చదువుల నేల రాయలసీమకు తానొచ్చానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. అత్యధికంగా లైబ్రరీలు ఉన్న ప్రాంతం ఇది అని పేర్కొన్నారు. కడప మున్సిపల్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మెగా సమావేశంలో ఆయన మాట్లాడారు. “అన్నమయ్య, వేమన, పుట్టపర్తి నారాయణాచార్యులు, కేవీ రెడ్డి, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంటి మహనీయుల నేల ఇది. రాయలసీమ అంటే వెనకబాటు కాదు.. అవకాశాలను ముందుండి నడిపించే ప్రాంతం. 2014-19 సంవత్సరంలో ఉద్దానం సమస్యను బయటకు తీసుకొచ్చా. ఆనాటి సీఎం చంద్రబాబు రూ.61 కోట్లతో ఉద్దానం ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లారు. కడపలో ఇంత నీటి సమస్య ఉందని నేను అనుకోలేదు. ఈ ప్రాంతం నుంచి ఇద్దరు సీఎంలు అయినందున సమస్యలు తీరిపోయి ఉంటాయనుకున్నా.
ఇంకా చదవండి: ఏపీలో కూటమి ప్రభుత్వం మరో కీలక ప్రకటన! నామినేటెడ్ పోస్టుల మరో జాబితా సిద్దం - దక్కేది వీరికే!
పులివెందుల తాగునీటి ప్రాజెక్టుకు రూ.45 కోట్లు ఇచ్చాం. తాగునీటి కోసం ఎక్కడా ఇబ్బంది రాకూడదనేదే కూటమి ప్రభుత్వ లక్ష్యం. నీటి సమస్యను తీర్చి ఇక్కడి ప్రజలను ఆదుకుంటానని మాట ఇస్తున్నా. సమాజానికి సరైన చదువు ఇవ్వకపోతే అభివృద్ధి దిశగా వెళ్లదు. విద్యార్థుల భవిష్యత్తు కోసమే కూటమి ప్రభుత్వం పని చేస్తోంది. పిల్లలతో చర్చిస్తేనే అన్ని విషయాలు మనకు తెలుస్తాయి. ఇటీవల విద్యార్థులు తిరగబడి టీచర్పై దాడి చేసిన ఘటన చూశాం. ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు కూడా బాధ్యతగా ఉండాలి. ఎక్కడ తప్పు జరిగినా ముందుగానే చర్చించుకోవాలి. సమస్య పరిష్కారానికి చర్చించుకోవడం చాలా ముఖ్యం” అని పవన్ కల్యాణ్ చెప్పారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీ ప్రజలకు ముఖ్యమైన వార్త.. ప్రభుత్వం నిన్నటి నుంచి 3 రోజులపాటూ! అవన్నీ ఉచితంగా పొందండి!
జగన్ కి షాక్.. విజయసాయిరెడ్డిపై క్రిమినల్ కేసు! ఎవరు పెట్టారు అంటే?
నెల్లూరులో అలా చేసే వారికి కఠిన చర్యలు తప్పవు! మంత్రి కీలక వ్యాఖ్యలు!
ఉచిత గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తున్నారా! ఇది తప్పక తెలుసుకోండి - లేదంటే.. ప్రమాదమే!
కొడాలికి మరో బిగ్ షాక్...14 రోజుల రిమాండ్ - నెల్లూరు సబ్‌జైలుకు తరలింపు! అసలేం జరిగిదంటే!
ఆళ్ల నాని టీడీపీలోకి ఎంట్రీ పై చంద్రబాబు క్లారిటీ! పలువురు వైసీపీ నేతలు కూటమి పార్టీలోకి!
ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు! మంత్రి లోకేశ్ సమక్షంలో గూగుల్ తో కీలక ఒప్పందం!
బీఆర్ఎస్‌కు ఊహించని షాక్! కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: