AI Coding: టెక్‌ కంపెనీల్లో AI కోడింగ్‌..! ఇంజినీర్ల భవిష్యత్ ఏంటి..!

మాజీ మంత్రి, వైసీపీ అధికార ప్రతినిధి రోజాపై శాప్ ఛైర్మన్ రవినాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన రవినాయుడు రోజా జైలుకు వెళ్లడం ఖాయమంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రోజా సెల్వమణి ఏపీ పర్యాటక, క్రీడా శాఖ మంత్రిగా పనిచేసిన సంగతి తెలిసిందే.

Chandrababu: చంద్రబాబు కీలక ప్రకటన! ఆ రంగంలో 100 బిలియన్ డాలర్ల పెట్టుబడిలే లక్ష్యం!

అయితే క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా అవినీతికి పాల్పడ్డారని రవినాయుడు ఆరోపించారు. ఆడుదాం ఆంధ్రా పేరుతో రోజా అవినీతికి పాల్పడ్డారన్న రవినాయుడు.. రోజా అవినీతిపై విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. ఆడుదాం ఆంధ్రా పేరుతో కోట్ల రూపాయలు తినేసిన రోజా ఆగష్టు 10వ తేదీలోగా జైలుకెళ్ళడం ఖాయమంటూ శాప్ ఛైర్మన్ రవినాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. రోజా అరెస్టుకు వారెంట్ కూడా సిద్ధమవుతోందని.. రోజులు లెక్కపెట్టుకోవాలంటూ రవినాయుడు వార్నింగ్ ఇచ్చారు.

India -China: భారత్- చైనా కొత్త దారిలో పాత బంధం! ఎందుకంటే?

మరోవైపు వైసీపీ ప్రభుత్వంలో క్రీడా శాఖ మంత్రిగా పనిచేసిన రోజా.. కనీసం ఒక్క స్టేడియం అయినా నిర్మించారా అని శాప్ ఛైర్మన్ రవినాయుడు ప్రశ్నించారు. రోజా ఎప్పుడూ తమిళనాడులోనే ఉంటారని.. నగరికి టూరిస్టు మాదిరిగా వచ్చి పోతుంటారని ఎద్దేవా చేశారు. నగరి టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ మీద రోజా చేసిన వ్యాఖ్యలు క్షమించరానివన్న శాప్ ఛైర్మన్ రవినాయుడు.. ఆమె వ్యాఖ్యలు సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయని అన్నారు. చంద్రబాబును ఏకవచనంతో మాట్లాడటం సరికాదని.. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని సూచించారు.

New Ration Cards: సామాన్యులకు గుడ్ న్యూస్! ఈ నెల 25 నుంచి కొత్త రేషన్ కార్డులు!

ఇక 2024 ఏపీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తున్నామన్న శాప్ ఛైర్మన్ రవినాయుడు.. సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లలో ముందుకు తీసుకెళ్తున్నామని వివరించారు. ఏపీకి పరిశ్రమలు వస్తుండటాన్ని, ఇక్కడి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తుండటాన్ని వైసీపీ జీర్ణించుకోలేకపోతోందని ఆరోపించారు. ఈ కారణంగానే వైసీపీ రాష్ట్రంలో అరాచకం సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

Minister: జగన్ నీ పద్ధతి మార్చుకో..! మంత్రి స్ట్రాంగ్ వార్నింగ్!

మరోవైపు ఏపీ లిక్కర్ కేసులో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్టైన సంగతి తెలిసిందే. అలాగే వివిధ కారణాలతో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, నారాయణస్వామిలకు కూడా నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి రోజా ఆగస్ట్ పదో తేదీలోగా అరెస్ట్ అవుతారంటూ శాప్ ఛైర్మన్ రవినాయుడు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే టీడీపీ కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా అక్రమ కేసులు పెడుతోందని వైసీపీ ఆరోపిస్తోంది.

Bangladesh Plane Crash: బంగ్లాదేశ్ విమాన ప్రమాదంలో 19కి పెరిగిన మృతుల సంఖ్య...! కూలిపోయింది చైనా తయారీ విమానం!
Free Bus Scheme: మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు పథకంలో ‘జీరో ఫేర్ టిక్కెట్’.. సొంతంగా విద్యుత్ ఉత్పత్తి!
World Cup: హంపీ విజయం స్ఫూర్తిదాయకం.. శాప్ ఛైర్మన్ ప్రశంసల వర్షం!
Adaptive Learning: ఏపీలో వినూత్న కార్యక్రమం..! చదువులో వెనుకబడిన విద్యార్థులకు ఏఐ బోధన!
Intercity Express: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్. ఆ రైలుకు అదనపు బోగీలు..! ఇక నో టెన్షన్..!