ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం మరియు విజయవాడ నగరాల్లో మెట్రో రైలు ప్రాజెక్టులు త్వరలోనే కార్యరూపం దాల్చనున్నాయి. ఈ దిశగా నేడు ముఖ్యమైన ముందడుగు పడింది. ముఖ్యంగా నగరాల అభివృద్ధికి మెట్రో రైలు వ్యవస్థ అవసరమన్న నమ్మకంతో చంద్రబాబు ప్రభుత్వం టెండర్లు పిలవాలని నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టులు కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాల సమాన భాగస్వామ్యంతో చేపట్టనున్నారు.
ఈ రెండు మెట్రో ప్రాజెక్టుల కోసం మొత్తం రూ.21,616 కోట్లు ఖర్చు చేయనున్నారు. అందులో విశాఖ మెట్రో ప్రాజెక్టుకి రూ.11,498 కోట్లు, విజయవాడ మెట్రో ప్రాజెక్టుకి రూ.10,118 కోట్లు మంజూరు చేయనున్నారు. ప్రారంభ దశలో మొత్తం వ్యయానికి 40 శాతం పనులకే టెండర్లు పిలవనున్నారు. మెట్రో రైలు ద్వారా నగరాల ట్రాఫిక్ సమస్యలు తక్కువవవుతాయని, ప్రజలకు వేగవంతమైన రవాణా అందుతుందని అధికారులు భావిస్తున్నారు.
 
       
   
   
   
 
                       
   
   
   
   
   
   
   
   
                   
                   
                   
         
         
         
         
         
         
         
         
        