నాట్స్ బోర్డు అధ్యక్షుడిగా పిన్నమనేని ప్రశాంత్

ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ(నాట్స్) 2024-25 బోర్డు ఛైర్మన్‌గా ప్రశాంత్ పిన్నమనేని ఎన్నికయ్యారు. ఇదే కాలానికి గానూ నూతన డైరక్టర్ల బోర్డు సభ్యులను ప్రకటించార

Published : 2024-01-01 08:30:00

ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ(నాట్స్) 2024-25 బోర్డు ఛైర్మన్‌గా ప్రశాంత్ పిన్నమనేని ఎన్నికయ్యారు. ఇదే కాలానికి గానూ నూతన డైరక్టర్ల బోర్డు సభ్యులను ప్రకటించారు. నాట్స్ బోర్డు ఉపాధ్యక్షుడిగా నంద కిషోర్ కంచర్ల, కార్యదర్శిగా మధు బోడపాటి వ్యవహరిస్తారని ఓ ప్రకటనలో తెలిపారు. ఫ్లోరిడాలో నాట్స్ చేస్తున్న కార్యక్రమాల్లో ప్రశాంత్ పిన్నమనేని కీలక పాత్ర పోషిస్తున్నారు. నాట్స్‌లో అంచలంచెలుగా ఆయన ఈ స్థాయికి ఎదిగారు. ప్రస్తుతం నాట్స్ బోర్డు ఉపాధ్యక్షురాలు అరుణ గంటి నుంచి ప్రశాంత్ పిన్నమనేని నూతన బోర్డ్ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. నాట్స్ లక్ష్యాలను, ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని ప్రశాంత్ తెలిపారు. తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ అరుణ గంటి ధన్యవాదాలు తెలిపారు.నాట్స్ సలహా సంఘానికి కూడా నూతన కార్యవర్గాన్ని ఈ సందర్భంగా ప్రకటించారు.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న  క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →