Singer Mangli: నాపై ఆరోపణలు నిరూపిస్తే దేనికైనా సిద్ధం.. న్యాయవాది సుబ్బారావుపై మంగ్లీ సంచలన వ్యాఖ్యలు.. మీడియా సాక్షిగా సింగర్ మంగ్లీ కన్నీటి పర్యంతం.! Pawan Kalyan: ఆశా భోంస్లేది ఒక ఐకానిక్ స్వరం.. లెజెండరీ గాయని మృతిపై పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి! Nara Lokesh: ఏప్రిల్ 14న చారిత్రక ఘట్టం.. అమరావతి వేదికగా భారత్ మొట్టమొదటి 'ఓపెన్-యాక్సెస్' క్వాంటం కంప్యూటర్ ప్రారంభం.! Nimmala Ramanayudu: "జగన్ పోకడలు భరించలేం.. అతన్ని బెంగళూరులోనే ఉంచండి" అని విజయమ్మ నాడే చెప్పారు: మంత్రి నిమ్మల TDP vs YCP: అమరావతిపై విషప్రచారమా? వాస్తవమా? సవాల్ స్వీకరించిన వంశీకృష్ణ.. వెనక్కి తగ్గిన నాగమల్లేశ్వరి? Praja Vedika: రేపు (13/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Health Tips: వీరు ఈ పండు అస్సలు తినకూడదు... తింటే బాడీ లో ఆ పార్ట్ పనిచేయదట! Tamil Nadu Elections 2026: ఎన్నికల వేళ విజయ్ వ్యూహం ఏంటి? ప్రచార సభల రద్దు వెనుక అసలు కారణాలివేనా? Amarnath Yatra: భక్తులకు అలర్ట్.. యాత్రకు వెళ్లే వారు ఇవి మర్చిపోకండి.. అమర్‌నాథ్ రిజిస్ట్రేషన్లు మరియు హెల్త్ సర్టిఫికేట్లపై కీలక అప్‌డేట్.! Hyderabad-Vijayawada: విజయవాడ-హైదరాబాద్ మధ్య కొత్త విమాన సర్వీసు ప్రారంభం! Singer Mangli: నాపై ఆరోపణలు నిరూపిస్తే దేనికైనా సిద్ధం.. న్యాయవాది సుబ్బారావుపై మంగ్లీ సంచలన వ్యాఖ్యలు.. మీడియా సాక్షిగా సింగర్ మంగ్లీ కన్నీటి పర్యంతం.! Pawan Kalyan: ఆశా భోంస్లేది ఒక ఐకానిక్ స్వరం.. లెజెండరీ గాయని మృతిపై పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి! Nara Lokesh: ఏప్రిల్ 14న చారిత్రక ఘట్టం.. అమరావతి వేదికగా భారత్ మొట్టమొదటి 'ఓపెన్-యాక్సెస్' క్వాంటం కంప్యూటర్ ప్రారంభం.! Nimmala Ramanayudu: "జగన్ పోకడలు భరించలేం.. అతన్ని బెంగళూరులోనే ఉంచండి" అని విజయమ్మ నాడే చెప్పారు: మంత్రి నిమ్మల TDP vs YCP: అమరావతిపై విషప్రచారమా? వాస్తవమా? సవాల్ స్వీకరించిన వంశీకృష్ణ.. వెనక్కి తగ్గిన నాగమల్లేశ్వరి? Praja Vedika: రేపు (13/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Health Tips: వీరు ఈ పండు అస్సలు తినకూడదు... తింటే బాడీ లో ఆ పార్ట్ పనిచేయదట! Tamil Nadu Elections 2026: ఎన్నికల వేళ విజయ్ వ్యూహం ఏంటి? ప్రచార సభల రద్దు వెనుక అసలు కారణాలివేనా? Amarnath Yatra: భక్తులకు అలర్ట్.. యాత్రకు వెళ్లే వారు ఇవి మర్చిపోకండి.. అమర్‌నాథ్ రిజిస్ట్రేషన్లు మరియు హెల్త్ సర్టిఫికేట్లపై కీలక అప్‌డేట్.! Hyderabad-Vijayawada: విజయవాడ-హైదరాబాద్ మధ్య కొత్త విమాన సర్వీసు ప్రారంభం!

TDP vs YCP: అమరావతిపై విషప్రచారమా? వాస్తవమా? సవాల్ స్వీకరించిన వంశీకృష్ణ.. వెనక్కి తగ్గిన నాగమల్లేశ్వరి?

