ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్) జట్టు నేడు (శనివారం) తొలి మ్యాచ్ ఆడనుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది. రికార్డు ధరకు కొనుగోలు చేసిన ఆసిస్ ఆటగాడు పాట్ కమిన్స్ సారధ్యంలో హైదరాబాద్ జట్టు టైటిల్ వేటను మొదలుపెట్టబోతోంది. వెన్నునొప్పి కారణంగా గతేడాది సీజన్‌కు దూరమైన శ్రేయాస్ అయ్యర్ నాయకత్వంలో కోల్‌కతా బరిలోకి దిగబోతోంది. ఇటీవలే రంజీ ట్రోఫీలో కూడా ఆడి పూర్తి ఫిట్‌నెస్‌తో అయ్యర్ సిద్ధమయ్యాడు.
కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో శ్రేయార్ అయ్యర్‌తో పాటు ఏకంగా రూ.24.75 కోట్లతో కొనుగోలు చేసిన ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్ స్టార్క్ ప్రధాన ఆటగాడిగా ఉన్నాడు. రికార్డు ధర పలకడంతో అందరి దృష్టి స్టార్క్ ప్రదర్శనపైనే పడింది. కోల్‌కతాకు గౌతమ్ గంభీర్ తిరిగి ఈ సీజన్‌లో మెంటార్‌గా వ్యవహరించనున్నాడు. గంభీర్ సూచనలు ఆ జట్టుకు కలిసి వస్తాయనే అంచనాలు నెలకొన్నాయి. సొంత మైదానంలో జరుగుతుండడంతో అభిమానుల మద్దతు కూడా ఆ జట్టుకు దక్కనుంది. కోల్‌కతా నైట్ రైడర్స్ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరవుతారనే అంచనాలు నెలకొన్నాయి.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ విషయానికి వస్తే పాట్ కమ్మిన్స్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. న్యూజిలాండ్ మాజీ దిగ్గజం డేనియల్ వెట్టోరీ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. ఏసీ20 లీగ్‌ని (సౌతాఫ్రికా) వరుసగా రెండవసారి గెలిచిన ‘సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్’కు నాయకత్వం వహించిన ఐడెన్ మార్‌క్రమ్ జట్టులో ఉన్నప్పటికీ పాట్ కమిన్స్ వైపే సన్‌రైజర్స్ యాజమాన్యం మొగ్గుచూపింది.
ఇక సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు ఐపీఎల్‌లో ఇప్పటివరకు 25 సార్లు తలపడగా ఎస్‌ఆర్‌హెచ్‌దే పైచేయిగా ఉంది. ఎస్ఆర్‌హెచ్ 16 మ్యాచ్‌లు గెలవగా.. కోల్‌కతా కేవలం తొమ్మిది విజయాలు మాత్రమే సాధించింది. నేటి మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది.
ఇవి కూడా చదవండి:
ఇసుక తవ్వకాలపై నివేదికలు కోరుతూ కలెక్టర్లకు కీలక ఆదేశాలు!! మూడు రోజులే టైం!!
ఇదేనా ఏపీలో వైసీపీ అభివృద్ధి మంత్రం!! నిజం గెలవాలి యాత్రలో నారా భువనేశ్వరి
దేశమంతా మంగళగిరివైపు చూసేలా అభివృద్ధి చేసి చూపిస్తా!! రచ్చబండ సభల్లో లోకేష్ భరోసా!!
పురంధేశ్వరి రాజీనామా లేఖ!! నిజమా ??
ఈడీ కస్టడీలోకి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ !!
నేటికీ జమ కాని ఆసరా డబ్బులు!! ఏం ముఖం పెట్టుకొని ఓట్లు అడగడానికి వస్తున్నారు? ఆచంట సునీత
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి