వైకాపా హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం చంద్రబాబుపై ఎన్టీఆర్ జిల్లా నందిగామలో జరిగిన రాళ్ల దాడి కేసులో పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. 2022 నవంబర్ 5న చంద్రబాబు నందిగామలో పర్యటించారు. వాహనంపై అభివాదం చేస్తూ చంద్రబాబు వస్తుండగా వీధి లైట్లు ఆర్పివేసి రాళ్ల దాడి చేశారు. స్థానిక రైతు బజార్ వద్ద చందర్లపాడు రోడ్డులో ఈ ఘటన జరిగింది. ఇందులో చంద్రబాబు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మధుసూదనరావుకు గాయాలయ్యాయి. దీనిపై కేసు నమోదైనా వైకాపా ప్రభుత్వం పట్టించుకోలేదు. తాజాగా పోలీసులు ఈ కేసులో పురోగతి సాధించారు. నందిగామకు చెందిన కనికంటి సజ్జన్ రావు, బెజవాడ కార్తీక్, పరిమి కిశోర్లను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీలో వాళ్లందరి పింఛన్లు కట్! ఈ తప్పు అస్సలు చేయొద్దు! సర్కార్ కీలక నిర్ణయం!
ఈజీగా బరువు తగ్గాలంటే ఈ జ్యూస్ పర్ఫెక్ట్! ఒకసారి ట్రై చేయండి!
శ్రీశైలంలో భక్తులకు గుడ్ న్యూస్! ఉచిత బస్సు సౌకర్యం ప్రారంభం! ఎప్పటి నుంచి అంటే!
25 ఏళ్ల ఆదాయాన్ని ఒకేసారి వైకాపా ప్రభుత్వం కాజేసింది! గత ప్రభుత్వంపై మంత్రి ఆగ్రహం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: