TATA: ఎపెక్స్‌లో ఘనంగా ‘టాటా’ పికిల్‌బాల్ టోర్నమెంట్! ఈ నెల 28న... పూర్తి వివరాలు! GO 117: జీవో 117 రద్దు.. ప్రభుత్వ పాఠశాలలకు పూర్వవైభవం: మంత్రి లోకేష్! Jio Revolution: భారత టెలికాం రంగంలో జియో సృష్టించిన ప్రభంజనం! కనుమరుగైన బడా కంపెనీలు! MaheshBabu: హీరో టూ సీఈఓ... టాలీవుడ్ బిజినెస్ మ్యాన్! మహేష్ బాబు బిజినెస్ సీక్రెట్స్! AP Assembly 2026: నాడు-నేడు, స్వర్ణగ్రామం పై హాట్ డిబేట్! Budget 2026: MSME రంగానికి కేంద్రం బిగ్ సపోర్ట్... రూ.10వేల కోట్ల ప్రత్యేక నిధి! Chandrababu: ఆ 5 గ్రామాలను తిరిగిచ్చేయండి.... ఏపీ సీఎంకు తుమ్మల విజ్ఞప్తి! AP Development: చంద్రబాబు నేతృత్వంలో మరో గ్లోబల్ సిలికాన్ వ్యాలీగా మారనున్న వైజాగ్! అసలేం జరుగుతుంది? Gold Rates: అమెరికాలో మార్పులు జరిగితే మన దగ్గర గోల్డ్ రేట్లు ఎందుకు తగ్గుతాయి? AP Government: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! రెవెన్యూ శాఖలో భారీ మార్పు... ఇక నుండి...! TATA: ఎపెక్స్‌లో ఘనంగా ‘టాటా’ పికిల్‌బాల్ టోర్నమెంట్! ఈ నెల 28న... పూర్తి వివరాలు! GO 117: జీవో 117 రద్దు.. ప్రభుత్వ పాఠశాలలకు పూర్వవైభవం: మంత్రి లోకేష్! Jio Revolution: భారత టెలికాం రంగంలో జియో సృష్టించిన ప్రభంజనం! కనుమరుగైన బడా కంపెనీలు! MaheshBabu: హీరో టూ సీఈఓ... టాలీవుడ్ బిజినెస్ మ్యాన్! మహేష్ బాబు బిజినెస్ సీక్రెట్స్! AP Assembly 2026: నాడు-నేడు, స్వర్ణగ్రామం పై హాట్ డిబేట్! Budget 2026: MSME రంగానికి కేంద్రం బిగ్ సపోర్ట్... రూ.10వేల కోట్ల ప్రత్యేక నిధి! Chandrababu: ఆ 5 గ్రామాలను తిరిగిచ్చేయండి.... ఏపీ సీఎంకు తుమ్మల విజ్ఞప్తి! AP Development: చంద్రబాబు నేతృత్వంలో మరో గ్లోబల్ సిలికాన్ వ్యాలీగా మారనున్న వైజాగ్! అసలేం జరుగుతుంది? Gold Rates: అమెరికాలో మార్పులు జరిగితే మన దగ్గర గోల్డ్ రేట్లు ఎందుకు తగ్గుతాయి? AP Government: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! రెవెన్యూ శాఖలో భారీ మార్పు... ఇక నుండి...!

AP Development: చంద్రబాబు నేతృత్వంలో మరో గ్లోబల్ సిలికాన్ వ్యాలీగా మారనున్న వైజాగ్! అసలేం జరుగుతుంది?

Global Silicon Valley: ఆంధ్రప్రదేశ్ కేవలం వ్యవసాయ రాష్ట్రం అనే ముద్రను చెరిపివేస్తూ, విశాఖపట్నం కేంద్రంగా ఒక భారీ డిజిటల్ విప్లవానికి సిద్ధమైంది. సముద్ర తీర ప్రాంతాన్ని మరియు గ్రీన్ ఎనర్జీ వనరులను ఉపయోగించుకుంటూ, ప్రపంచ స్థాయి కంపెనీలను ఆకర్షిస్తూ దేశానికే డిజిటల్ బ్యాక్ బోన్ గా ఎదిగేందుకు ఏపీ అడుగులు వేస్తోంది.

Published : 2026-02-17 08:17:00

హైదరాబాద్ లేకపోయినా తగ్గేదేలే…

 సముద్ర తీరంతో సరికొత్త చరిత్ర సృష్టిస్తున్న ఏపీ…

98 వేల కోట్ల భారీ పెట్టుబడులు…

ఆంధ్రప్రదేశ్ అంటే మనకు మొదట గుర్తొచ్చేది వ్యవసాయం మరియు రాజకీయం అని చాలా మంది అభిప్రాయపడుతుంటారు. ఒకప్పుడు 'రైస్ బౌల్ ఆఫ్ ఇండియా' గా పేరుగాంచిన ఈ రాష్ట్రం 2014లో హైదరాబాద్ వంటి ప్రధాన ఆదాయ వనరును కోల్పోయినప్పుడు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడుతుందని విశ్లేషకులు భావించారు. అయితే, సొంతంగా రాజధాని లేకపోయినా గత మొదటి 5 ఏళ్లలో తన ఆదాయాన్ని రెట్టింపు చేసుకుంటూ ఇప్పటి చంద్రబాబు నాయకత్వంలో ఏపీ సాంకేతిక విప్లవానికి వేదికగా మారుతోందని పరిశీలకులు చెబుతున్నారు. సముద్ర తీరాన్నే తన ప్రధాన బలగంగా మార్చుకుని భారతదేశపు తదుపరి టెక్నాలజీ హబ్‌గా ఎదిగేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాల వలన రాష్ట్రం బలమైన పునాదులు వేస్తోందని స్పష్టమవుతోంది.


