New Airports: కేంద్రం భారీ ఆఫర్.. ఏపీ, తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టులకు లైన్ క్లియర్.! ఎక్కడ అంటే.!

New Airports: తెలుగు రాష్ట్రాల విమానయాన రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. ఉడాన్ 2.0 పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో కొత్త విమానాశ్రయాల నిర్మాణం, పాత ఎయిర్‌స్ట్రిప్‌ల ఆధునీకరణపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన చేశారు.

Published : 2026-03-29 20:15:00
  • ఉడాన్ 2.0తో విమానయాన విప్లవం: రెండు రాష్ట్రాల్లో ఎయిర్‌స్ట్రిప్‌ల ఆధునీకరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..
     
  • Politics: వచ్చే ఏడాది జూన్ కల్లా భోగాపురం సిద్ధం: గన్నవరం విస్తరణ పనులపై కేంద్ర మంత్రి కీలక అప్‌డేట్..

New Airports: తెలుగు రాష్ట్రాల విమానయాన రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. ఉడాన్ 2.0 పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో కొత్త విమానాశ్రయాల నిర్మాణం, పాత ఎయిర్‌స్ట్రిప్‌ల ఆధునీకరణపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన చేశారు. ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన, రెండు రాష్ట్రాల్లో విమాన ప్రయాణ సౌకర్యాలను మెరుగుపరిచేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. ముఖ్యంగా తెలంగాణలోని వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్ట్‌కు సంబంధించి ఫైల్ ప్రస్తుతం వివిధ శాఖల పరిశీలనలో ఉందని, అన్ని అనుమతులు పూర్తి చేసుకుని ఈ ఏడాది జూన్ నాటికే శంకుస్థాపన చేసేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి స్పష్టం చేశారు. అలాగే కొత్తగూడెం, బసంత్ నగర్ ఎయిర్‌పోర్టులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం భూ కేటాయింపులు పూర్తి చేస్తే తక్షణమే తదుపరి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్‌లోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం మరియు గన్నవరం ఎయిర్‌పోర్ట్ విస్తరణ పనుల గురించి మంత్రి సానుకూల అప్‌డేట్ ఇచ్చారు. ఈ ప్రాజెక్టులు ప్రస్తుతం తుది దశకు చేరుకున్నాయని, వచ్చే ఏడాది జూన్ నాటికి పనులు పూర్తయి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. వీటితో పాటు కుప్పం, దగదర్తి వంటి ప్రాంతాల్లో కొత్త విమానాశ్రయాల ఏర్పాటుపై కూడా కేంద్రం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఉన్న ఎయిర్‌స్ట్రిప్‌లను పూర్తిస్థాయి ఎయిర్‌పోర్టులుగా మార్చడం ద్వారా ప్రాంతీయ అనుసంధానతను పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ పరిణామాలు రెండు రాష్ట్రాల్లో పారిశ్రామిక అభివృద్ధికి మరియు ఉపాధి అవకాశాల కల్పనకు ఊతమిస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

దేశీయ విమానయాన రంగంలో మరో విప్లవాత్మక మార్పుగా, 2028 చివరి నాటికి భారతదేశంలోనే తయారైన తొలి విమానాన్ని పట్టాలెక్కించనున్నట్లు రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. ప్రముఖ విమానాల తయారీ సంస్థ 'ఎంబ్రాయర్' భారత దేశీయ మార్కెట్‌లో విమానాల ఉత్పత్తిని చేపట్టేందుకు ముందుకు రావడం విశేషమని ఆయన అభివర్ణించారు. 'మేక్ ఇన్ ఇండియా'లో భాగంగా విమానాల తయారీ ఇక్కడ ప్రారంభమైతే ప్రపంచ విమానయాన రంగంలో భారత్ కీలక శక్తిగా ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే ఐదేళ్లలో తెలుగు రాష్ట్రాల్లో విమాన ప్రయాణం సామాన్యులకు మరింత చేరువయ్యేలా మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తామని మంత్రి పునరుద్ఘాటించారు.

Spotlight

Read More →