Employees: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ చెల్లింపులు.. జీవోలో కీలక మార్పులు! ఉత్తర్వులు జారీ!

ప్రస్తుతం సమాజంలో థైరాయిడ్ సమస్య వేగంగా పెరుగుతోంది. చిన్నవారు, పెద్దవారు అనే తేడా లేకుండా ఈ వ్యాధి చాలా మందిని వేధిస్తోంది. జీవనశైలిలో మార్పులు, శారీరక శ్రమ లేకపోవడం, బిజీ లైఫ్, ఒత్తిడి, ఆహారపు అలవాట్లలో మార్పులు ఇవన్నీ థైరాయిడ్ సమస్యకు కారణమవుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మహిళల్లో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తోందని, దీని వల్ల పీరియడ్స్ అసమాన్యత, బరువు పెరగడం, అలసట, నిద్రలేమి వంటి సమస్యలు ఎక్కువవుతున్నాయని వారు సూచిస్తున్నారు.

3 రోజుల్లో 25 సమావేశాలు... యూఏఈలో చంద్రబాబు పర్యటన షెడ్యూల్ ఇదే! తొలిరోజు పర్యటనిలా...

థైరాయిడ్ ఉన్నవారు తినే ఆహారంలో జాగ్రత్తలు చాలా అవసరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా బ్రోకలి, క్యాబేజీ, కాలీఫ్లవర్ వంటి కూరగాయలు తినకూడదని చెబుతున్నారు. ఇవి థైరాయిడ్ గ్రంథి పనితీరును అడ్డుకుంటాయని నిపుణులు అంటున్నారు. అలాగే సోయా ఉత్పత్తులు కూడా హార్మోన్ ఉత్పత్తిని తగ్గించే ప్రమాదం ఉందని తెలిపారు. సోయాలో ఉండే ఐసోఫ్లేవన్స్ అనే పదార్థం థైరాయిడ్ హార్మోన్లపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వైద్యులు వివరిస్తున్నారు.

గూగుల్ AI హబ్‌తో విశాఖకు భారీ బూస్ట్.. తమిళనాట రాజకీయ రగడ.. ఒక్క మాటతో తేల్చేసిన లోకేశ్!

అలాగే అధికంగా చక్కెర ఉన్న ఆహారం, ప్యాక్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ తీసుకోవడం కూడా థైరాయిడ్ పనితీరును దెబ్బతీస్తుంది. వీటివల్ల హార్మోన్ స్థాయిల్లో మార్పులు వచ్చి సమస్య మరింత పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా మద్యం సేవించడం, అధికంగా టీ, కాఫీలు తాగడం కూడా థైరాయిడ్ మందుల ప్రభావాన్ని తగ్గిస్తుందని హెచ్చరిస్తున్నారు. ఫ్యాట్ అధికంగా ఉన్న ఆహారం కూడా ట్యాబ్లెట్ల ప్రభావాన్ని తగ్గిస్తుందని వారు సూచించారు.

TATA Cars: ఎలక్ట్రిక్ కార్లలోనూ టాటా దూకుడు..! పండగ సీజన్‌లో రికార్డు అమ్మకాలు..!

థైరాయిడ్ ఉన్నవారు తినాల్సిన ఆహారాలపై కూడా వైద్యులు స్పష్టత ఇచ్చారు. గుడ్లు, బాదం, వేరుసెనగలు, సన్‌ఫ్లవర్ గింజలు, తాజా పండ్లు, కూరగాయలు, మిల్లెట్స్, గోధుమ రొట్టెలు వంటి ఆహారం ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెప్పారు. ఇవి శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, విటమిన్లు అందిస్తాయి. అలాగే ప్రతిరోజూ సరిపడా నీరు తాగడం, వ్యాయామం చేయడం ద్వారా థైరాయిడ్ సమస్యను నియంత్రణలో ఉంచవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

Bhagavad Gita: సంప్రదాయాలే ఆచారం.. శాస్త్ర విహిత కర్మాచరణ ద్వారానే మోక్ష సాధ్యం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -39!

మొత్తం మీద, థైరాయిడ్ ఒక సాధారణమైన కానీ నిర్లక్ష్యం చేస్తే తీవ్రమయ్యే వ్యాధి. సరైన ఆహారం, వ్యాయామం, మందుల వినియోగం, జీవనశైలిలో మార్పులతో దీన్ని సులభంగా నియంత్రించవచ్చు. ఆరోగ్య నిపుణులు చెబుతున్న సూచనలను పాటించడం ద్వారా థైరాయిడ్ సమస్యను తగ్గించి, ఆరోగ్యకరమైన జీవనాన్ని కొనసాగించవచ్చని వైద్యులు తెలిపారు.

Samantha Instagram: రాజ్ నిడిమోరుతో కలిసి సమంత దీపావళి సంబరాలు.. నా మనసు కృతజ్ఞతతో నిండిపోయింది అంటూ ఇన్‌స్టాలో షేర్!
Runway: ఏపీలో అతిపెద్ద రన్ వే... ఎన్నో ఏళ్ల కల! ఎగరబోతున్న తొలి విమానం... ఎప్పుడంటే!
EMI: బ్యాంకు రుణం ఆలస్యంగా చెల్లిస్తే ఏమవుతుంది..? EMI డిఫాల్ట్‌ నిజమైన ప్రభావం..!
PM Modi: ఆపరేషన్ సిందూర్‌కు శ్రీరాముడే స్ఫూర్తి.. ప్రధాని మోదీ!
Chandrababu: పేలుడు ఘటన! మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల పరిహారం అందించిన చంద్రబాబు!