- Politics: వైసీపీ నేతల ఒత్తిళ్లతో దొంగ పాస్ పుస్తకాల జారీపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు..
- రీసర్వేతో సగం భూమి మాయం.. రికార్డుల్లో 2.56 ఎకరాలను 1.21 ఎకరాలు చేసిన అధికారులు..
- బీసీ సంక్షేమ, జౌళి శాఖ మంత్రి సంజీవరెడ్డి గారి సవిత, ఏపీ వన్నెకుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ సీఆర్ రాజన్..
Praja Darbar: ఏలూరు జిల్లా పెదపాడుకు చెందిన పోతురాజు నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజావినతుల స్వీకరణ కార్యక్రమంలో నేతలకు అర్జీ ఇచ్చి అభ్యర్థిస్తూ.. తమకు తమ గ్రామంలో 10 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. తాము ఐదుగురు సంతానం ఉన్నాం. అయితే ఈ భూమిపై కన్నేసిన గుర్రుడి ప్రసాద్, కామాజాన్ పీటర్ అనే వ్యక్తులు నకిలీ డాక్యుమెంట్లను సృష్టించారు. గత 2019 వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో వైసీపీ ఎంపీటీసీ, జడ్పీటీసీ, స్థానిక నాయకుల ఒత్తిళ్లకు లొంగి, అప్పటి ఎంఆర్‌ఓ , విఆర్‌ఓ లు విచారణ లేకుండానే ఆ నకిలీ పత్రాల ఆధారంగా భూమిని ఆన్‌లైన్ చేసి, వారికి దొంగ పాస్ పుస్తకాలు జారీ చేశారు. మొదటి నుండి తాము తెలుగుదేశం పార్టీ లో కొనసాగుతుండటంతో, స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు కొందరు స్థానిక వ్యక్తుల సహకారంతో తమను తీవ్రంగా వేధించారు. ఈ అన్యాయంపై హైకోర్టును ఆశ్రయించగా, కోర్టు తమకు అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కోర్టు ఆదేశాలను అమలు చేసి భూమిని తిరిగి తమ పేరుపై మార్చాల్సిన ఎంఆర్‌ఓ, విఆర్‌ఓలు.. అవతలి వ్యక్తి ఆర్డీఓ గారి వద్ద వేసిన అప్పీల్ సాకును చూపుతూ కావాలనే కాలయాపన చేస్తున్నారు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని నేతలు బీసీ సంక్షేమ, జౌళి శాఖ మంత్రి సంజీవరెడ్డి గారి సవిత, ఏపీ వన్నెకుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ సీఆర్ రాజన్ లకు అర్జీ ఇచ్చి అభ్యర్ధించారు.
విజయనగరంకు చెందిన పద్మ లియోని గ్రీవెన్స్ అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..తన తల్లి విశాఖపట్నంలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూ 1993లో మరణించారు. ఆమె మరణానంతరం వచ్చిన ఉద్యోగ ప్రయోజనాలు (డెత్ బెనిఫిట్స్) డబ్బుతో తన తండ్రి లేటు సలాది ముత్యాల రాయుడు విజయనగరంలో సుమారు 50 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. తల్లికి ఏకైక సంతానమైన తను మైనర్‌గా ఉన్నప్పుడు, తండ్రి రెండో వివాహం చేసుకున్నారు. 2020లో తండ్రి మరణించిన తర్వాత, రెండో భార్య కుమార్తెలు తప్పుడు సమాచారంతో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ పొంది ఆ భూమిని క్లైమ్ చేయాలని చూశారు. ఆ సమయంలో విజయనగరానికి చెందిన రియల్టర్ అప్పలరాజు తనని సంప్రదించి సహాయం చేస్తానని నమ్మించాడు. అతని సూచనల మేరకు తహసిల్దార్‌కు దరఖాస్తు చేసుకోగా, విచారణ జరిపిన అధికారులు రెండో భార్య కుమార్తెల తప్పుడు సర్టిఫికేట్‌ను రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
ఈ ప్రక్రియలో అప్పలరాజు తనను పూర్తిగా నమ్మించి, పలు ఖాళీ కాగితాలు, నాన్-జ్యుడీషియల్ స్టాంప్ పేపర్లపై తన సంతకాలు తీసుకున్నాడు. తాను అక్కడ స్థానికంగా ఉండకపోవడాన్ని ఆసరాగా చేసుకుని, ఆ సంతకాలతో తనకు తెలియకుండా 50 ఎకరాల భూమిని ఆక్రమించుకున్నాడు. ఈ 50 ఎకరాలకు తోడు మరికొంత భూమిని కలిపి, సుమారు 80 ఎకరాల విస్తీర్ణంలో 'A.R. గ్రౌండ్స్' పేరిట ఒక భారీ అక్రమ లేఅవుట్‌ను రాత్రికి రాత్రే సిద్ధం చేశారు. వైసీపీ జిల్లాకు చెందిన ఇతర ముఖ్య నేతల పూర్తి సహకారంతో, జిల్లా అధికారులను మభ్యపెట్టి ఈ దందా సాగించారు. ఈ లేఅవుట్ కోసం ప్రభుత్వ పంట కాలువలు, చిన్న చిన్న చెరువులను సైతం ఆక్రమించడమే కాకుండా, విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ వారి ఎటువంటి అనుమతులు లేకుండా చుట్టూ ప్రహరీ గోడను కూడా నిర్మించారు. ఈ అక్రమ లేఅవుట్ ద్వారా వైసీపీ నేతలు దాదాపు 700 కోట్ల రూపాయల లబ్ధి పొందుతున్నారు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.
2021లో తమ తల్లి మరణించారు. తల్లి మరణానంతరం మిగిలిన 1.87 ఎకరాల భూమి ఐదుగురు కొడుకులకు సమానంగా దక్కాల్సి ఉంది. కానీ, 5వ కుమారుడు షేక్ ఖాదర్ మస్తాన్ 2023లో అందులోని 1.14 ఎకరాల భూమిని తన పేరిట మార్పించుకోవడానికి ప్రయత్నించాడు. దీనిని మిగిలిన సోదరులు ప్రశ్నించడంతో, ఖాదర్ మస్తాన్ కోర్టును ఆశ్రయించి వారిపై 406/2023 నెంబర్‌తో కేసు వేశాడు. ఈ భూమిపై కోర్టులో కేసు నడుస్తోందని, ఎలాంటి మార్పులు చేయవద్దని గత 3 సంవత్సరాలుగా స్థానిక వీఆర్వో, తహసీల్దార్ లకు తాము లిఖితపూర్వకంగా నోటీసులు ఇస్తూనే ఉన్నాము. కోర్టు విచారణలో ఉన్న భూమి విషయంలో ఎలాంటి తుది ఉత్తర్వులు రాకుండా, కనీసం ఫీల్డ్ వెరిఫికేషన్ కూడా చేయకుండా.. ప్రస్తుత వీఆర్వోలు, తహసీల్దార్ లు వివాదాస్పద 1.87 ఎకరాల భూమిలో 1.14 ఎకరాలను షేక్ ఖాదర్ మస్తాన్ పేరిట (ఖాతా నెంబర్ 4235) ఆన్‌లైన్ లో ఎక్కించేశారు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరాడు.