ఆంధ్రప్రదేశ్ ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సింగపూర్ పర్యటనకు చేరుకున్నారు. సీఎం చంద్రబాబు నాయుడుతో కలిసి ఆయన ఐదు రోజుల విదేశీ పర్యటనలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా సింగపూర్‌లోని తెలుగు ప్రజలు మంత్రి లోకేశ్‌కు పుష్పగుచ్ఛాలతో grand welcome ఇచ్చారు. రాష్ట్రానికి పెట్టుబడులు ఆహ్వానించడం, బ్రాండ్ ఏపీని అంతర్జాతీయంగా ప్రోత్సహించడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశంగా ఉంది.
ఈరోజు మధ్యాహ్నం సింగపూర్‌లోని Telugu diaspora సభ్యులతో మంత్రి లోకేశ్, ముఖ్యమంత్రి చంద్రబాబు కలిసి సమావేశం కానున్నారు. ఇందులో రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడుల అవకాశాలు, విద్యా రంగంలో భాగస్వామ్యాలు వంటి అంశాలపై చర్చలు జరగనున్నాయి. గతంలో కూడా విదేశీ పర్యటనల ద్వారా పెట్టుబడులు సంపాదించడంలో చంద్రబాబు ప్రభుత్వానికి మంచి అనుభవం ఉన్న విషయం తెలిసిందే.
లోకేశ్ పర్యటన సందర్భంగా ఆయన పలు అధికారిక సమావేశాలు, బిజినెస్ మీట్లు నిర్వహించనున్నారు. రాష్ట్రంలో ఐటీ రంగానికి నూతన దిశ ఇవ్వడమే కాక, సింగపూర్‌తో విద్యా రంగంలో ఒప్పందాలకు సిద్ధపడే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఇందులో భాగంగా విద్యార్థులకి మెరుగైన అవకాశాలు అందించేందుకు విదేశీ విశ్వవిద్యాలయాలతో భాగస్వామ్యాలు ఏర్పడే అవకాశం ఉంది.
అంతేకాదు, విదేశీ పెట్టుబడిదారులకు ఏపీలోని అవకాశాలు పరిచయం చేయడం ద్వారా, రాష్ట్రానికి పెట్టుబడుల రాకకు దారితీయాలనే లక్ష్యంతో ఈ పర్యటన చేపట్టబడింది. బ్రాండ్ ఏపీని ప్రపంచానికి పరిచయం చేయడంలో లోకేశ్ యాక్టివ్ రోల్ పోషించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.