ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. తాజాగా కాశీబుగ్గ పోలీసులకు గంజాయి ముఠా పట్టుబడింది. గంజాయి తరలిస్తున్న నలుగురిని సోమవారం కాశీబుగ్గ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠాలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. గంజాయిని బ్యాగులో వేసుకొని ప్రయాణికుల్లా పలాస రైల్వేస్టేషన్ రోడ్డులో వెళుతుండగా.. ఆ సమయంలో అక్కడ మఫ్టీలో ఉన్న పోలీసులు తనిఖీ చేయగా గంజాయితో దొరికిపోయారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మరోవైపు శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే స్టేషన్‌లో ఆదివారం రాత్రి 2వ నెంబరు ఫ్లాట్‌ఫారంపై అధికారులు సోదాలు చేస్తున్న క్రమంలో వారికి ఒడిశా రాష్ట్రం బరంపురానికి చెందిన శంకరం మిశ్రా, గంజాం జిల్లా బాల్యకు చెందిన సరోజ్‌కుమార్‌సాహు.. నాలుగు బ్యాగులు పట్టుకుని అనుమానాస్పదంగా కనిపించారు. వారిని ప్రశ్నించడంతో బ్యాగులు అక్కడే పడేసి పారిపోయే ప్రయత్నం చేశారు.వెంటనే సిబ్బంది వారిని పట్టుకొని బ్యాగులు పరిశీలించగా మొత్తంగా 42 కిలోల గంజాయి పొట్లాలు గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకుని.. ఆ ఇద్దరినీ అరెస్టు చేసి.. విశాఖపట్నం రైల్వే కోర్టులో హాజరుపరిచారు. 42కిలోల గంజాయి విలువ రూ.10లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి