భారతదేశానికి చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ లావా (Lava), తక్కువ ధరలో అత్యాధునిక ఫీచర్లతో కూడిన కొత్త 5G smartphone "Blaze Dragon 5G"ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఫోన్ ధర కేవలం ₹9,999 మాత్రమే. మంచి డిస్‌ప్లే, శక్తివంతమైన బ్యాటరీ, మంచి కెమెరాలతో పాటు 5G సపోర్ట్ వంటి లభ్యమయ్యే ఫీచర్లను ఈ మొబైల్ అందిస్తుంది.
ఈ Blaze Dragon 5G ఫోన్ 6.745 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేతో రానుంది, దీనికి 120Hz రిఫ్రెష్‌రేట్ ఉండడం విశేషం. ప్రీమియం డిజైన్‌తో పాటు, గోరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌తో వస్తోంది. ఇందులో Snapdragon 4 Gen 2 ప్రాసెసర్, 4GB LPDDR4x RAM (ఇంకా 4GB వర్చువల్ RAM) లభిస్తుంది. స్టోరేజ్ పరంగా 128GB UFS 3.1 తో వస్తుంది. Android 15 clean version (బ్లోట్‌వేర్ లేని యూజర్ ఇంటర్‌ఫేస్) ఇందులో ఉంటుంది.
ఫోటోగ్రఫీ ప్రేమికుల కోసం 50MP రేర్ కెమెరా మరియు 8MP సెల్ఫీ కెమెరా లభిస్తుంది. పోర్ట్రెయిట్, నైట్ మోడ్, ఫుల్ HD వీడియో రికార్డింగ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. 5000mAh సామర్థ్యం గల బ్యాటరీకి 18W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ Type-C పోర్ట్ ద్వారా లభిస్తుంది. 5G, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi, Bluetooth 5.4 వంటి ఆధునిక కనెక్టివిటీ సదుపాయాలు ఉన్నాయి.
లాంచ్ ఆఫర్‌లో భాగంగా, ఈ ఫోన్‌పై ₹1,000 బ్యాంక్ డిస్కౌంట్, ఇంకా ఎక్స్‌ఛేంజ్‌పై అదనంగా ₹1,000 తగ్గింపు లభించనుంది. August 1 నుండి ఈ ఫోన్ Amazon లో అందుబాటులోకి రానుంది. రెండు రంగుల్లో గోల్డెన్ మిస్ట్, మిడ్‌నైట్ మిస్ట్ లలో ఈ మొబైల్ లభిస్తుంది. ఇది ఫస్ట్ టైమ్ 5G users కోసం budget లో వచ్చిన అత్యుత్తమ ఎంపికగా చెప్పవచ్చు.