ప్రేమ పేరుతో ప్రియుడి ఘోర మోసం... వైజాగ్ లో కలకలం రేపిన ఘటన

విశాఖలో దారుణం జరిగింది. ఓ బాలికపై పది మంది యువకులు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన నగరంలో కలకలం రేపింది. అత్యాచారం తరువాత షాక్‌లోకి వెళ్లిన యువ

Published : 2024-01-01 11:59:00

విశాఖలో దారుణం జరిగింది. ఓ బాలికపై పది మంది యువకులు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన నగరంలో కలకలం రేపింది. అత్యాచారం తరువాత షాక్‌లోకి వెళ్లిన యువతి ఒడిసాలోని స్వగ్రామానికి వెళ్లింది. ఆమె కనిపించడంలేదంటూ బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్‌ కేసుగా నమోదు చేశారు. ఆమె ఒడిసాలో ఉన్నట్టు గుర్తించి, విశాఖకు తీసుకువచ్చి వివరాలు సేకరించారు. అత్యాచారానికి పాల్పడిన యువకుల్లో కొంతమందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

బాధితురాలు కొన్నాళ్ల క్రితం స్థానిక యువకుడితో ప్రేమలో ఉందని, అతడి కోరిక మేరకు ఈ నెల 17న నాలుగో పట్టణ పీఎస్‌ దగ్గరలోని ఓ హోటల్‌కు వెళ్లినట్టు చెబుతున్నారు. అక్కడ వీరిద్దరూ శారీరకంగా కలిసిన తరువాత, ఆ యువకుడు తన స్నేహితునికి ఫోన్‌ చేసి విషయం చెప్పాడు. అతను కూడా హోటల్‌కు చేరుకుని బాలికను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు.

ప్రేమించిన యువకుడే అతని స్నేహితునితో అత్యాచారం చేయించడాన్ని తట్టుకోలేకపోయిన బాలిక తీవ్ర మనస్తాపానికి గురై బీచ్‌కు చేరుకుని విలపిస్తుండగా, గుర్తించిన మరో వ్యక్తి (ఫొటో గ్రాఫర్‌ అని చెబుతున్నారు) ఓదార్చినట్టు నటించి స్నేహితుల గదికి తీసుకెళ్లాడు. ఆ గదిలో ఫొటోగ్రాఫర్‌తోపాటు మరో ఏడుగురు యువకులు బాలికను హింసించి, అత్యాచారం చేశారు. తరువాత నగర పరిధిలోని మరికొన్ని హోటళ్లు, లాడ్జిలకు తీసుకెళ్లి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనను సీరియ్‌సగా తీసుకున్న పోలీసులు చురుగ్గా విచారిస్తున్నారు. ఇప్పటికే కొంతమంది నిందితులను అదుపులోకి తీసుకోగా, మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు.

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →