప్పుడు ప్లాన్ చేసుకుంటున్నారు?
రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌పై మరో కేసు! వైసీపీకి ఊహించని షాక్ - ఈ కేసులో మాజీ ఎంపీ!
వైసీపీకి మరో షాక్.. బీజేపీలోకి మాజీ మంత్రి? జగన్ పై గాటు విమర్శలు!
ఏపీ ప్రజలకు గుడ్ చెప్పిన ఆరోగ్య శాఖ మంత్రి! ఇకపై ఆరోగ్య శ్రీ ద్వారా...
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: