Lok Sabha seats: 33 శాతం రిజర్వేషన్లు.. 15 ఏళ్ల అమలు.. సీట్ల పెంపుపై తెలంగాణ, ఏపీ నేతల తీవ్ర ఆందోళన..

Lok Sabha seats: దేశ రాజకీయాల్లో ప్రస్తుతం అత్యంత ఆసక్తికరంగా మారిన అంశం మహిళా రిజర్వేషన్ బిల్లు మరియు డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) బిల్లు. ఏప్రిల్ 16, 17 తేదీల్లో పార్లమెంటులో ఈ బిల్లులపై జరగబోయే చర్చలు దేశ భవిష్యత్తును, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రభావాన్ని ఎలా మార్చబోతున్నాయనేది ఇప్పుడు అందరి నోటా వినిపిస్తున్న మాట. ఈ నేపథ్యంలో, అసలు ఈ బిల్లులలో ఏముంది? వివాదం ఎక్కడ మొదలైంది? అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం..

Published : 2026-04-15 22:09:00
  • 850కి పెరగనున్న లోక్‌సభ సీట్లు: డీలిమిటేషన్ బిల్లుతో దేశ రాజకీయ ముఖచిత్రం మారనుందా?
     
  • Politics: "దక్షిణాది గొంతు నొక్కేస్తారా?": సీట్ల పెంపుపై తెలంగాణ, ఏపీ నేతల తీవ్ర ఆందోళన..

Lok Sabha seats: దేశ రాజకీయాల్లో ప్రస్తుతం అత్యంత ఆసక్తికరంగా మారిన అంశం మహిళా రిజర్వేషన్ బిల్లు మరియు డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) బిల్లు. ఏప్రిల్ 16, 17 తేదీల్లో పార్లమెంటులో ఈ బిల్లులపై జరగబోయే చర్చలు దేశ భవిష్యత్తును, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రభావాన్ని ఎలా మార్చబోతున్నాయనేది ఇప్పుడు అందరి నోటా వినిపిస్తున్న మాట. ఈ నేపథ్యంలో, అసలు ఈ బిల్లులలో ఏముంది? వివాదం ఎక్కడ మొదలైంది? అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం..

నారీ శక్తి వందన అధినయం: మహిళలకు 33% రిజర్వేషన్లు
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న మహిళా రిజర్వేషన్ బిల్లుకు 'నారీ శక్తి వందన అధినయం' అని పేరు పెట్టారు. ఈ బిల్లు ప్రకారం, లోక్‌సభలోనూ, రాష్ట్రాల అసెంబ్లీలలోనూ, అలాగే ఢిల్లీ అసెంబ్లీలోనూ మహిళలకు 33 శాతం సీట్లు కేటాయిస్తారు. ఈ రిజర్వేషన్లు మొదట 15 సంవత్సరాల పాటు అమల్లో ఉంటాయి, ఆ తర్వాత అవసరాన్ని బట్టి పొడిగించే అవకాశం ఉంటుంది. విశేషమేమిటంటే, ఈ 33 శాతంలోనే ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన మహిళలకు కూడా అంతర్గత రిజర్వేషన్లు ఉంటాయి. అయితే, ఈ రిజర్వేషన్లు కేవలం లోక్‌సభ మరియు అసెంబ్లీలకు మాత్రమే పరిమితం, రాజ్యసభకు లేదా శాసన మండళ్లకు వర్తించవు.

డీలిమిటేషన్ చిక్కుముడి: సీట్ల సంఖ్య పెంపు
మహిళా రిజర్వేషన్ బిల్లును అందరూ స్వాగతిస్తున్నప్పటికీ, దానితో పాటు ప్రభుత్వం డీలిమిటేషన్ బిల్లును కూడా తెరపైకి తీసుకురావడం పెద్ద చర్చకు దారితీసింది. ప్రస్తుతం లోక్‌సభలో 543 సీట్లు ఉండగా, వీటిని ఏకంగా 850కి పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో రాష్ట్రాలకు 815 సీట్లు, కేంద్రపాలిత ప్రాంతాలకు 35 సీట్లు కేటాయించనున్నారు.

అయితే ఇక్కడే అసలు చిక్కు ఉంది. మహిళా రిజర్వేషన్లు అమలు కావాలంటే ముందుగా దేశవ్యాప్తంగా జనాభా లెక్కలు (సెన్సస్) జరగాలి, ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరగాలి. ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యేసరికి 2029 ఎన్నికల సమయం పట్టవచ్చు. మహిళా రిజర్వేషన్ బిల్లు సాకుతో డీలిమిటేషన్ బిల్లును హడావుడిగా ఆమోదింపజేయాలని ప్రభుత్వం చూస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

దక్షిణాది రాష్ట్రాల ఆందోళన: మన వాయిస్ తగ్గిపోతుందా?
డీలిమిటేషన్ విషయంలో ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ వంటి దక్షిణాది రాష్ట్రాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. గత 50 ఏళ్లలో దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణను సమర్థవంతంగా పాటించి జనాభాను తగ్గించుకున్నాయి. కానీ ఉత్తరాది రాష్ట్రాలలో జనాభా పెరుగుదల ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఒకవేళ జనాభా ప్రాతిపదికన సీట్లను పెంచితే, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలకు సీట్లు భారీగా పెరుగుతాయి, దక్షిణాది రాష్ట్రాలకు మాత్రం తక్కువ సీట్లు వస్తాయి.

ఉదాహరణకు, ఉత్తరప్రదేశ్‌లో సీట్లు 80 నుంచి 120కి పెరిగి, కేరళలో 20 నుంచి 30కి పెరిగితే, రెండు రాష్ట్రాల మధ్య సీట్ల వ్యత్యాసం పెరిగిపోతుంది. దీనివల్ల ఢిల్లీలో దక్షిణాది రాష్ట్రాల రాజకీయ బలం తగ్గిపోతుందని, భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీ కూడా దక్షిణాది రాష్ట్రాల సమస్యలను పట్టించుకోని పరిస్థితి వస్తుందని రేవంత్ రెడ్డి వంటి నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు కూడా జనాభా ప్రాతిపదికన సీట్ల పంపిణీ జరిగితే రాజకీయ ప్రాబల్యం తగ్గే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

పార్లమెంటులో నంబర్ల గేమ్: బిల్లు పాస్ అవుతుందా?
రాజ్యాంగ సవరణ చేయాలంటే పార్లమెంటులో మూడింట రెండొంతుల (2/3) మెజారిటీ అవసరం. ప్రస్తుతం లోక్‌సభలో ఈ బిల్లులు పాస్ కావాలంటే కనీసం 360 మంది ఎంపీల మద్దతు కావాలి. కానీ బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి ప్రస్తుతం 293 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. అంటే మరో 67 మంది ఎంపీల మద్దతు ఉంటేనే ఈ బిల్లు చట్టంగా మారుతుంది. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే వంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీలు డీలిమిటేషన్ అంశంపై స్పష్టత లేకుండా బిల్లుకు మద్దతు ఇవ్వబోమని చెబుతున్నాయి.

ఒకవేళ ప్రతిపక్షాల మద్దతు లేక ఈ బిల్లులు ఆగిపోతే, దానిని కూడా బిజెపి తనకి అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు. "మేము మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వాలని చూస్తుంటే ప్రతిపక్షాలే అడ్డుకున్నాయి" అనే నినాదంతో రాబోయే ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్లాలని బిజెపి యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనప్పటికీ, ఏప్రిల్ 16, 17 తేదీల్లో పార్లమెంటులో జరిగే పరిణామాలు భారత రాజకీయాల్లో కీలక మలుపుగా మారనున్నాయి.

Spotlight

Read More →