Dhulipalla Narendra: కులాల మధ్య చిచ్చు పెట్టడమే జగన్ పని.. వైసీపీ అరాచకాలపై ధూళిపాళ్ల నరేంద్ర తీవ్ర ఆగ్రహం! Chiranjeevi: థియేటర్ల వివాదంపై రంగంలోకి మెగాస్టార్.. నేడు చిరంజీవి నివాసంలో ఎగ్జిబిటర్ల కీలక భేటీ! Rohini Karte: బీ అలర్ట్.. నేటి నుంచే రోళ్లు పగిలే 'రోహిణి కార్తె' ప్రారంభం.. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు! Chandrababu: ఏపీ పారిశ్రామిక రంగంలో సరికొత్త విప్లవం.. 38 కొత్త ఎంఎస్ఎంఈ పార్కులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన! Avika Gor: నా మార్పులు చూసి ప్లాస్టిక్ సర్జరీ అనుకున్నారు.. సోషల్ మీడియా రూమర్లపై అవికా గోర్ ఫుల్ క్లారిటీ! Ebola Virus: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో హై అలర్ట్... మహమ్మారి విజృంభణతో కేంద్రం కఠిన చర్యలు! Fuel prices India: సామాన్యుడికి మరో భారీ వాత?: లీటరు పెట్రోల్‌పై ఇంకో రూ. 20 నుండి రూ. 33 పెరిగే ఛాన్స్! Godavari: గోదావరి కాలుష్యంపై సమగ్ర ఆడిట్‌కు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలు! Rohini Karte 2026: రోహిణి కార్తె వచ్చేసింది.. అసలు కథ ఇవాళ్టి నుంచే.. కీలక సూచనలు! Healthy Juice: పరగడుపున ఓ చిన్న గ్లాస్ తాగండి చాలు.. జుట్టు రాలదు, మొహంపై మచ్చలు పోతాయ్... Dhulipalla Narendra: కులాల మధ్య చిచ్చు పెట్టడమే జగన్ పని.. వైసీపీ అరాచకాలపై ధూళిపాళ్ల నరేంద్ర తీవ్ర ఆగ్రహం! Chiranjeevi: థియేటర్ల వివాదంపై రంగంలోకి మెగాస్టార్.. నేడు చిరంజీవి నివాసంలో ఎగ్జిబిటర్ల కీలక భేటీ! Rohini Karte: బీ అలర్ట్.. నేటి నుంచే రోళ్లు పగిలే 'రోహిణి కార్తె' ప్రారంభం.. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు! Chandrababu: ఏపీ పారిశ్రామిక రంగంలో సరికొత్త విప్లవం.. 38 కొత్త ఎంఎస్ఎంఈ పార్కులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన! Avika Gor: నా మార్పులు చూసి ప్లాస్టిక్ సర్జరీ అనుకున్నారు.. సోషల్ మీడియా రూమర్లపై అవికా గోర్ ఫుల్ క్లారిటీ! Ebola Virus: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో హై అలర్ట్... మహమ్మారి విజృంభణతో కేంద్రం కఠిన చర్యలు! Fuel prices India: సామాన్యుడికి మరో భారీ వాత?: లీటరు పెట్రోల్‌పై ఇంకో రూ. 20 నుండి రూ. 33 పెరిగే ఛాన్స్! Godavari: గోదావరి కాలుష్యంపై సమగ్ర ఆడిట్‌కు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలు! Rohini Karte 2026: రోహిణి కార్తె వచ్చేసింది.. అసలు కథ ఇవాళ్టి నుంచే.. కీలక సూచనలు! Healthy Juice: పరగడుపున ఓ చిన్న గ్లాస్ తాగండి చాలు.. జుట్టు రాలదు, మొహంపై మచ్చలు పోతాయ్...

USA Telugu student: తల్లిదండ్రులకు తీరని శోకం.. అమెరికాలో తెలుగు యువతి దుర్మరణం!

USA Telugu student: ఉన్నత చదువులు, ఉజ్వల భవిష్యత్తు కోసం అమెరికా వెళ్లిన తెలుగు యువతి అకాల మరణం చెందడం కుటుంబ సభ్యులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఫ్లోరిడాలో హైదరాబాద్‌కు చెందిన యువతి ప్రమాదవశాత్తు మరణించింది.

Published : 2026-05-10 11:43:00
  • మృతదేహాలను స్వదేశానికి తరలించేందుకు ప్రభుత్వ సహాయం  కోరిన వీణ కుటుంబం..
     
  • NRI: ఫ్లోరిడాలో స్విమ్మింగ్ పూల్‌లో పడి హైదరాబాద్ యువతి వీణ మరణం..

USA Telugu student: ఉన్నత చదువులు అభ్యసించి, ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలనే ఆశయంతో అమెరికా వెళ్లిన ఒక తెలుగు యువతి అకాల మరణం చెందడం ఆమె కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్ నియోజకవర్గం, లింగోజిగూడకు చెందిన వీణ అనే యువతి ఫ్లోరిడాలో జరిగిన ఒక ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలోని వర్జీనియాలో నివసిస్తున్న ఆమె, ఒక శుభకార్యానికి హాజరయ్యే నిమిత్తం ఫ్లోరిడాకు వెళ్లినట్లు సమాచారం. అక్కడ అనుకోని విధంగా స్విమ్మింగ్ పూల్‌లో పడిపోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. విదేశీ గడ్డపై తమ బిడ్డ ఉన్నత స్థితిలో ఉంటుందని ఆశించిన తల్లిదండ్రులకు, ఆమె మరణవార్త పిడుగులాంటి వార్తగా పరిణమించింది.

ఈ విషయం తెలిసిన వెంటనే స్థానిక ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి లింగోజిగూడలోని వీణ నివాసానికి వెళ్లి ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. శోకసంద్రంలో ఉన్న తల్లిదండ్రులను ఓదార్చిన ఆయన, ఈ కష్టసమయంలో ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వీణ భౌతికకాయాన్ని అమెరికా నుండి తిరిగి స్వదేశానికి తీసుకురావడానికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తామని, విదేశాంగ శాఖ అధికారులతో మాట్లాడి ప్రక్రియను వేగవంతం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. గారాల పట్టి మృతదేహం కోసం ఎదురుచూస్తున్న ఆ కుటుంబ సభ్యుల రోదనలు స్థానికులను కలచివేస్తున్నాయి.

Spotlight

Read More →