Oil Reserves: ప్రపంచంలో అత్యధిక చమురు నిల్వలు ఉన్న దేశాలు.. టాప్-10 జాబితా! Rope way: ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ సరికొత్త టూరిజం ప్లాన్! రూ.750 కోట్లతో రోప్ వే... Law University: రాజధాని అభివృద్ధిలో మరో మైలురాయి... అంతర్జాతీయ లా వర్సిటీకి గ్రీన్ సిగ్నల్! Love Marriage: పెళ్లిపీటలెక్కనున్న బెల్లంకొండ శ్రీనివాస్! అమ్మాయి ఎవరంటే? CBSE Exams: గల్ఫ్ దేశాల్లో సీబీఎస్‌ఈ 10వ తరగతి పరీక్షలు రద్దు! కొత్త తేదీలను త్వరలో...! Used Cars: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా? ఈ 5 తనిఖీలు చేయకుంటే చిక్కుల్లో పడ్డట్టే! SSC: టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్! హాల్ టికెట్ చూపిస్తే చాలు.. పరీక్షా కేంద్రానికి ఫ్రీగా వెళ్లొచ్చు! KGBV Notification: ఏపీ కేజీబీవీ అడ్మిషన్స్ 2026! 6వ తరగతి, ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల! Iran Updates: అమెరికా, ఇజ్రాయెల్ వైఖరి మారాలి..! ఇరాన్ అధ్యక్షుడు ఘాటు వ్యాఖ్యలు! AP Development: డిజిటల్ హెల్త్ రికార్డులతో 'సంజీవని'! ప్రజారోగ్యం కోసం ఏపీ సరికొత్త ప్రణాళిక! Oil Reserves: ప్రపంచంలో అత్యధిక చమురు నిల్వలు ఉన్న దేశాలు.. టాప్-10 జాబితా! Rope way: ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ సరికొత్త టూరిజం ప్లాన్! రూ.750 కోట్లతో రోప్ వే... Law University: రాజధాని అభివృద్ధిలో మరో మైలురాయి... అంతర్జాతీయ లా వర్సిటీకి గ్రీన్ సిగ్నల్! Love Marriage: పెళ్లిపీటలెక్కనున్న బెల్లంకొండ శ్రీనివాస్! అమ్మాయి ఎవరంటే? CBSE Exams: గల్ఫ్ దేశాల్లో సీబీఎస్‌ఈ 10వ తరగతి పరీక్షలు రద్దు! కొత్త తేదీలను త్వరలో...! Used Cars: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా? ఈ 5 తనిఖీలు చేయకుంటే చిక్కుల్లో పడ్డట్టే! SSC: టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్! హాల్ టికెట్ చూపిస్తే చాలు.. పరీక్షా కేంద్రానికి ఫ్రీగా వెళ్లొచ్చు! KGBV Notification: ఏపీ కేజీబీవీ అడ్మిషన్స్ 2026! 6వ తరగతి, ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల! Iran Updates: అమెరికా, ఇజ్రాయెల్ వైఖరి మారాలి..! ఇరాన్ అధ్యక్షుడు ఘాటు వ్యాఖ్యలు! AP Development: డిజిటల్ హెల్త్ రికార్డులతో 'సంజీవని'! ప్రజారోగ్యం కోసం ఏపీ సరికొత్త ప్రణాళిక!

Chandrababu Naidu: ఆడబిడ్డల జోలికి వస్తే ఆ రోజే ఆఖరి రోజు..! నేరగాళ్లకు సీఎం చంద్రబాబు వార్నింగ్!

Chandrababu Naidu: ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో ప్రసంగిస్తూ గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యంగా పోలవరం, అమరావతి పనులను పూర్తి చేస్తామని, విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని, సామాజిక భద్రతకు పెద్దపీట వేస్తామని స్పష్టం చేశారు. పేదరికాన్ని పారద్రోలేందుకు సరికొత్త విధానాలను ప్రభుత్వం అనుసరిస్తుందని ప్రకటించారు.

