Rope way: ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ సరికొత్త టూరిజం ప్లాన్! రూ.750 కోట్లతో రోప్ వే... Law University: రాజధాని అభివృద్ధిలో మరో మైలురాయి... అంతర్జాతీయ లా వర్సిటీకి గ్రీన్ సిగ్నల్! SSC: టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్! హాల్ టికెట్ చూపిస్తే చాలు.. పరీక్షా కేంద్రానికి ఫ్రీగా వెళ్లొచ్చు! AP Development: డిజిటల్ హెల్త్ రికార్డులతో 'సంజీవని'! ప్రజారోగ్యం కోసం ఏపీ సరికొత్త ప్రణాళిక! AP Assembly: తప్పులు ఉంటే చెప్పండి.. సరిదిద్దుకుంటాం! విపక్షాలకు మంత్రి పయ్యావుల పిలుపు! Nara Lokesh: నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట.. లోకేష్ ప్రకటించిన నూతన విద్యా విధానం! Chandrababu Naidu: ఆడబిడ్డల జోలికి వస్తే ఆ రోజే ఆఖరి రోజు..! నేరగాళ్లకు సీఎం చంద్రబాబు వార్నింగ్! Botsa Satyanarayana: మండలిలో బొత్స సత్యనారాయణకు అస్వస్థత... హుటాహుటిన హైదరాబాద్‌కు తరలింపు! Talliki Vandanam: తల్లికి వందనంపై లేటెస్ట్ అప్‌డేట్! వారికి కూడా తల్లికి వందనం.. ప్రభుత్వం కీలక ప్రకటన! Steel Plant: ఏపీ పారిశ్రామిక చరిత్రలో సరికొత్త అధ్యాయం... రూ.1.35 లక్షల కోట్లతో మెగా స్టీల్ ప్లాంట్! మార్చి 23 న శంకుస్థాపన! Rope way: ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ సరికొత్త టూరిజం ప్లాన్! రూ.750 కోట్లతో రోప్ వే... Law University: రాజధాని అభివృద్ధిలో మరో మైలురాయి... అంతర్జాతీయ లా వర్సిటీకి గ్రీన్ సిగ్నల్! SSC: టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్! హాల్ టికెట్ చూపిస్తే చాలు.. పరీక్షా కేంద్రానికి ఫ్రీగా వెళ్లొచ్చు! AP Development: డిజిటల్ హెల్త్ రికార్డులతో 'సంజీవని'! ప్రజారోగ్యం కోసం ఏపీ సరికొత్త ప్రణాళిక! AP Assembly: తప్పులు ఉంటే చెప్పండి.. సరిదిద్దుకుంటాం! విపక్షాలకు మంత్రి పయ్యావుల పిలుపు! Nara Lokesh: నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట.. లోకేష్ ప్రకటించిన నూతన విద్యా విధానం! Chandrababu Naidu: ఆడబిడ్డల జోలికి వస్తే ఆ రోజే ఆఖరి రోజు..! నేరగాళ్లకు సీఎం చంద్రబాబు వార్నింగ్! Botsa Satyanarayana: మండలిలో బొత్స సత్యనారాయణకు అస్వస్థత... హుటాహుటిన హైదరాబాద్‌కు తరలింపు! Talliki Vandanam: తల్లికి వందనంపై లేటెస్ట్ అప్‌డేట్! వారికి కూడా తల్లికి వందనం.. ప్రభుత్వం కీలక ప్రకటన! Steel Plant: ఏపీ పారిశ్రామిక చరిత్రలో సరికొత్త అధ్యాయం... రూ.1.35 లక్షల కోట్లతో మెగా స్టీల్ ప్లాంట్! మార్చి 23 న శంకుస్థాపన!

Ambati Rambabu Arrest News: అంబటి రాంబాబుకు షాక్.. జైలు నుంచి విడుదలవ్వకముందే పోలీసుల అదుపులోకి!

Ambati Rambabu Arrest News: సత్తెనపల్లిలో సంక్రాంతి లక్కీ డ్రా అక్రమ వసూళ్ల కేసులో అంబటి రాంబాబు అరెస్ట్. రాజమండ్రి జైలు నుంచి గుంటూరు కోర్టుకు తరలిస్తున్న పోలీసులు. తాజా రాజకీయ పరిణామాలు ఇవే..

Published : 2026-02-12 12:27:00
  • Ambati News: బెయిల్ వచ్చినా మళ్ళీ అరెస్ట్.. పీటీ వారెంట్‌తో పోలీసుల షాక్!
     
  • సత్తెనపల్లి రాజకీయాల్లో సెగలు…

YSR Congress Party News: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) ఇబ్బందులు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న ఆయనను సత్తెనపల్లి పోలీసులు పీటీ  వారెంట్‌పై అదుపులోకి తీసుకున్నారు. గతంలో నమోదైన అక్రమ వసూళ్ల కేసులో భాగంగా విచారణ నిమిత్తం భారీ భద్రత నడుమ ఆయనను గుంటూరుకు తరలిస్తున్నారు.

సంక్రాంతి లక్కీ డ్రా స్కామ్.. అసలేం జరిగింది?
2023లో సత్తెనపల్లిలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల సందర్భంగా అంబటి రాంబాబు మంత్రి హోదాలో ఉండి అక్రమ వసూళ్లకు పాల్పడ్డారన్నది ప్రధాన ఆరోపణ. లక్కీ డ్రా పేరుతో భారీ ఎత్తున నిధులు వసూలు చేశారని, ఆ నిధుల వినియోగంలో అక్రమాలు జరిగాయని అప్పట్లో కేసు నమోదైంది. ఈ కేసులో లోతైన విచారణ జరిపేందుకు పోలీసులు అంబటిని కస్టడీలోకి తీసుకున్నారు. ఈ రోజు మధ్యాహ్నం ఆయనను గుంటూరు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. కోర్టు రిమాండ్ విధిస్తే అంబటి మరికొన్ని రోజులు జైలులోనే గడపాల్సి ఉంటుంది.

బెయిల్ వచ్చినా తప్పని కష్టాలు
వాస్తవానికి పోలీసులపై దౌర్జన్యం చేసినట్లు నమోదైన మరో కేసులో అంబటి రాంబాబుకు నిన్నే బెయిల్ మంజూరైంది. ఆ కేసులో ఊరట లభించిందని సంతోషించే లోపే, పోలీసులు పాత కేసును తెరపైకి తెచ్చి పీటీ వారెంట్ సమర్పించారు. దీంతో రాజమహేంద్రవరం జైలు నుంచి విడుదల కావాల్సిన అంబటి, నేరుగా పోలీసుల వాహనంలో గుంటూరు బాట పట్టాల్సి వచ్చింది.

సత్తెనపల్లి రాజకీయాల్లో వేడి
అంబటి రాంబాబు తరలింపు వార్తతో ఉమ్మడి గుంటూరు (Guntur) జిల్లా రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది. పోలీసుల చర్యను వైఎస్సార్సీపీ నాయకులు తప్పుపడుతుండగా, చట్టం తన పని తాను చేసుకుపోతుందని కూటమి నేతలు పేర్కొంటున్నారు. అక్రమ వసూళ్ల కేసులో బలమైన సాక్ష్యాధారాలు ఉన్నాయని, అందుకే పోలీసులు పకడ్బందీగా ముందుకు వెళ్తున్నారని సమాచారం. మధ్యాహ్నం కోర్టు ఇచ్చే తీర్పుపై అంబటి రాజకీయ భవిష్యత్తు మరియు తదుపరి పరిణామాలు ఆధారపడి ఉన్నాయి.

Spotlight

Read More →