టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో నేడు వర్క్ షాప్
హాజరుకానున్న అధినేత చంద్రబాబు నాయుడు
ఉదయం 11 గంటలకు వర్క్ షాప్‍ను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగం
అమరావతి :- సార్వత్రిక ఎన్నికలకు టీడీపీ, జనసేన, బీజేపీ సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే టీడీపీ, జనసేన కొన్ని మినహా దాదాపుగా తమ అభ్యర్థులను ప్రకటించాయి. మరోవైపు బీజేపీ కూడా అభ్యర్థుల ప్రకటనపై కసరత్తు చేస్తోంది. షెడ్యూల్ విడుదలతో కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ సందర్భంగా ఎన్నికల వ్యూహాలను చర్చించేందుకు అభ్యర్థులతో టీడీపీ వర్క్ షాప్ ను నిర్వహిస్తోంది. ఈ వర్క్ షాప్ కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
విజవాయడలోని ఎ కన్వెన్షన్ లో శనివారం(నేడు) ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ఈ వర్క్ షాప్ జరుగుతుంది. ఈ వర్క్ షాప్ కు తెలుగు దేశం పార్టీ నుంచి లోక్ సభ, అసెంబ్లీకి అభ్యర్థులుగా ప్రకటించిన వారితో పాటు ...ఇతర నియోజకవర్గాల్లోని ఇంచార్జ్ లు కూడా పాల్గొంటారు. అభ్యర్థులతో పాటు ఎన్నికల కోసం వారు ప్రత్యేకంగా నియమించుకున్న నలుగురు మేనేజర్లు కూడా ఈ వర్క్ షాప్ కు హాజరవుతారు.ఎన్నికల ప్రవర్తనా నియమావలి, అభ్యర్థులకు ఉండే హక్కులు, అధికార పార్టీ కుట్రలు వంటి అంశాలపై ప్రధానంగా చర్చ జరగుతుంది.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఎన్నికల్లో ప్రచారం, నామినేషన్ల దాఖలు వంటి అంశాలపైనా వర్క్ షాప్ లో చర్చిస్తారు. మొత్తం ఎన్నికల ప్రక్రియలో అభ్యర్థులు అనుసరించాల్సిన పద్దతులను, వ్యూహాలను ఈ సమావేశంలో వివరిస్తారు. చంద్రబాబు నాయుడు స్వయంగా దీనిపై ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. జనసేన, బీజేపీల నుంచి ఆ పార్టీల రాష్ట్ర స్థాయి నాయకులు కూడా ఒక్కొక్కరు చొప్పున ఈ వర్క్ షాప్ లో పాల్గొంటారు. ఉదయం 11 గంటలకు వర్క్ షాప్‍ను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగం... ఈ ప్రారంభోపన్యాసానికి మీడియాకు అనుమతి ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్!! హైకోర్టు వ్యాఖ్యానించిన కొద్దిసేపటికే!!
ఏపీలో ఎన్డీఏ కూటమికి లోక్‌సత్తా మద్దతు!! నిజాయితీగా రాష్ట్ర భవిష్యత్ కోసమే.. జయప్రకాష్ నారాయణ
ఆంధ్ర పోలీసులపై చర్యలకు సిద్ధమవుతున్న కేంద్ర ఎలక్షన్ కమిషన్? ఫిర్యాదుల విలువ!
ఆ దేశంలో రెండు పెళ్లిళ్లు చేసుకోవాల్సిందే.. లేదంటే శిక్ష!! అరె అబ్బాయిలు సర్దేసుకొండి బట్టలు ఇంకా!
సోషల్ మీడియా పై స్పెషల్ ఫోకస్ పెట్టిన సీఈసీ!! హద్దు దాటారో డేంజర్ బెల్!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి