ఏపీ లిక్కర్ కేసులో కీలక మలుపు. ఈ కేసులో ప్రధాన నిందితులైన పలువురు వ్యక్తులు కేసు నమోదైన తర్వాత విదేశాలకు పారిపోయినట్లు గుర్తించారు. వీరిలో దుబాయ్‌లో ఉన్న నిందితులు కిరణ్, సైఫ్ అహ్మద్, వరుణ్, శివకుమార్, సైమన్ ప్రసన్, ప్రద్యుమ్నలు కాగా, థాయ్‌ల్యాండ్‌లో అవినాష్ రెడ్డి, అనిరుధ్ రెడ్డిలు ఉన్నట్లు ఏపీ S.I.T అధికారులు వెల్లడించారు.
ప్రస్తుతం వీరిని పట్టుకునేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (S.I.T) చర్యలు ముమ్మరం చేసింది. ఇంటర్‌పోల్ సహకారంతో వీరిపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయడానికి రంగం సిద్ధం చేశారు. నిందితులను భారత్‌కు తిరిగి తీసుకొచ్చేందుకు కేంద్ర విదేశాంగశాఖకు ఏపీ SIT అధికారులు లేఖ రాశారు. ఇది కేసు దర్యాప్తులో కీలకమైన ముందడుగు కావచ్చు.
 
       
   
   
   
 
                       
   
   
   
   
   
   
   
   
                   
                   
                   
         
         
         
         
         
         
         
         
        