విశాఖపట్నం ఇప్పుడు ప్రపంచ ఇంటర్నెట్ నెట్‌వర్క్‌కు ప్రధాన ద్వారంగా మారుతోందని టెక్ నిపుణులు భావిస్తున్నారు.సాధారణంగా మనం వాడే ఇంటర్నెట్ డేటా అంతా సముద్రం అడుగున ఉండే భారీ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ద్వారానే ప్రయాణిస్తుంది. ముంబై, చెన్నై తర్వాత మెటా వంటి అంతర్జాతీయ సంస్థలు విశాఖను తమ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ల కోసం ఎంచుకోవడం ఏపీకి దక్కిన ఒక గొప్ప అవకాశంగా పరిగణించవచ్చు. ఇప్పటికే 2014 -19 మధ్యకాలంలో చంద్రబాబు ముందుచూపుతో  రాష్ట్రవ్యాప్తంగా డెవలప్ చేసిన 24 వేల కిలోమీటర్ల ఫైబర్ గ్రిడ్ ద్వారా ఈ వేగవంతమైన డేటాను పల్లెటూళ్ల వరకు చేరవేసే (Digital Infrastructure) అందుబాటులో ఉండటం ఏపీకి ఉన్న అతిపెద్ద సానుకూల అంశం. ఈ విషయంలో చంద్రబాబుని ఆయన దూర దృష్టిని అభినందించి తీరాల్సిందే.


ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) యుగంలో డేటాను భద్రపరచడానికి భారీ భవనాలు మరియు విస్తారమైన స్థలాలు అవసరం అవుతున్నాయి. బెంగళూరు, ముంబై వంటి నగరాల్లో వందల ఎకరాల భూమి ఒకే చోట దొరకడం కష్టంగా మారిన తరుణంలో, చంద్రబాబు ప్రభుత్వం తెలివిగా ఏపీ వద్ద ఉన్న లక్షల ఎకరాల పారిశ్రామిక భూములను కంపెనీలకు అందుబాటులోకి తెచ్చింది. రిలయన్స్, అదానీ వంటి దిగ్గజ సంస్థలు దాదాపు 98 వేల కోట్ల రూపాయలతో ఇక్కడ భారీ కేంద్రాలను నిర్మించడానికి ముందుకు రావడం చంద్రబాబు ప్రభుత్వం తీసుకుంటున్న విధి విధానాలే దీనికి నిదర్శనం.

చంద్రబాబు విజన్, అవకాశాలను అందుపుచ్చుకునే నైజంతో ప్రస్తుతం భారతదేశం మొత్తం మీద ఉన్న సామర్థ్యం కంటే మూడు రేట్లు ఎక్కువ సామర్థ్యం ఒక్క విశాఖపట్నం చుట్టుపక్కలే రాబోతుండటంతో ఏపీ భవిష్యత్తులో (Data Centers) కు గ్లోబల్ క్యాపిటల్ గా మారే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఈ భారీ టెక్నాలజీ కేంద్రాలకు 24 గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడం అత్యంత కీలకం. దీనికోసం చంద్రబాబు నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం 'గ్రీన్ ఎనర్జీ' పై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. పగటిపూట సోలార్ ద్వారా వచ్చే శక్తిని ఉపయోగించి నీటిని కొండలపైకి / ఎత్తయిన ప్రదేశాలకు పంపి, రాత్రిపూట ఆ నీటితో టర్బైన్లు తిప్పి కరెంటు పుట్టించే 'పంప్డ్ స్టోరేజ్' వంటి ప్రాజెక్టులను అదానీ వంటి సంస్థలు నిర్మిస్తున్నాయి. ఈ రకమైన నాచురల్ బ్యాటరీ వ్యవస్థ ద్వారా నిరంతరాయంగా క్లీన్ ఎనర్జీని అందిస్తామని  చంద్రబాబు ప్రభుత్వం భరోసా ఇవ్వడం వల్లే అంతర్జాతీయ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నాయని చెప్పవచ్చు.


కేవలం డేటా సెంటర్లే కాకుండా సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్ తయారీలో కూడా ఏపీ వేగంగా దూసుకుపోతోంది. చంద్రబాబు ప్రభుత్వం అందిస్తున్న భారీ సబ్సిడీలు మరియు రాయితీలు కొత్త పరిశ్రమలను ఆకర్షిస్తున్నాయి. అయితే స్కిల్డ్ వర్కర్ల కొరత మరియు నీటి సమస్య వంటి కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం మరియు యువతకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం ద్వారా వీటిని అధిగమించవచ్చని భావిస్తున్నారు. దీనికి తగిన విధంగా చంద్రబాబు ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ని ప్రారంభిస్తున్నారు. 2014లో ఏపీ ఆర్థిక స్థితిపై అనుమానం వ్యక్తం చేసిన వారికి సమాధానంగా విజనరీ నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాజధాని లేకున్నా ఆర్థికంగా ఎదిగి ఇప్పుడు దేశానికి డిజిటల్ బ్యాక్ బోన్ గా మారుతోందని భవిష్యత్తులో విశాఖపట్నం ఇండియా యొక్క కొత్త సిలికాన్ వ్యాలీగా మారుతుందని స్పష్టమవుతోంది.

Spotlight

Read More →