Ramayapatnam: రామాయపట్నం పోర్టు అభివృద్ధి వేగవంతం.. రైలు మార్గం నిర్మాణం!

Ramayapatnam: ఉమ్మడి ప్రకాశం జిల్లాకు కీలకంగా మారనున్న రామాయపట్నం పోర్టు అభివృద్ధి పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయి. ఈ ఏడాదిలోనే పోర్టు కార్యకలాపాలు ప్రారంభించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

Published : 2026-04-22 18:11:00

రామాయపట్నం పోర్టులో కార్యకలాపాలు ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు..

మొత్తం 7.2 కిలోమీటర్ల మేర రైలు మార్గం..

ఉమ్మడి ప్రకాశం జిల్లాకు కీలకంగా మారనున్న రామాయపట్నం పోర్టు అభివృద్ధి పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయి. ఈ ఏడాదిలోనే పోర్టు కార్యకలాపాలు ప్రారంభించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

ఈ నేపథ్యంలో పోర్టుకు అనుసంధానంగా రైలుమార్గం నిర్మాణ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. మొత్తం 7.2 కిలోమీటర్ల మేర నేరుగా పోర్టుకు కలుపుతూ ఈ రైల్వే లైన్‌ను నిర్మిస్తున్నారు. రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు సరుకు రవాణా వేగవంతం కావడానికి ఈ మార్గం కీలకంగా మారనుంది.

ఈ ఏడాదిలోనే రైలుమార్గ నిర్మాణాన్ని పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. పోర్టు పనులతో సమాంతరంగా రైల్వే కనెక్టివిటీ ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. పోర్టుకు రైలుమార్గం నిర్మాణంపై ఇప్పటికే మంత్రుల ఉన్నతస్థాయి కమిటీ సమావేశంలో సమగ్రంగా చర్చ జరిగింది. పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగానికి స్పష్టమైన దిశానిర్దేశాలు ఇచ్చారు.

ప్రత్యేకంగా స్థల సేకరణ, నిర్మాణ పనుల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించడంతో పనులు వేగవంతమయ్యాయి. రామాయపట్నం పోర్టు పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభిస్తే ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి ఊతమిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు, పరిశ్రమలకు కూడా ఇది కీలక కేంద్రంగా మారనుందని అధికారులు భావిస్తున్నారు.

Spotlight

Read More →