ORR: ట్రాఫిక్ కష్టాలకు చెక్.. ORR నుంచి RRR వరకు 10 కొత్త రేడియల్ రోడ్లు! Custodial Torture: రఘురామ కేసులో కీలక మలుపు..! విచారణకు ఐపీఎస్ సునీల్ నాయక్! Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు.. నేతలు ఎవరికి వారు అంటే కుదరదు.. అందరూ కలిసికట్టుగా పనిచేయాలి- చంద్రబాబు! AP Electricity: ఏపీలో విద్యుత్ వెలుగులు! అధిక లోడ్ ఉన్న ప్రాంతాల్లో కొత్త సబ్ స్టేషన్లు! Iran: సముద్రంలో మునిగిన ఇరాన్ యుద్ధనౌక... 87 మృతదేహాలు వెలికితీత! Visa Rules: ఒమన్‌ వెళ్లే భారతీయులకు అలర్ట్! కొత్త వీసా నిబంధనలు... ఇక నుండి అవి తప్పనిసరి! Indian Railways: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఇక ఎయిర్‌పోర్ట్ రేంజ్..! స్కై వాక్ ద్వారా నిమిషాల్లో ప్రయాణం! Kuwait: కువైట్ తీరంలో నౌకపై దాడి! పర్షియన్ గల్ఫ్‌లో విస్తరిస్తున్న యుద్ధ మేఘాలు! Mobile Storage: గ్యాలరీ ఖాళీ చేయకుండానే స్టోరేజ్ ఫ్రీ చేయడం ఎలా? పూర్తి వివరాలు ఇవే...! Bihar Politics: బిహార్ రాజకీయాల్లో సంచలనం! నితీష్ కుమార్‌కు కేంద్రంలో కీలక పదవి? ORR: ట్రాఫిక్ కష్టాలకు చెక్.. ORR నుంచి RRR వరకు 10 కొత్త రేడియల్ రోడ్లు! Custodial Torture: రఘురామ కేసులో కీలక మలుపు..! విచారణకు ఐపీఎస్ సునీల్ నాయక్! Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు.. నేతలు ఎవరికి వారు అంటే కుదరదు.. అందరూ కలిసికట్టుగా పనిచేయాలి- చంద్రబాబు! AP Electricity: ఏపీలో విద్యుత్ వెలుగులు! అధిక లోడ్ ఉన్న ప్రాంతాల్లో కొత్త సబ్ స్టేషన్లు! Iran: సముద్రంలో మునిగిన ఇరాన్ యుద్ధనౌక... 87 మృతదేహాలు వెలికితీత! Visa Rules: ఒమన్‌ వెళ్లే భారతీయులకు అలర్ట్! కొత్త వీసా నిబంధనలు... ఇక నుండి అవి తప్పనిసరి! Indian Railways: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఇక ఎయిర్‌పోర్ట్ రేంజ్..! స్కై వాక్ ద్వారా నిమిషాల్లో ప్రయాణం! Kuwait: కువైట్ తీరంలో నౌకపై దాడి! పర్షియన్ గల్ఫ్‌లో విస్తరిస్తున్న యుద్ధ మేఘాలు! Mobile Storage: గ్యాలరీ ఖాళీ చేయకుండానే స్టోరేజ్ ఫ్రీ చేయడం ఎలా? పూర్తి వివరాలు ఇవే...! Bihar Politics: బిహార్ రాజకీయాల్లో సంచలనం! నితీష్ కుమార్‌కు కేంద్రంలో కీలక పదవి?

పిఠాపురం నుంచే పవన్ కల్యాణ్ ప్రచారానికి శ్రీకారం!! రాష్ట్రవ్యాప్త ప్రచారానికి రాకపోకలు..

Published : 2024-03-22 20:15:00

మంగళగిరి బ్యూరో ప్రతినిధి: జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ చేపట్టే ఎన్నికల ప్రచారానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. శుక్రవారం పార్టీ ముఖ్యులతో ఈ అంశంపై చర్చించారు. పవన్ కల్యాణ్ పోటీ చేయనున్న పిఠాపురం నుంచే ప్రచారానికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించుకున్నారు. శక్తిపీఠం కొలువైన క్షేత్రం శ్రీపాద శ్రీవల్లభుడు జన్మించిన పవిత్ర భూమి అయిన పిఠాపురం నుంచి ప్రచారం మొదలుపెట్టడం శుభప్రదమని పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. పురూహూతిక దేవికి పూజలు నిర్వహించి వారాహి వాహనం నుంచి ప్రచారం మొదలుపెడతారు. ఆ నియోజక వర్గంలోనే మూడు రోజులపాటు ఉంటారు. నియోజక వర్గ ముఖ్య నాయకులు, మండల నాయకులతో భేటీలు నిర్వహిస్తారు.

ఇంకా చదవండి: ఏలూరు: కొయ్యలగూడెంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘన!! సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి..

పిఠాపురం కేంద్రంగానే రాష్ట్రవ్యాప్తంగా సాగించే ఎన్నికల ప్రచారానికి రాకపోకలు సాగించబోతున్నారు. ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని  పవన్ కల్యాణ్ పార్టీ కేంద్ర కార్యాలయ వర్గాలకు ఆదేశాలిచ్చారు. అనంతరం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పార్టీ ప్రెసిడెంట్ టూర్ మేనేజ్మెంట్ టీం కన్వీనర్లు, కో కన్వీనర్లు, సభ్యులతో శ్రీ పవన్ కల్యాణ్  సమావేశమయ్యారు. పిఠాపురం నుంచి మొదలుపెట్టనున్న ప్రచారంపై దిశానిర్దేశం చేశారు. తాను పోటీ చేస్తున్న స్థానం కావడంతో వైసీపీ ఎన్నో పన్నాగాలు పన్నుతోందని, ప్రతి దశలోనూ అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించబోతున్నాయి. ఇందుకోసం సాగిస్తున్న ఈ సమరంలో కచ్చితంగా విజయం మనదే అని చెప్పారు. పిఠాపురం నుంచే జనసేన శంఖం పూరిస్తుందని,  ఈ విజయ నాదం రాష్ట్రం నాలుగు వైపులా వినిపించాలన్నారు. ఎన్నికల నియమనిబంధనలు పాటించడంపైనా టూర్ మేనేజ్మెంట్ సభ్యులు పూర్తి అవగాహనతో ఉండాలని తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ ఉపాధ్యక్షులు బి.మహేందర్ రెడ్డి, పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ కన్వీనర్ కళ్యాణం శివ శ్రీనివాస్ పాల్గొన్నారు.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అమెరికా: 2025 కు ముగియనున్న H-1B వీసా రిజిస్ట్రేషన్! త్వరపడండి!

వైసీపీ పై టీవీ -5 ఎఫెక్ట్!! జగన్ కు ఓటు వేయాలంటూ... కలెక్టర్ స్పందనతో సస్పెండ్!!

ఆస్ట్రేలియా: పీవీ నరసింహ రావుకి ఘన నివాళి!

ఖతార్: Cric Qatar ఆధ్వర్యంలో ఆహ్లాదకర క్రికెట్ టోర్నమెంట్! ఫైనల్లో క్లాసిక్ మంగళూరు విజయం!

తోకతో జన్మించిన శిశువు!! ఎక్కడో తెలిస్తే ఆశ్చర్యపోతారు!!

ఆ దేశంలో రెండు పెళ్లిళ్లు చేసుకోవాల్సిందే.. లేదంటే శిక్ష!! అరె అబ్బాయిలు సర్దేసుకొండి బట్టలు ఇంకా!

వైసీపీను వెంటాడుతున్న ఓటమి భయం!! ఎలక్ట్రానిక్ మీడియా సాక్షిగా బహిర్గతం అవుతున్న నిజాలు!!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →