ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక, భద్రతా పరిస్థితుల కారణంగా బంగారం ధరలు గత కొన్ని సంవత్సరాలుగా రెట్టింపు స్థాయిలో పెరుగుతున్నాయి. మన దేశంలో కూడా తులం బంగారం ధర ₹1 లక్షకు చేరువవుతోంది. ఈ నేపథ్యంలో చైనా 2025 జూన్ నెలలో 'షాంఘై గోల్డ్ ఎక్స్ఛేంజ్' ద్వారా 90 టన్నుల బంగారాన్ని మార్కెట్లోకి విడుదల చేసింది. అంటే సుమారు 90,000 కిలోల బంగారం అమ్మకానికి వచ్చింది. ఇది చైనా ఇన్వెస్టర్లు బంగారంపై పెట్టుబడి పెంచుతున్న స్పష్టమైన సంకేతం. దీని ప్రభావం గ్లోబల్ గోల్డ్ మార్కెట్‌తో పాటు భారత మార్కెట్‌పై కూడా ప్రభావం చూపుతోంది.
చైనా బంగారాన్ని కేవలం నగలకే కాకుండా వ్యూహాత్మక పెట్టుబడి (Strategic Investment)గా చూస్తోంది. గ్లోబల్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక ప్రకారం, చైనా ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో ₹64,000 కోట్ల విలువైన గోల్డ్ ETFలలో పెట్టుబడులు పెట్టింది. అయితే జూన్‌లో ధరలు పెరగడం వల్ల ఆభరణాల డిమాండ్ 10% తగ్గింది. వినియోగదారులు కొత్తగా కొనుగోలుకు ఆసక్తి చూపించకపోవడం గమనార్హం. ఇది బంగారం మార్కెట్లో గణనీయమైన మార్పులకి సంకేతం.
మరోవైపు, బంగారం ధరలు అమెరికన్ డాలర్లలో 23%, చైనా యువాన్‌లో 21% పెరగడంతో దిగుమతుల పరంగా ప్రభావం చూపుతోంది. చైనా కేంద్ర బ్యాంక్ వరుసగా ఎనిమిది నెలలుగా బంగారం కొనుగోలుతో నిమగ్నమైంది. ప్రస్తుతం చైనా వద్ద మొత్తం 2,299 టన్నుల బంగారం నిల్వగా ఉంది. 2025 మేలో 89 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకున్నా, ఇది గత నెలతో పోల్చితే 21% తగ్గుదలగా నమోదైంది. ఆభరణాల డిమాండ్ తగ్గటమే ప్రధాన కారణం.
ఈ పరిణామాల వల్ల భారతీయ మార్కెట్‌పై కూడా ప్రభావం తప్పదు. చైనా నుండి పెట్టుబడులు, డిమాండ్ పెరగడం గోల్డ్ ధరలను ఇంకా పెంచే అవకాశం ఉంది. ఇది పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌లో బంగారం అమ్మకాలను ప్రభావితం చేస్తుంది. జువెలర్స్, చిన్న వ్యాపారులపై నెగటివ్ ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది. గ్లోబల్ గోల్డ్ కౌన్సిల్ అంచనాల ప్రకారం, మీడియం టర్మ్‌లో డిమాండ్ తగ్గితే ధరలు తగ్గే అవకాశముంది. కానీ ఇంతవరకూ ట్రెండ్ చూస్తే, బంగారం కొనుగోలుకు ఇది తగిన సమయం కాదని నిపుణులు సూచిస్తున్నారు.
 
       
   
   
   
 
                       
                   
                   
                   
         
         
         
         
         
         
         
         
        