Published : 2026-03-06 17:54:00

P4' పథకంపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు…

మూడేళ్లలో యూనిట్ ధర 4 రూపాయలకే.. అసెంబ్లీలో ప్రకటన…

11 సీట్లు ఇస్తే అసెంబ్లీకి రావా? వైసీపీ తీరుపై మండిపడ్డ ముఖ్యమంత్రి…

Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రసంగం చేశారు. రాష్ట్ర విభజన వల్ల ఏపీ తీవ్రంగా నష్టపోయిందని, ఆదాయం ఇచ్చే హైదరాబాద్ తెలంగాణకు వెళ్ళిపోవడంతో కష్టాలు మొదలయ్యాయని ఆయన గుర్తు చేశారు. ముఖ్యంగా 2019 నుంచి 2024 వరకు గత ప్రభుత్వం హయాంలో రాష్ట్రం పూర్తిగా విధ్వంసానికి గురైందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టాలనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ మరియు బీజేపీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని, రాష్ట్రాన్ని గట్టెక్కించే బాధ్యతను ముగ్గురం తీసుకున్నామని స్పష్టం చేశారు. కేవలం 11 సీట్లకే పరిమితమైన వైసీపీ నేతలు కనీసం అసెంబ్లీకి కూడా రాకపోవడంపై ఆయన మండిపడ్డారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ, గత ప్రభుత్వం కేంద్ర నిధులను దుర్వినియోగం చేయడమే కాకుండా 12 శాతం వడ్డీలకు ప్రభుత్వ ఆస్తులను తనఖా పెట్టి అప్పులు చేసిందని సీఎం విమర్శించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం కేంద్రం నుంచి అదనపు నిధులు రాబట్టడంలో సఫలమైందని చెప్పారు. ఎన్డీయే సహకారంతో పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయని, అంతర్జాతీయ నిపుణుల పర్యవేక్షణలో నాణ్యతతో నిర్మిస్తున్నామని తెలిపారు. గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరాన్ని పూర్తి చేస్తామని, అలాగే అమరావతి రాజధాని పనులను కూడా తిరిగి గాడిలో పెట్టామని భరోసా ఇచ్చారు.

వ్యవసాయం మరియు సాగునీటి ప్రాజెక్టులపై దృష్టి పెడుతూ, హంద్రీనీవా ప్రాజెక్టు కోసం 3500 కోట్లు మంజూరు చేసి నీటి సమస్యను పరిష్కరించామని బాబు పేర్కొన్నారు. అలాగే విద్యుత్ రంగంలో ప్రజలపై భారం పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ప్రస్తుతం యూనిట్ ధరను 5.19 రూపాయల నుండి రాబోయే మూడేళ్లలో 4 రూపాయలకు తగ్గించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని వెల్లడించారు. సూర్యఘర్ స్కీమ్ ద్వారా 6 లక్షల ఇళ్లకు సోలార్ విద్యుత్ అందిస్తామని, దీనివల్ల సామాన్యులకు కరెంటు బిల్లుల భారం తప్పుతుందని వివరించారు. పేద కుటుంబాలను సంపన్న కుటుంబాలుగా మార్చేందుకు 'P4' మరియు 'MBK' (మార్గదర్శి బంగారు కుటుంబం) వంటి వినూత్న పథకాలను అమలు చేస్తున్నామన్నారు.

సామాజిక అంశాలపై మాట్లాడుతూ, సోషల్ మీడియా వల్ల పిల్లలు చెడిపోకుండా 13 ఏళ్ల లోపు వారికి దానిని నిషేధించే ఆలోచన చేస్తున్నామని, దీనిపై 90 రోజుల్లో స్పష్టమైన విధివిధానాలు వెల్లడిస్తామని సీఎం ప్రకటించారు. ఆడబిడ్డల రక్షణ విషయంలో రాజీ పడేది లేదని, మహిళల జోలికి వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాయలసీమలో ఫ్యాక్షన్ రాజకీయాలను రూపుమాపగలిగామని, అయితే జగన్ పరామర్శల పేరుతో ఫ్లెక్సీల మధ్య బల ప్రదర్శన చేయడం ఏంటని ప్రశ్నించారు. రాజకీయం కోసం కులమతాలను వాడుకోకూడదని, ప్రతి ఒక్కరూ అన్ని మతాలను గౌరవించాలని హితవు పలికారు.

Spotlight

Read More →