తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ ఎప్పటిలానే కొనసాగుతోంది. ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఉన్న 12 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనానికి వేచి ఉన్నారు. టోకెన్లు లేని సర్వదర్శన భక్తులకు సుమారు 12 గంటల పాటు నిరీక్షణ సమయం పడుతోంది.
నిన్నటిరోజు (జూలై 27) శ్రీవారిని మొత్తం 85,486 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 30,929 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా టీటీడీకి (TTD) రూ.3.85 కోట్లు ఆదాయం వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు తెలిపారు.
తిరుమలలో (Tirumula) భక్తుల భద్రత, సౌకర్యాల పరంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. పలు ప్రాంతాల్లో పానీ పాయింట్లు, ఆహార పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేసి భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నారు. భక్తుల రద్దీ నేపథ్యంలో తిరుమల వెళ్లే వారు ముందుగా టైంస్లాట్ టోకెన్లు బుకింగ్ చేసుకొని రావాలని టీటీడీ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.