Maruti Alto K10: తగ్గిన ధరలు.. పెరిగిన క్రేజ్! మళ్ళీ రేసులో మధ్యతరగతి కారు ఆల్టో K10 ! Best Foods: వేసవిలో గుండెకు మేలు చేసే సూపర్ ఫుడ్స్! H1B visa: "కరిగిపోతున్న అమెరికా కల": అగ్రరాజ్యాన్ని వీడాలనుకుంటున్న 40 శాతం మంది భారతీయులు! Agadha: 45 నిమిషాల వీఎఫ్ఎక్స్ హంగులతో.. విజువల్ వండర్‌గా రాబోతున్న మిస్టికల్ డివైన్ థ్రిల్లర్.. Pawan Kalyan: అమరావతి నుంచి ఫోన్.. సహచర మంత్రికి అండగా ఉంటామని పవన్ భరోసా.. Minister Savitha: వైసీపీ అంటే హంతకులను తయారుచేసే ఫ్యాక్టరీ.. మంత్రి సవిత సంచలన వ్యాఖ్యలు! Chandrababu: ఏపీ ఇక గ్రీన్ ఎనర్జీ హబ్.. రూ. 5.95 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యం.. అభివృద్ధిపై సీఎం దార్శనికత.. Mangli: నిజం త్వరలోనే బయటకు వస్తుంది.. ఇన్వెస్టర్ల సొమ్ము మాయం కేసులో మంగ్లీ క్లారిటీ.! Clay Pot Water: ఫ్రిజ్ నీళ్ల కంటే మట్టి పాత్రలోని నీరే మిన్న.. ఆ సీక్రెట్ ఏంటో తెలుసా? Childhood Memories: స్మార్ట్‌ఫోన్ల కాలంలో కనుమరుగైన చింతపిక్కల ఆటలు.. ఆ మజానే వేరబ్బా! Maruti Alto K10: తగ్గిన ధరలు.. పెరిగిన క్రేజ్! మళ్ళీ రేసులో మధ్యతరగతి కారు ఆల్టో K10 ! Best Foods: వేసవిలో గుండెకు మేలు చేసే సూపర్ ఫుడ్స్! H1B visa: "కరిగిపోతున్న అమెరికా కల": అగ్రరాజ్యాన్ని వీడాలనుకుంటున్న 40 శాతం మంది భారతీయులు! Agadha: 45 నిమిషాల వీఎఫ్ఎక్స్ హంగులతో.. విజువల్ వండర్‌గా రాబోతున్న మిస్టికల్ డివైన్ థ్రిల్లర్.. Pawan Kalyan: అమరావతి నుంచి ఫోన్.. సహచర మంత్రికి అండగా ఉంటామని పవన్ భరోసా.. Minister Savitha: వైసీపీ అంటే హంతకులను తయారుచేసే ఫ్యాక్టరీ.. మంత్రి సవిత సంచలన వ్యాఖ్యలు! Chandrababu: ఏపీ ఇక గ్రీన్ ఎనర్జీ హబ్.. రూ. 5.95 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యం.. అభివృద్ధిపై సీఎం దార్శనికత.. Mangli: నిజం త్వరలోనే బయటకు వస్తుంది.. ఇన్వెస్టర్ల సొమ్ము మాయం కేసులో మంగ్లీ క్లారిటీ.! Clay Pot Water: ఫ్రిజ్ నీళ్ల కంటే మట్టి పాత్రలోని నీరే మిన్న.. ఆ సీక్రెట్ ఏంటో తెలుసా? Childhood Memories: స్మార్ట్‌ఫోన్ల కాలంలో కనుమరుగైన చింతపిక్కల ఆటలు.. ఆ మజానే వేరబ్బా!

Chandrababu: ఏపీ ఇక గ్రీన్ ఎనర్జీ హబ్.. రూ. 5.95 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యం.. అభివృద్ధిపై సీఎం దార్శనికత..

Chandrababu: భారీ పెట్టుబడులతో అనకాపల్లి జిల్లా అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని, భవిష్యత్తులో ఈ జిల్లా పెట్టుబడులను ఆకర్షించడంలో దేశంలోనే అగ్రస్థానానికి చేరుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. గతంలో వెనుకబడిన రంగారెడ్డి జిల్లా ఎలాగైతే సంపన్న ప్రాంతంగా మారిందో, విశాఖకు సమీపంలో ఉన్న అనకాపల్లిని కూడా మరో రంగారెడ్డి జిల్లాగా తీర్చిదిద్దుతామని ఆయన హామీ ఇచ్చారు.

Published : 2026-04-23 15:01:00
  • Politics: "1,050 గ్రీన్ బస్సులు.. 5,000 ఛార్జింగ్ స్టేషన్లు": కాలుష్య రహిత ఏపీ కోసం భారీ ప్రణాళిక..
     
  • "విద్యుత్ రంగంలో స్వయం సమృద్ధి": సోలార్ తయారీ పరిశ్రమలతో మారుతున్న రాష్ట్ర ముఖచిత్రం..

Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనకాపల్లి జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర పారిశ్రామిక భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం రాంబిల్లిలో రూ. 5,400 కోట్ల పెట్టుబడితో 'రెన్యూ ఎనర్జీ' సంస్థ నిర్మించనున్న 6.5 గిగావాట్ల సోలార్ ఇంగాట్-వేఫర్ తయారీ ప్లాంట్‌కు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ, అనకాపల్లి జిల్లాను భవిష్యత్తులో మరో 'రంగారెడ్డి' జిల్లాగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. గతంలో వెనుకబడిన ప్రాంతంగా ఉన్న రంగారెడ్డి జిల్లా ఎలాగైతే అభివృద్ధి చెందిందో, విశాఖకు అతి సమీపంలో ఉన్న అనకాపల్లి కూడా దేశంలోనే పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గత ఐదేళ్లలో విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని పునర్నిర్మించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ వంటి దిగ్గజ సంస్థల తర్వాత రెన్యూ ఎనర్జీ ముందుకు రావడం శుభపరిణామమని కొనియాడారు.

రాష్ట్రాన్ని 'గ్రీన్ ఎనర్జీ' (హరిత ఇంధనం) హబ్‌గా మార్చడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఏపీలో 160 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేయాలనే భారీ లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని, ఇప్పటికే ఈ రంగంలో రూ. 5.95 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని వెల్లడించారు. ఒక్క ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ సంస్థే రూ. 1.85 లక్షల కోట్ల పెట్టుబడులతో ముందుకు వస్తోందని, సుమారు 90 గిగావాట్ల మేర ఒప్పందాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. పర్యావరణ హితమైన ఇంధన వనరులను ప్రోత్సహించడంలో భాగంగా ఆర్టీసీలో 1,050 గ్రీన్ బస్సులను ప్రవేశపెడుతున్నామని, రాష్ట్రవ్యాప్తంగా 5,000 ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. విద్యుత్ వినియోగమే అభివృద్ధికి అసలైన సూచిక అని, అందుకే విద్యుత్ రంగంలో స్వయం సమృద్ధి సాధించేందుకు భారీ ప్లాంట్లను ప్రోత్సహిస్తున్నామని ఆయన వివరించారు.

అదే సమయంలో గత ప్రభుత్వ విద్యుత్ విధానాలపై చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. 2019-24 మధ్య కాలంలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను (పీపీఏలు) ఏకపక్షంగా రద్దు చేయడం వల్ల రాష్ట్రం వేల కోట్ల రూపాయల మేర నష్టపోయిందని ఆరోపించారు. పీపీఏల రద్దు కారణంగా విద్యుత్ వాడుకోకుండానే రూ. 9 వేల కోట్ల ప్రజాధనాన్ని చెల్లించాల్సి రావడం దురదృష్టకరమని, ఆ భారాన్ని 'ట్రూ అప్' ఛార్జీల రూపంలో సామాన్యులపై మోపారని మండిపడ్డారు. గత హయాంలో ధ్వంసమైన విద్యుత్ వ్యవస్థను గాడిలో పెడుతున్నామని, ఎన్నికల హామీ మేరకు విద్యుత్ ఛార్జీలను పెంచకుండా సంస్కరణల ఫలాలను ప్రజలకు అందిస్తామని భరోసా ఇచ్చారు. పారిశ్రామిక ప్రగతి ద్వారా సంపద సృష్టించి, తద్వారా పేదరిక నిర్మూలనకు కృషి చేస్తామని ఆయన పునరుద్ఘాటించారు.

Spotlight

Read More →