Revanth Reddy: గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి అండగా నిలిచిన సీఎం రేవంత్ రెడ్డి... రూ. 5 లక్షల ఆర్థిక సాయం! Vivo Smartphones: వీవో స్మార్ట్‌ఫోన్ ప్రియులకు షాక్... భారీగా పెరిగిన మొబైల్ ఫోన్ల ధరలు! CBN Birthday Celebrations: ఓమన్ ఎన్‌ఆర్‌ఐ టీడీపీ ఘనంగా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు! Fatty Liver: మీ రిపోర్ట్ నార్మల్‌గా ఉందా? అయినా జాగ్రత్త.. ఫ్యాటీ లివర్‌ను నిర్లక్ష్యం చేస్తే జరిగే నష్టం ఇదే! Donald Trump: ఇస్లామాబాద్‌ వేదికగా ప్రపంచశాంతి చర్చలు.. ఇరాన్‌తో ఒప్పందం కోసం ట్రంప్ భారీ ప్లాన్! AP CRDA: అమరావతి నిర్మాణంలో వేగం... ఏపీసీఆర్‌డీఏకి ముగ్గురు అదనపు కమిషనర్ల నియామకం! Chandrababu: వికసిత్ భారత్ నిర్మాణంలో మీరే కీలకం.. అధికారులకు శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి! Lemon Prices: నిమ్మరసం ఇక విలాసమేనా? మార్కెట్లో భారీగా పెరిగిన ధరలు...! Sai Pallavi: నాలుగేళ్ల నాటి ముచ్చట.. ఇప్పుడు రచ్చ.. సాయి పల్లవి ఐడెంటిటీపై సోషల్ మీడియాలో చర్చ.. Dried Fish: ఎండు చేపలు ఒక సూపర్ ఫుడ్: ఖరీదైన ప్రోటీన్ షేక్స్ ఇక అవసరం లేదు! Revanth Reddy: గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి అండగా నిలిచిన సీఎం రేవంత్ రెడ్డి... రూ. 5 లక్షల ఆర్థిక సాయం! Vivo Smartphones: వీవో స్మార్ట్‌ఫోన్ ప్రియులకు షాక్... భారీగా పెరిగిన మొబైల్ ఫోన్ల ధరలు! CBN Birthday Celebrations: ఓమన్ ఎన్‌ఆర్‌ఐ టీడీపీ ఘనంగా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు! Fatty Liver: మీ రిపోర్ట్ నార్మల్‌గా ఉందా? అయినా జాగ్రత్త.. ఫ్యాటీ లివర్‌ను నిర్లక్ష్యం చేస్తే జరిగే నష్టం ఇదే! Donald Trump: ఇస్లామాబాద్‌ వేదికగా ప్రపంచశాంతి చర్చలు.. ఇరాన్‌తో ఒప్పందం కోసం ట్రంప్ భారీ ప్లాన్! AP CRDA: అమరావతి నిర్మాణంలో వేగం... ఏపీసీఆర్‌డీఏకి ముగ్గురు అదనపు కమిషనర్ల నియామకం! Chandrababu: వికసిత్ భారత్ నిర్మాణంలో మీరే కీలకం.. అధికారులకు శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి! Lemon Prices: నిమ్మరసం ఇక విలాసమేనా? మార్కెట్లో భారీగా పెరిగిన ధరలు...! Sai Pallavi: నాలుగేళ్ల నాటి ముచ్చట.. ఇప్పుడు రచ్చ.. సాయి పల్లవి ఐడెంటిటీపై సోషల్ మీడియాలో చర్చ.. Dried Fish: ఎండు చేపలు ఒక సూపర్ ఫుడ్: ఖరీదైన ప్రోటీన్ షేక్స్ ఇక అవసరం లేదు!

రంగన్నగూడెంలో ఘనంగా తానా ఉచిత మెగా కంటి వైద్య శిబిరం! తానా కార్యదర్శి రాజా కసుకుర్తి!

Saudi Arabia: సౌది అరేబియా తూర్పు ప్రాంతంలో నివసిస్తున్న ప్రవాసాంధ్రులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు కలిసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు.

Published : 2024-03-10 19:08:00

కృష్ణాజిల్లా, బాపులపాడు మండలం రంగన్నగూడెం గ్రామంలో తానా ఫౌండేషన్ చైర్మన్ శశాంక్ వల్లేపల్లి సూచనలతో  ఈరోజు ఉదయం ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా )ఆధ్వర్యంలో,  ఉయ్యూరు రోటరీ కంటి ఆసుపత్రి సహకారంతో రాజా కసుకుర్తి దాతృత్వంతో కమ్యూనిటీ హాలులో ఉచిత మెగా కంటి శిబిరాన్ని నిర్వహించి కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి శస్త్రచికితలు, కళ్ళ అద్దాలు సిఫారసు చేశారు. ఈ సందర్భంగా కమ్యూనిటీ హాల్ ఆవరణలో రంగన్నగూడెం రూరల్ డెవలప్మెంట్ సొసైటీ కార్యదర్శి, సాగు నీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాలకృష్ణారావు అధ్యక్షతన గ్రామస్తులు, లబ్ది దారులతో సభ నిర్వహించారు. ఈ సభలో ఆళ్ళ వెంకట గోపాలకృష్ణారావు మాట్లాడుతూ తానా ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో 20వేల మందికి ఇప్పటికే ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి, పదివేల మందికి ఉచితంగా కంటి ఆపరేషన్లు  చేయడం ముదావాహం అని రాబోయే రోజుల్లో వీటితోపాటు రంగన్నగూడెం, వీరవల్లి గ్రామాల్లో రైతుల మెరిట్ పిల్లలకు స్కాలర్ షిప్లు లు అందించాలని రాజా కసుకుర్తికి  సూచించారు.

ఇంకా చదవండి: నిజం గెలవాలి పర్యటనకు స్వల్ప విరామం!

తానా తాజా మాజీ అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి మాట్లాడుతూ విద్య మన పిల్లలకు ఆస్తి అని,గ్రామాల్లో తమ పిల్లలను ప్రాథమిక స్థాయిలో మంచి విద్యాబుద్ధులు నేర్పిస్తే భవిష్యత్తులో ఉన్నత లక్ష్యాలు సాధించడానికి అవకాశం ఉంటుందని తెలియజేశారు. తానా కార్యదర్శి రాజా కసుకుర్తి మాట్లాడుతూ 2023-25 కాలంలో తానా తరపున రైతులకు అవసరమైన వ్యవసాయ పనిముట్లు, రైతులకు అవసరమైన రక్షణ కిట్లు, లాభసాటి వ్యవసాయం మీద వ్యవసాయ సదస్సులు నిర్వహించడానికి  ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. ప్రముఖ కంటి శస్త్ర చికిత్స నిపుణురాలు డాక్టర్ గొట్టుముక్కల వాసవి మాట్లాడుతూ షుగర్ వ్యాధి, రక్తపోటు ఉన్నవారు రెగ్యులర్ గా కంటి పరీక్షలు నిర్వహించుకోవాలని వైద్యుల సలహా ప్రకారం నడవకపోతే భవిష్యత్తులో చాలా ప్రమాదకరమని, చూపు కోల్పోయే ప్రమాదం ఉన్నదని ఉచిత కంటి వైద్య శిబిరాలు సద్వినియోగం చేసుకొని అవసరమైన శస్ట్ర చికిత్సలు కంటి అద్దాలు ఉచితంగా పొందాలని సూచించారు. ఈ సమావేశంలో గ్రామ సర్పంచ్ కసుకుర్తి  రంగామణి, ఎంపీటీసీ పుసులూరు లక్ష్మీనారాయణ, ఆర్ ఆర్ డి ఎస్ అధ్యక్షులు తుమ్మల దశరథ రామయ్య, డాక్టర్ కసుకుర్తి లీలాకాంత్  తదితరులు ప్రసంగించారు..

ఇంకా చదవండి: కడప జిల్లాలో డ్వామా పీడీ యధుభూషణ్ రెడ్డిపై ఈసీకి ఫిర్యాదు! ఎన్నికల బాధ్యతలు ఇవ్వొద్దని..

అనంతరం తానా సంస్థ ద్వారా సేవలందిస్తున్న తానా మాజీ అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి, తానా కార్యదర్శి రాజా కసుకుర్తి,రోటరీ ద్వారా సేవలందిస్తున్న డాక్టర్ గొట్టిముక్కల వాసవి, ఆర్మీ ద్వారా దేశానికీ సేవలందిస్తున్న డాక్టర్ కసుకుర్తి లీలాకాంత్, ఆర్ ఆర్ డి ఎస్ ద్వారా సేవలందిస్తున్న ఆళ్ళ వెంకట గోపాలకృష్ణరావును గ్రామ ప్రజాప్రతినిధులు దుస్సాలువాతొ ఘనంగా సత్కరించి మెమెంటోలు అందచేశారు.. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు కసుకుర్తి వేణుబాబు, మొవ్వా వేణుగోపాల్, కసుకుర్తి అర్జునరావు, కనకవల్లి శేషగిరిరావు, మందపాటి రాంబాబు, ఆలపాటి శ్రీనివాసరావు, ఆళ్ళ గురవయ్య,ఆశా వర్కర్లు పి. తేజస్విని, ఎం. జాస్మిన్ రాణి, ఎం. నాగ లలిత మరియు రోటరీ సిబ్బంది ఎల్.డి ప్రసాద్, టి పవన్ కుమార్, వై వి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు... ఈ మెగా కంటి వైద్య శిభిరం లో రంగన్నగూడెం చుట్టుపక్కల గ్రామాల నుంచి 200 మంది సేవలు వినియోగించుకున్నారు...

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కన్నడ పరిశ్రమలో ఓ హీరోతో ప్రేమలో.. దయచేసి అలా చూడటం మానుకోండి!!

ప్రపంచ వ్యాప్తంగా ఆగిపోయిన ఇన్‌స్టాగ్రాం, ఫేస్‌బుక్ సేవలు!!

మీడియా దాడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వైసీపీ!! ఆ దెబ్బకు బాక్స్ ఆఫీస్ వద్దే బోల్తా!!

సింగపూర్: ప్రవాసులకు పెరగనున్న జీతం! త్వరలో అమలులోకి! ప్రభుత్వ ప్రకటన!

ఈ టాబ్లెట్స్ వాడుతున్నారా?? వెంటనే మానేయండి లేదంటే హైరిస్క్!!

తానా ఫౌండేషన్ నూతన కార్యవర్గం ఏర్పాటు! వివరాలు ఇవే!

ఒమన్: వాతావరణ అలర్ట్! భారీ వర్షాలు! హెచ్చరికలు జారీ!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →