International news: వ్యవసాయం నుంచి ఇంధనం వరకు… ట్రంప్–జిన్‌పింగ్ చర్చలు ఆర్థిక సహకారానికి కొత్త పునాది! Jamaica Cyclone news : భీకర తుపాను ప్రభావంతో చీకటి కమ్మేసిన దేశం… చరిత్రలో ఎప్పుడూ లేనంత నష్టం! గంటకు 295 కి.మీ. వేగంతో ప్రళయం తలపించే దృశ్యాలు! LIC : వాషింగ్టన్ పోస్ట్‌ ఆరోపణలపై ఎల్‌ఐసీ స్పష్టం – పెట్టుబడులపై ఎలాంటి ఒత్తిళ్లు లేవు! International news: వ్యవసాయం నుంచి ఇంధనం వరకు… ట్రంప్–జిన్‌పింగ్ చర్చలు ఆర్థిక సహకారానికి కొత్త పునాది! Jamaica Cyclone news : భీకర తుపాను ప్రభావంతో చీకటి కమ్మేసిన దేశం… చరిత్రలో ఎప్పుడూ లేనంత నష్టం! గంటకు 295 కి.మీ. వేగంతో ప్రళయం తలపించే దృశ్యాలు! LIC : వాషింగ్టన్ పోస్ట్‌ ఆరోపణలపై ఎల్‌ఐసీ స్పష్టం – పెట్టుబడులపై ఎలాంటి ఒత్తిళ్లు లేవు!

బోరింగ్ చట్నీలకు బై బై... కర్ణాటక స్పెషల్ ఉచేలు చట్నీ! ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!

2025-11-03 16:48:00
ప్రపంచానికి అత్యంత స్వచ్ఛమైన బంగారాన్ని అందిస్తున్న దేశాలు! అగ్రస్థానంలో నిలిచిన ఆరు దేశాలు ఇవే!

ఉదయాన్నే మన ఇళ్లలో ఎక్కువగా ఇడ్లీ, దోశ, పునుగులు వంటివి చేస్తుంటాం. వాటికి సైడ్ డిష్‌గా పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ లేదా టమాటా చట్నీ వంటివి చేస్తారు. కానీ ప్రతిరోజూ ఇవే చట్నీలు తింటూ విసుగొస్తే, ఒకసారి కర్ణాటక స్పెషల్ ఉచేలు చట్నీ (నువ్వుల పచ్చడి)ని తప్పక ప్రయత్నించాలి. ఈ పచ్చడికి ఘుమఘుమలాడే సువాసన, కమ్మని రుచి, ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ కలిపి ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తాయి. సాధారణంగా నువ్వులను మనం లడ్డూలు, మురుకులు వంటి పిండివంటలలో వాడుతాం కానీ, ఈ చిన్న గింజలతో చట్నీ చేస్తే అది ఎంత రుచిగా ఉంటుందో ఒక్కసారి రుచి చూస్తే తెలుస్తుంది.

Netflixs new series: కర్గిల్ యుద్ధం నేపథ్యంలో నెట్‌ఫ్లిక్స్ కొత్త సిరీస్.. ఆపరేషన్ సఫేద్ సాగర్!

ఈ కర్ణాటక స్పెషల్ ఉచేలు చట్నీ తయారీలో కావాల్సిన పదార్థాలు సులభంగా లభిస్తాయి — నువ్వులు, పచ్చి కొబ్బరి తురుము, ఎండు మిరపకాయలు, వెల్లుల్లి, కొత్తిమీర, చిటికెడు చక్కెర, ఉప్పు, అలాగే తాలింపు కోసం నూనె, ఆవాలు, కరివేపాకు వంటివి. ఈ చట్నీకి ప్రత్యేకత ఏమిటంటే — దీనికి ఎక్కువ తాలింపు అవసరం లేదు. తక్కువ సమయంలో సిద్ధమవుతుందికావడంతో ఉదయపు బ్రేక్‌ఫాస్ట్‌కు ఇది బెస్ట్ ఆప్షన్‌.

Jobs Alert: ఏపీలో ఆయూష్‌ శాఖలో భారీ నియామకాలు..! వెంటనే దరఖాస్తు చేయండి..!

ముందుగా ఒక పాన్‌లో నువ్వులను మధ్యస్థ మంటపై సువాసన వచ్చే వరకు వేయించాలి. నువ్వులు రంగు మారగానే దించేసి చల్లారనివ్వాలి. తర్వాత ఒక మిక్సీ గిన్నెలో పచ్చి కొబ్బరి, వెల్లుల్లి, ఎండు మిరపకాయలు, కొత్తిమీర, చక్కెర, ఉప్పు వేసి ముందుగా నీళ్లు పోయకుండా ఒకసారి రుబ్బాలి. తర్వాత చల్లారిన నువ్వులను వేసి, కొద్దికొద్దిగా నీళ్లు పోసి మెత్తగా పేస్ట్‌లా చేసుకోవాలి.

Maruti Suzuki: మారుతి సుజుకి కొత్త మోడల్స్ హైలైట్..! తక్కువ ధరలో అధునాతన ఫీచర్లతో ఆకట్టుకుంటున్న వాహనాలు..!

ఈ పచ్చడికి చివరగా తాలింపు ఇస్తే రుచి మరింత పెరుగుతుంది. ఒక చిన్న పాన్‌లో నూనె వేసి వేడి చేసిన తర్వాత ఆవాలు వేయాలి. అవి చిటపటలాడిన తర్వాత కరివేపాకు, తుంచిన ఎండు మిరపకాయలు వేసి కాసేపు వేయించి, ఈ తాలింపును పచ్చడిలో కలపాలి. అలా కలిపిన తర్వాత పచ్చడి సిద్ధం.

PR Department: పంచాయతీరాజ్ ఉద్యోగులకు శుభవార్త..! ప్రమోషన్ నిబంధనల్లో కీలక మార్పు..!

తాజాగా తయారైన ఈ ఉచేలు చట్నీని వేడివేడి ఇడ్లీ, దోశ, ఊతప్పం లేదా పునుగులతో తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. అంతేకాక, జొన్న రొట్టెలు లేదా రాగి సంకటి వంటి సంప్రదాయ ఆహారాలతో కూడా ఇది బాగా సరిపోతుంది. పోషక విలువలు ఎక్కువగా ఉన్న నువ్వులు ఆరోగ్యానికి మేలు చేస్తాయి కాబట్టి, ఇది రుచికరమైనదే కాకుండా ఆరోగ్యకరమైన చట్నీ కూడా.

Saudi Updates: సౌదీ అరేబియాలో మూడు దశల్లో సైరన్ టెస్ట్... మొబైల్‌కు హెచ్చరిక, అలర్ట్ టోన్.. ఆ తర్వాత సైరన్ సౌండ్!
Anil Ambanis: ఈడీ పెద్ద షాక్.. అనిల్ అంబానీ రూ.3,084 కోట్ల ఆస్తులు అటాచ్!
Farmers: రబీ సీజన్‌కు ఏపీ సిద్ధం..! రైతుసేవా కేంద్రాల్లో రాయితీ విత్తనాలతో...!
Atlas Browser: బెస్ట్ ఏజెంట్ మోడ్... ఓపెన్ ఏఐ అట్లాస్ బ్రౌజర్.. టాప్ ఫీచర్స్ ఇవే!
Railway Projects: ఏపీలో రైల్వే విస్తరణకు గ్రీన్‌ సిగ్నల్‌..! 26 కొత్త ప్రాజెక్టులు.. ఆ ప్రాంతంలో మూడు రైల్వే లైన్లు..!

Spotlight

Read More →