TDP vs YCP: అమరావతి అభివృద్ధిపై వైసీపీ ప్రతినిధి మంచా నాగమల్లేశ్వరి విసిరిన సవాల్‌ను స్వీకరించిన తెలుగుయువత నేత బండారు వంశీకృష్ణ. సీఆర్డీఏ కార్యాలయం వద్ద గంటల తరబడి వేచి చూసినా వైసీపీ ప్రతినిధి రాకపోవడంతో సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. అసలు ఏం జరిగిందంటే?

Published : 2026-04-12 20:37:00

చెప్పిన మాట ప్రకారం వంశీకృష్ణ రాక

వర్షం సాకుతో కాలయాపన?

రాత్రి వేళ వీడియోతో ప్రత్యక్షం

TDP vs YCP: : గత శుక్రవారం ఉదయం 'ప్రైమ్ 9' న్యూస్ ఛానల్ నిర్వహించిన 'హాట్ టాపిక్' చర్చా కార్యక్రమంలో అమరావతి రాజధాని అంశంపై తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. ఈ డిబేట్‌లో వైసీపీ ప్రతినిధి మంచా నాగమల్లేశ్వరి మాట్లాడుతూ.. అమరావతిలో అసలు పనులే జరగడం లేదని, బయట వ్యక్తులను లోపలికి రానివ్వడం లేదని ఆరోపించారు. ఒకవేళ అభివృద్ధి జరుగుతుంటే చూపించాలని, తాను ప్రత్యక్షంగా చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. ఈ సవాల్‌ను తెలుగుయువత రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ వెంటనే స్వీకరించారు. అక్కడికక్కడే సమయం కూడా ఖరారైంది.

మధ్యాహ్నం 3 గంటలకు అమరావతికి వస్తానని నాగమల్లేశ్వరి చెప్పడంతో, బండారు వంశీకృష్ణ సరిగ్గా అదే సమయానికి అమరావతిలోని సీఆర్డీఏ (CRDA) కార్యాలయానికి చేరుకున్నారు. తన ఫోన్ నంబర్‌ను కూడా డిబేట్ లోనే బహిరంగంగా ప్రకటించిన వంశీకృష్ణ, ఆమె రాక కోసం ఎదురుచూస్తూ సోషల్ మీడియాలో లైవ్ వీడియో ద్వారా సమాచారం అందించారు. సాయంత్రం 4 గంటలకు డిబేట్ నిర్వాహకుడు రాజు కూడా అక్కడికి చేరుకున్నారు.

వంశీకృష్ణ అక్కడ వేచి ఉండగా.. నాగమల్లేశ్వరి ఫోన్ చేసి వర్షం కారణంగా ఆలస్యమవుతోందని, మరో అరగంటలో వస్తానని చెప్పారు. అయితే గంటలు గడుస్తున్నా ఆమె రాలేదు. 6:30 గంటల సమయంలో వంశీకృష్ణ, మోడరేటర్ రాజు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆమె స్పందించలేదు. చివరకు రాత్రి 7 గంటల వరకు వేచి చూసిన వంశీకృష్ణ, అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రాజధానిపై వైసీపీ నేతలు అసత్య ప్రచారాలు మానుకోవాలని హితవు పలికి ఆయన అక్కడి నుండి వెనుతిరిగారు.

అంతా అయిపోయిందని అనుకుంటున్న తరుణంలో, రాత్రి 8 గంటల తర్వాత నాగమల్లేశ్వరి ఒక వీడియోను విడుదల చేశారు. తాను అమరావతికి వచ్చానని అందులో పేర్కొన్నారు. అయితే, సవాల్ విసిరిన సమయానికి రాకుండా, ఎదుటి పక్షం నేతలు వెళ్ళిపోయిన తర్వాత రహస్యంగా వచ్చి వీడియోలు పెట్టడంపై నెటిజన్లు మండిపడుతున్నారు.

ఈ పరిణామాలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. "చర్చకు పిలిచి ముఖం చాటేయడం ఎందుకు?" అని కొందరు ప్రశ్నిస్తుంటే, వైసీపీ కావాలనే విషప్రచారం చేస్తోందని మరికొందరు విమర్శిస్తున్నారు. మొత్తానికి అమరావతి కేంద్రంగా జరిగిన ఈ 'ఛాలెంజ్' రాజకీయం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది.

Spotlight

Read More →