Header Banner

సినిమా హాళ్ల బంద్‌పై కీలక ప్రకటన.. పవన్ కళ్యాణ్ సంచలన ఆదేశాలు!

  Tue May 27, 2025 15:12        Politics

సినిమా హాళ్ల బంద్ ప్రకటనలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు (Deputy CM Pawan kalyan) మంత్రి కందుల దుర్గేష్ (Minister Kandula Durgesh) వివరాలు అందజేశారు. ఈ క్రమంలో సినిమా థియేటర్‌లు, సినీపరిశ్రమలో సమస్యలపై పవన్ కళ్యాణ్ మీడియా ప్రకటన విడుదల చేశారు. సినిమా హాళ్ల నిర్వహణ పకడ్బందీగా ఉండాలన్నారు. థియేటర్లలో ఆహార పానీయాల నాణ్యత, ధరలపై నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్నారు. తన సినిమా అయినా సరే టికెట్ ధరల పెంపు కావాలంటే ఫిలిం ఛాంబర్ ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించాలని స్పష్టం చేశారు. రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తుందని తెలిపారు. సినిమా హాళ్ల బంద్ వెనుక ఉన్న శక్తులేమిటో విచారించాలని ఆదేశించారు. ఈ అవాంఛనీయ పరిస్థితికి కారకుల్లో జనసేన తరఫువాళ్ళు ఉన్నా చర్యలకు వెనుకాడవద్దని అన్నారు. రాష్ట్రంలో సినిమా హాళ్ల నిర్వహణను పకడ్బందీగా చేపట్టడం ద్వారా ప్రేక్షకులకు మెరుగైన సేవలు అందించాలని తెలిపారు. ఆ దిశగా సంబంధిత ప్రభుత్వ శాఖలు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని సూచించారు.

 

ఇది కూడా చదవండి: టీడీపీ జెండా.. తెలుగు జాతికి అండ! వైసీపీకి రాజకీయ భవిష్యత్తు లేదు.. యువగళం పేరుతో..

           

కొత్త చిత్రాలు విడుదల సందర్భంలో టికెట్ ధరల పెంపు నిమిత్తం నిర్మాతలు, వారికి సంబంధించిన వారు వ్యక్తిగత హోదాలో కాకుండా తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించే విధానాన్ని అమలు చేయాలని అన్నారు. త్వరలో విడుదలయ్యే హరిహర వీరమల్లు సినిమాకు కూడా టికెట్ ధరల పెంపు కోసం నిర్మాత వ్యక్తిగతంగా కాకుండా చలనచిత్ర వాణిజ్య మండలి ద్వారానే ప్రభుత్వానికి అర్జీ ఇచ్చి, సంప్రదింపులు చేయాలని వెల్లడించారు. ఇందులో తనమన బేధాలు పాటించవద్దని తెలిపారు. ప్రేక్షకులు సినిమా హాల్ వరకూ రావాలంటే.. టికెట్ ధర కంటే సినిమా హాల్లో పాప్ కార్న్ లాంటి తినుబండారాలు, శీతల పానీయాలు, చివరకు మంచి నీళ్ల సీసాల ధరలు భారీగా ఉన్నాయన్నారు. వాటి ధరలు ఎంత ఉంటున్నాయి, ఎంతకు విక్రయిస్తున్నారు, అసలు వాటిలో ఉండే నాణ్యత ప్రమాణాలు ఏమిటి అనేది కూడా సంబంధిత శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని వెల్లడించారు. ధరల నియంత్రణ కూడా చేపట్టాలని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మల్టీప్లెక్సులు, సింగిల్ స్క్రీ‌న్స్‌లో ఆహార పదార్థాలు, శీతల పానీయాల వ్యాపారంలోనూ గుత్తాధిపత్యం సాగుతోందనే విషయం కూడా ప్రభుత్వ దృష్టికి వచ్చినందున దీనిపై విచారణ చేపట్టాలని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రికిసూచించామన్నారు. ప్రేక్షకులు కుటుంబ సమేతంగా సినిమా హాలుకు రావాలంటే తినుబండారాలు, పానీయాల ధరలు చూసి వెనుకంజ వేసే పరిస్థితి రాకూడదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

 

ఇది కూడా చదవండి: విజయవాడ విమానాశ్రయానికి మహర్దశ! ఇక నుండి అక్కడికి డైరెక్ట్ సర్వీసులు!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏం అదృష్టం సార్..! అడ్డిమార్‌ గుడ్డిదెబ్బ కొడితే.. రూ. 231 కోట్ల జాక్ పాట్!

 

ఏపీలో మరో గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే.. రూ.1400 కోట్లతో..! ఆ రూట్లోనే, కేంద్రం గ్రీన్ సిగ్నల్!

 

లోకేశ్​కు పార్టీలో ఆ పదవి.. జోరుగా చర్చ! జీవీ, ఆనం కీలక వ్యాఖ్యలు!

 

వల్లభనేని వంశీకి దెబ్బపై దెబ్బ.. బెయిల్ పిటిషన్ కొట్టివేత!

        

అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి షాక్! 14 రోజుల రిమాండ్..

 

రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ జిల్లా పేరు మారుస్తూ జీవో జారీ!

 

వైసీపీకి మరో భారీ షాక్! ఏపీ పోలీసుల అదుపులో మాజీ మంత్రి!

 

కేంద్రం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌! రాష్ట్రానికి మరో 2 లక్షల కనెక్షన్లు!

 

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. జూన్ 2న కీలక ప్రకటనలు! కొత్త ఆరోగ్య పథకం..

 

ఏపీ పంట పండింది... కొత్తగా 2 రైల్వే లైన్లు! ఆ రూట్లోనే..!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Pawankalyan #AndhraPradesh #APpolitics #APNews #Speech #Jagan #Anakapalli