Header Banner

తిక్క కుదిరిందా పాకిస్తాన్.. తుస్సుమన్న చైనా మాల్.. పాక్ ను మోసం చేసిన చైనా!

  Fri May 09, 2025 14:22        Politics

భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ 'ఆపరేషన్ సిందూర్' సమయంలో పాకిస్థాన్ సైన్యం చైనా నుంచి సేకరించిన ఆయుధ వ్యవస్థలు దారుణంగా విఫలమైనట్లు తెలుస్తోంది. భారత దాడులను ఎదుర్కోవడంలో ఈ ఆయుధాలు నిష్ఫలమవ్వడమే కాకుండా, కొన్ని పేలకుండానే కిందపడిపోయిన ఘటనలు వెలుగుచూశాయి. ఈ పరిణామాలతో చైనా ఆయుధాల నాణ్యతపై తీవ్ర సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళితే, పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో పాకిస్థాన్ ప్రయోగించిన చైనీస్ PL-15 లాంగ్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ క్షిపణి పేలకుండా పడి ఉండటాన్ని భారత బలగాలు గుర్తించాయి. మరోవైపు, లాహోర్‌లోని పాకిస్థాన్ వైమానిక స్థావరంలో ఏర్పాటు చేసిన చైనా నిర్మిత HQ-9B ఎయిర్ డిఫెన్స్ (AD) వ్యవస్థను భారత దళాలు ధ్వంసం చేశాయి. భారత డ్రోన్ దూసుకొస్తున్నా ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏమీ చేయలేకపోయింది. చైనా నుంచి పాకిస్థాన్ అధిక ధరకు కొనుగోలు చేసిన ఈ ఆయుధాల నాణ్యత ప్రశ్నార్థకంగా మారడంతో పాటు, వాటిని వినియోగించే నైపుణ్యం, శిక్షణ పాకిస్థాన్ దళాలకు కొరవడిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 

ఇది కూడా చదవండి: దేశంలో ఇంధన కొరత అంటూ మరో ఫేక్ ప్రచారం! ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించే..

 

ఇటీవల, పాకిస్థాన్ సరిహద్దుల వద్ద మోహరించిన చైనా HQ-9 వైమానిక రక్షణ వ్యవస్థ ద్వారా భారత్‌పై క్షిపణి, డ్రోన్ దాడులకు యత్నించగా, భారత S-400 క్షిపణి రక్షణ వ్యవస్థ వాటిని సమర్థవంతంగా అడ్డుకొని నాశనం చేసింది. అంతేకాదు, జేఎఫ్-17 ఫైటర్ జెట్లను చైనా ఎంతో సమర్థవంతమైనవని చైనా చెప్పుకుంటుండగా... భారత్ పై ఆ యుద్ధ విమానాలను ఉపయోగించి పాక్ భంగపాటుకు గురైంది. నిన్న రాత్రి రెండు జేఎఫ్-17 ఫైటర్లను భారత్ కూల్చివేసింది. అవి గాల్లోకి లేచీ లేవడంతోనే భారత గగనతల రక్షణ వ్యవస్థలు వాటిని గుర్తించి ఇంటర్ సెప్టర్ లను పంపించి పేల్చివేశాయి. ఈ ఘటనలు చైనా సైనిక పరికరాల విశ్వసనీయతపై చర్చకు దారితీయగా, పాక్ సైనికుల ఆత్మవిశ్వాసం కూడా దెబ్బతిన్నట్లు చెబుతున్నారు. ఈ వైఫల్యాలపై సోషల్ మీడియాలో నెటిజన్లు చైనాను ఉద్దేశించి వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల భర్తీకి డేట్ ఫిక్స్! ఎప్పుడంటే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అన్నవరం ఆలయంలో వైసీపీ ఎమ్మెల్సీ ఓవరాక్షన్.. వాడు, వీడు అంటూ అధికారిపై మండిపాటు!

 

3 గంటలు ముందే రావాలి.. ప్రయాణికులకు ఎయిర్‌లైన్స్‌ సూచన!

 

యుద్ధం.. ఢిల్లీ ఉద్యోగుల సెలవులు రద్దు.. సరిహద్దు ప్రాంతాల్లో హై అల‌ర్ట్‌!

 

ఉత్తరాఖండ్ హెలికాప్టర్ ప్రమాదం.. టీడీపీ ఎంపీ కుటుంబంలో విషాదం! ఏపీకి చెందిన మరో వ్యక్తి..

 

జగన్ కు ఊహించని షాక్! లిక్కర్ స్కాం లో నిందితులకు సుప్రీంలో చుక్కెదురు!

 

తిరుపతి జిల్లాలో మరో కీలక ప్రాజెక్టు.. నేడు శంకుస్థాపన చేయనున్న మంత్రి!

 

అలర్ట్.. 400కిపైగా ప్లైట్స్ క్యాన్సిల్.. 27విమానాశ్రయాలు మూసివేత.. ఏఏ ప్రాంతాల్లో మూతపడ్డాయంటే..

 

పాక్‌కు యూకే షాక్‌.. వీసాలపై పరిమితులు! కొత్త నిబంధనల్లో భాగంగా...

 

ఏపీలో వారికి గుడ్ న్యూస్..! తల్లికి వందనం ఎప్పటినుంచంటే..?

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Pakistan #Sports #Cricket #SouthAfrica #CricketNews