పల్నాడు జిల్లా వినుకొండలో మంత్రులు సవిత, గొట్టిపాటి రవికుమార్, చీఫ్ విప్ జీవీ
ఆంజనేయులు పర్యటించారు. రూ.10.15 కోట్లతో అభివృద్ధి చేసిన నరగాయపాలెం-వెంకుపాలెం, తిమ్మాయపాలెం-దొండపాడు రోడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత (Minister Savita) మాట్లాడుతూ.. వైకాపా హయాంలో రోడ్లు వేసింది శూన్యమన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాకే రోడ్ల మరమ్మతులు, కొత్త రోడ్ల నిర్మాణం జరుగుతోందని వివరించారు. 
కూటమి ఏడాది పాలనలో బాగుపడ్డ రోడ్ల పరిస్థితే ఇందుకు నిదర్శనమని జీవీ ఆంజనేయులు అన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే రూ.861 కోట్లతో 20 వేల కి.మీపైగా రోడ్లకు మరమ్మతులు చేశామని పేర్కొన్నారు. కొత్త రోడ్ల నిర్మాణానికి రూ.వెయ్యి కోట్లు మంజూరు చేసినందుకు సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు చెప్పారు.
 
       
   
   
   
 
                       
   
   
   
   
   
   
   
   
   
   
                   
                   
                   
         
         
         
         
         
         
         
         
        