లండన్ వెళ్లే విద్యార్థులకు షాక్... న్యూ వీసా రూల్స్...

2024-01-02 06:10:00

లండన్: బ్రిటిష్ యూనివర్సిటీల్లో ప్రవేశాలు పొందే భారతీయులతో సహా అంతర్జాతీయ విద్యార్థులకు వీసా కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఇక నుంచి విద్యార్థి వీసాపై వారి కుటుంబ సభ్యులను తీసుకురావడం కుదరదు. పోస్టుగ్రాడ్యుయేట్ రీసెర్చ్ కోర్సులతో పాటు ప్రభుత్వ స్కాలర్షిప్ కోర్సులు చేసే వారికి మాత్రం మినహాయింపు ఉంటుంది. వలసల నియంత్రణలో భాగంగా తీసుకువచ్చిన ఈ కఠిన నిబంధనలు నేటి నుంచి అమలు చేస్తున్నట్లు బ్రిటన్ పేర్కొంది.బ్రిటన్ కు వస్తోన్న విదేశీ విద్యార్థులు తమ కుటుంబీకులను తీసుకురావడం ఇటీవల భారీగా పెరిగింది.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

2019 నుంచి 930శాతం పెరిగినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. 2019 సెప్టెంబర్ 14,839 వీసాలు జారీ చేయగా.. సెప్టెంబర్ 2023 నాటికి ఈ సంఖ్య 1.52లక్షలకు పెరిగినట్లు బ్రిటన్ జాతీయ గణాంకాల కార్యాలయం (ONS) వెల్లడించింది. వీటితోపాటు అక్రమ వలసలపైనా బ్రిటన్ కఠినంగా వ్యవహరించేందుక సిద్ధమైంది.

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →