ఏపీలో వైసీపీ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారింది.
రాష్ట్రానికి రాజధాని విషయంలో పూటకో మాట రోజుకు ఒక విన్యాసంలా తయారయ్యింది.
2014 ఎన్నికల ముందు 50 వేల ఎకరాలతో ఒక మహానగరం నిర్మించేలా రాజధాని ప్రాంతం ఉండాలని ఈయన చెప్పారు.
మహానగరం నిర్మాణం కాకపోతే రాష్ట్రంలోని యువత ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు తరలిపోయే ప్రమాదం ఉందన్నారు.
2014 ఎన్నికలలో టిడిపి గెలుపొందిన తర్వాత 35 వేల ఎకరాలతో మహానగరం నిర్మాణానికి వీలుగా అమరావతి రాజధానిగా నిర్ణయించారు.
అమరావతి రాజధాని ఏర్పాట్లు శాసనసభలో పెట్టిన తీర్మానానికి ఈయన పార్టీ అంగీకరించింది.
2019 ఎన్నికల ముందు అమరావతి రాజధానిని ఈయన ప్రభుత్వం వస్తే మార్చివేస్తారని తెలుగుదేశం పార్టీ విస్తృతంగా ప్రచారం చేసింది.
మరిన్ని ఆసక్తికర ఎక్స్ క్లూజివ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
అమరావతి లోనే ఈయన ఇల్లు కట్టుకుంటున్నారు అమరావతి రాజధాని అంటూ జగన్మోహన్ రెడ్డి తో పాటు వైసిపి పార్టీ శ్రేణులు అందరూ కూడా ముక్తకంఠంతో చెప్పి ప్రజలను నమ్మించారు.
2019లో ఈయన ప్రభుత్వం ఏర్పడిన కొద్ది నెలలలోనే పాలన వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులు ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభించారు.
మూడు రాజధానుల ప్రకటనపై అమరావతి రైతులు ఒక్కసారిగా ఉద్యమ బాట పట్టారు.
నాటినుండి నేటి వరకు రైతులు ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాలను అమలు చేయాలంటూ కోర్టులను ఆశ్రయించి పోరాటం చేస్తున్నారు.
మూడు రాజధానుల ప్రకటనతో అమరావతిని విధ్వంసం చేయడమే కాకుండా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని ప్రకటించిన విశాఖలో భూదోపిడి తప్ప జగన్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు.
వైసిపి నాయకుడి పిట్టలదొర వాగ్దానాలు! లక్షల కోట్ల రాష్ట్ర సంపద దోపిడి!
కర్నూలు న్యాయ రాజధాని అంటూ రాయలసీమ ప్రజలను కూడా జగన్మోహన్ రెడ్డి మభ్య పెట్టారు.
కోర్టులో ఈయన దోషిగా నిలబడే పరిస్థితి ఏర్పడినప్పుడు మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకుంటున్నట్లుగా కోర్టుకు అఫడవిట్ సమర్పించారు.
రెండు నెలలలో ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో హైదరాబాదును ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలన్నది వైసిపి పార్టీ అభిప్రాయంగా చెబుతున్నారు.
పదేళ్ల క్రితం రాష్ట్ర విభజన జరిగి రాజధానిని అభివృద్ధి చేసుకోవలసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాo పాలన వైఫల్యంతో చేతులెత్తేసాయి.
ఒక్క రాజధాని అభివృద్ధి చేయడం చేతకాని ఈయన మూడు రాజధానులంటూ ఐదేళ్లుగా మూడు ముక్కలాటతో పాలన సాగించారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మళ్లీ ఇప్పుడు రాజధానుల సమస్య పరిష్కారం అయ్యేవరకు హైదరాబాదే ఉమ్మడి రాజధానిగా ఉండాలంటున్నారు.
విడాకులు ఇచ్చిన భార్యను మళ్లీ పెళ్లయ్యే వరకు విడాకులు ఇచ్చిన భార్యనే తన వద్ద ఉండాలన్నట్లుగా ఉంది ఈయన వ్యవహార శైలి.
ఈయన అభివృద్ధి చేతకాక రాజధాని నిర్మాణం చేపట్టలేక రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేశారు.
అస్తవ్యస్తపాలెంతో విసిగిపోయిన రాష్ట్ర ప్రజలను హైదరాబాద్ రాజధాని భ్రమలతో మోసగించడానికి ఈయన మరొక ప్రయత్నం మొదలుపెట్టారు.
తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ ఓటమిపాలైంది, ఏపీలో ఈయన ప్రభుత్వం ఓటమి దిశగా పయనిస్తోంది.
ఒక చెల్లి రాజకీయ పోరాటం!! మరో చెల్లి న్యాయపోరాటం!! తల్లి మౌన పోరాటం!!
రెండు ప్రాంతాలలో ప్రజల మధ్య భావోద్వేగాలు రెచ్చగొట్టి విరుపార్టీలు లబ్ధి పొందడమే లక్ష్యంగా వైసిపి పార్టీ పదేళ్ల తర్వాత హైదరాబాదు ఉమ్మడి రాజధాని అన్న ప్రకటన చేస్తుంది.
ఈయన వైసీపీ పార్టీ పెట్టిన తర్వాత రాజధాని విషయంలో ఇప్పటివరకు ఒక్క మాట మీద నిలబడ్డ దాఖలాలు లేవు.
పదేళ్ల వయసు వచ్చిన కుర్రాడికి తండ్రి ఎవరో చెప్పలేని దుస్థితి ఏర్పడితే ఎలా ఉంటుందో రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు అయినా రాజధాని లేని రాష్ట్రంగా ఉంది.
ఈ పరిస్థితిని చూసి రాష్ట్ర ప్రజలు పక్క రాష్ట్రాలలో పక్క దేశాలలో సిగ్గుతో తలవంచుకుంటున్నారు.
అయినా వైసీపీ పాలకులకు మాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా రోజుకో మాట పూటకో మాట మాట్లాడుతూ రాజధాని విషయంలో పిచ్చి గంతులు వేస్తున్నారు.
ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలుసో తెలియకో పిచ్చోడి చేతిలో రాష్ట్రాన్ని పెట్టారు వచ్చే ఎన్నికలలో పిచ్చోడిని రాళ్లతో కొట్టి తరమడానికి సిద్ధంగా ఉన్నారు.
ఇవి కూడా చదవండి:
వైసీపీ ఎమ్మెల్యే తో వేమిరెడ్డి భేటీ!! టీడీపీ కోసమేనా??
ఆంధ్రప్రదేశ్లో పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం... అపహాస్యం అవుతున్న రాజ్యాంగం...
శరత్ అక్రమ అరెస్ట్‌ను ఖండించిన చంద్రబాబు!! అధికారులకు వార్నింగ్!!
ముగియనున్న "రా కదలి రా"!! సరికొత్త కార్యక్రమంతో ప్రజల్లోకి చంద్రబాబు!!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: