- ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం: "మా వారిని ప్రాణాలతో చూస్తామనుకోలేదు" అంటూ కన్నీటి పర్యంతమైన కుటుంబాలు..
- బహ్రెయిన్ టూ కొచ్చి.. వయా సౌదీ: ట్రాన్సిట్ వీసా అడ్డంకులను తొలగించి దౌత్యపోరాటంలో నెగ్గిన ఏపీ ప్రభుత్వం..
Bahrain Updates: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యం లోని కూటమి ప్రభుత్వం మాట ఇచ్చామంటే చేసి చూపిస్తామని మరోసారి నిరూపించింది. హామీల విషయంలో అయినా.. అభివృద్ధి పథంలో రాష్ట్రాన్ని నడపడంలో అయినా మరెవరికి సాధ్యం కాని రీతిలో సీఎం అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. అంతే కాకుండా అలుపెరుగని యోధుడి లాగా నిరంతరం శ్రమిస్తూ కష్టకాలంలో కూడా అండగా ఉన్నామంటూ ప్రజలకు భరోసా ఇస్తున్నారు. ఇప్పటికే ఈ తరహా ఘటన మరోసారి రుజువు చేసి చూపించారు.
ఇరాన్ - ఇజ్రాయెల్, అమెరికా మధ్య భీకర దాడులు నడుస్తున్న తరుణంలో బహ్రెయిన్ లో కూడా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ క్రమంలోనే అక్కడికి పర్యటనకు వెళ్లిన 63 మంది ఏపీ వాసులు చిక్కుకుపోవడం.. ప్రాణ భయంతో ప్రభుత్వానికి తమ కష్టాన్ని వ్యక్తపరచగా.. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో సాగిన దౌత్య, క్షేత్రస్థాయి పోరాటం పర్యాటకులను మృత్యువు ముంగిట నుంచి కాపాడింది. 59 మంది పర్యాటకులను సురక్షితంగా తరలించింది.
అదే విధంగా ఈ రోజు ఉదయం 5 గంటలకు మరో 130 మంది బహరైన్ నుండి రోడ్డు మార్గంలో సౌదీ చేరుకొని అక్కడ నుండి సురక్షితంగా భారత్ లోని ముంబై విమానాశ్రయానికి ప్రయణమయ్యారు. వారిలో ఎక్కువమంది పిల్లలు మహిళలు ఉన్నారని సమాచారం. దీనితోపాటు అమెరికా, యూరోప్ నుండి ప్రయాణిస్తూ ఖతార్, దుబాయి లో ట్రాన్సిట్ లో ఉన్న పలువురు తిరిగి భారత్ కు తిరిగి వస్తున్నారు.
అలాగే గత కొద్ది రోజులుగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు ఎన్ఆర్ఐ టిడిపి సెల్ ద్వారా పరిస్థితులను నిరంతరం సమీక్షిస్తూ, గల్ఫ్ దేశాల కోఆర్డినేటర్లతో ప్రతిరోజూ టెలికాన్ఫరెన్సులు నిర్వహిస్తోంది. ఈ నేపధ్యంలో తెలుగు దేశం పార్టీ కేంద్ర కార్యాలయం లో కూడా 24/7 హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేశారు. సహాయం అవసరమైన వారు హెల్ప్‌లైన్ ను సంప్రదీస్తున్నారు. యుద్ధ వాతావరణంలో చిక్కుకుపోయినవారి కుటుంబ సభ్యులు కూడా తెలుగు దేశం కేంద్ర కార్యాలయాన్ని సంప్రదించి వారికి సహాయం చేయాలని కోరుకుంటున్నారు.
ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ, అక్కడ చిక్కుకున్న ప్రజలకు అందుబాటులో ఉంటూ, AP NRT మరియు ఎన్నారై టీడీపీ గల్ఫ్ టీం తో సమన్వయం చేసుకుంటూ నిరంతరం సమాచారాన్ని కుటుంబ సభ్యులకు అందిస్తున్నామంటూ ఎన్నారై టీడీపీ సెల్ కోఆర్డినేటర్ చప్పిడి రాజశేఖర్ వెల్లడించారు.
గత సోమవారం మొత్తం 63 మంది రాష్ట్రం నుంచి బహ్రెయిన్ వెళ్లగా.. ఊహించని రీతిలో అక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది. కాగా పరిస్థితులు చేయి దాటకమునుపే వారిలో నలుగురు పర్యాటకులు వెనక్కి రాగలిగారు. అయితే విమాన సర్వీసులు నిలిచిపోవడంతో మిగిలిన 59 మంది అక్కడే చిక్కుకుపోయారు. ఈ పరిస్థితుల్లో సర్కారును అభ్యర్ధించగా.. బహ్రెయిన్ నుండి నేరుగా విమానాలు లేకపోవడంతో, పర్యాటకులను రోడ్డు మార్గంలో సౌదీ అరేబియాకు తరలించి.. అక్కడి నుండి భారత్‌కు తీసుకురావాలని ప్రభుత్వం వ్యూహం రచించింది. అయితే సౌదీ ట్రాన్సిట్ వీసాలు లేకపోవడం ఇందుకు అతిపెద్ద అడ్డంకిగా మారింది.
ఈ తరుణంలోనే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు దౌత్యపరంగా చొరవ తీసుకున్నారు. విదేశీ వ్యవహారాల శాఖతో సంప్రదింపులు జరిపి.. సౌదీలోని గల్ఫ్ ప్రెసిడెంట్ రాధాకృష్ణ, కె.వరప్రసాద్, కోనేరు ఉమామహేశ్వరరావు, రంజిత్ ల సహాయంతో.. బాంబుల శబ్దాలను సైతం లెక్కచేయకుండా భారత ఎంబసీ ద్వారా పర్యాటకులందరికీ అత్యవసర వీసాలు సమకూర్చారు. అయినా కానీ బహ్రెయిన్ లోని హోటళ్లలో ఉండటం పర్యాటకులకు ఆర్థికంగా భారంగా మారింది. అంతే కాకుండా భద్రతా పరంగా కూడా ఆందోళన కలిగించింది.
ఈ అనూహ్య పరిస్థితుల్లో APNRT, NRI TDP బహరైన్ సభ్యులు రఘునాథ బాబు వడ్లమూడి, హరిబాబు తక్కెళ్లపాటి, డి.వి. శివ కుమార్, సతీష్ శెట్టి, రామమోహన్ కొత్తపల్లి, సతీష్ బొల్లా, ఇంతియాజ్ మహమ్మద్, డి. శ్రీనివాసరావు తదితరులు సైనికుల్లా కదిలి పర్యాటకులను సురక్షిత ప్రాంతాలకు తరలించి వసతి, భోజన సౌకర్యాలు కల్పించారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు బహ్రెయిన్ నుంచి బస్సుల్లో బయలుదేరిన పర్యాటకులు సాయంత్రానికి సౌదీలోని దమ్మామ్ చేరుకున్నారు. ఇక అక్కడి నుంచి నేడు రాత్రి 9 గంటలకు దమ్మామ్ నుండి కేరళలోని కొచ్చికి ప్రత్యేక విమానం ద్వారా వీరిని తరలించారు. కొచ్చి నుండి ఆంధ్ర లోని స్వస్థలాలకు చేరుకున్నట్లు
ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఒక్క తెలుగు వ్యక్తికి కూడా ఇబ్బంది కలగకుండా మంత్రి లోకేష్ గారు ప్రతి నిమిషం పర్యవేక్షించారని తెలిపారు. భీకరమైన యుద్ధ వాతావరణం నుంచి తమ వారిని క్షేమంగా తీసుకువస్తున్నందుకు పర్యాటకుల కుటుంబ సభ్యులు కూడా కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, మంత్రి లోకేష్ లకు జీవితాంతం రుణపడి ఉంటామని కన్నీటి పర్యంతం అయ్యారు. అలానే తెలుగువారు ఏ దేశంలో ఉన్నా, ఎంతటి గడ్డు పరిస్థితులు ఎదురైనా వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఏపీ ఎన్నార్టీ అధ్యక్షులు వేమూరి రవి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిబద్ధతకు ఈ ఘటనే నిదర్శనమని సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.