హార్ట్‌బీట్‌ నుంచి నిద్ర వరకు… అన్నీ చెప్పే స్మార్ట్‌వాచ్‌! కేవలం రూ.599 కే... Science Expo Tour: శాస్త్ర విజ్ఞానానికి కొత్త అనుభవం.. సైన్స్ ఎక్స్‌పోజర్ టూర్‌లో ఏపీ స్టూడెంట్స్! Health tips: రాత్రి మొబైల్ చేతిలో పట్టుకుని నిద్రపోతున్నారా? మీ ఆరోగ్యానికి ఇది పెద్ద ప్రమాదం! TTD Updates: తిరుమల తాజా అప్‌డేట్.. టోకెన్ల కేటాయింపులో కీలక మార్పులు! మూడు నెలల ముందుగానే..! Jio Offers: జియో మరో సర్ప్రైజింగ్ ఆఫర్! రూ.150లోపే అన్‌లిమిటెడ్ కాల్స్‌, డేటా! Ration Card: స్మార్ట్ రేషన్ కార్డులు.. అది చేయని వారికి షాక్..! లబ్ధిదారులపై కఠిన చర్యలు..! Vande Bharath: గోదావరి ప్రజలకు గుడ్ న్యూస్! వందే భారత్ రైలు సర్వీస్ నరసాపురం వరకు విస్తరణ! కృష్ణానదిపై హైలెవల్ బ్రిడ్జి.. రూ. 109 కోట్ల నిధులు మంజూరు! తీరనున్న ఆ ప్రాంతవాసుల ఏళ్ల నాటి కల.. Canada Plans: అమెరికాకు షాక్.. కెనడా మాస్టర్ ప్లాన్.. హెచ్-1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్.! మోటోరోలా బంపర్ ఆఫర్.. రూ. 3000 తగ్గింపుతో.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ ఫోన్ మీ సొంతం! 256GB స్టోరేజీ, వైర్‌లైస్ ఛార్జింగ్‌ సహా! హార్ట్‌బీట్‌ నుంచి నిద్ర వరకు… అన్నీ చెప్పే స్మార్ట్‌వాచ్‌! కేవలం రూ.599 కే... Science Expo Tour: శాస్త్ర విజ్ఞానానికి కొత్త అనుభవం.. సైన్స్ ఎక్స్‌పోజర్ టూర్‌లో ఏపీ స్టూడెంట్స్! Health tips: రాత్రి మొబైల్ చేతిలో పట్టుకుని నిద్రపోతున్నారా? మీ ఆరోగ్యానికి ఇది పెద్ద ప్రమాదం! TTD Updates: తిరుమల తాజా అప్‌డేట్.. టోకెన్ల కేటాయింపులో కీలక మార్పులు! మూడు నెలల ముందుగానే..! Jio Offers: జియో మరో సర్ప్రైజింగ్ ఆఫర్! రూ.150లోపే అన్‌లిమిటెడ్ కాల్స్‌, డేటా! Ration Card: స్మార్ట్ రేషన్ కార్డులు.. అది చేయని వారికి షాక్..! లబ్ధిదారులపై కఠిన చర్యలు..! Vande Bharath: గోదావరి ప్రజలకు గుడ్ న్యూస్! వందే భారత్ రైలు సర్వీస్ నరసాపురం వరకు విస్తరణ! కృష్ణానదిపై హైలెవల్ బ్రిడ్జి.. రూ. 109 కోట్ల నిధులు మంజూరు! తీరనున్న ఆ ప్రాంతవాసుల ఏళ్ల నాటి కల.. Canada Plans: అమెరికాకు షాక్.. కెనడా మాస్టర్ ప్లాన్.. హెచ్-1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్.! మోటోరోలా బంపర్ ఆఫర్.. రూ. 3000 తగ్గింపుతో.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ ఫోన్ మీ సొంతం! 256GB స్టోరేజీ, వైర్‌లైస్ ఛార్జింగ్‌ సహా!

కోటి మంది మహిళలు లక్షాధికారులయ్యారు! మీరు కూడా అప్లై చేయండి!

2024-02-29 13:01:00

దేశంలో 3 కోట్ల మంది మహిళలను లాక్‌పతి దీదీగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు.

కోటి మంది మహిళలు లక్షాధికారులయ్యారు

Lakhpati Didi Yojana: దేశంలోని మహిళలకు వడ్డీ రహిత రుణాలు (Interest Free Loans) ఇచ్చి, స్వయం ఉపాధి ద్వారా వారిని లక్షాధికారులను చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకం లాక్‌పతి దీదీ యోజన. 2023 ఆగస్టు 15న, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద, స్వయం సహాయక సంఘాల సభ్యులకు రుణాలు ఇస్తారు.

స్కీమ్‌ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 3 కోట్ల మంది మహిళలకు రూ.1 లక్ష నుంచి 5 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు ఇచ్చారు. దీంతోపాటు, మహిళలకు ఆర్థికాంశాల్లో, నైపుణ్యపరంగా శిక్షణ కూడా ఇస్తున్నారు. ఎల్‌ఈడీ బల్బుల తయారీ, ప్లంబింగ్, డ్రోన్ రిపేరింగ్ తదితర సాంకేతిక పనులను నేర్పుతున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

స్వయం సహాయక సంఘాల సభ్యులై ఉండి, కుటుంబ వార్షిక ఆదాయం రూ.1 లక్ష లేదా అంతకంటే ఎక్కువగా ఉన్న మహిళలను లాక్‌పతి దీదీలుగా పిలుస్తారు.

ఈ ఏడాది ఫిబ్రవరి 1న, మధ్యంతర బడ్జెట్ ప్రసంగంలో (Interim Budget 2024), దేశంలో 3 కోట్ల మంది మహిళలను లాక్‌పతి దీదీగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు.

లాక్‌పతి దీదీ యోజన 2024 కోసం దరఖాస్తు చేసి, ఈ ప్రభుత్వ పథకం ప్రయోజనాలను పొందాలనుకుంటే, మొదట కొంత సమాచారం తెలుసుకోండి.

ముంచుకొస్తున్న పన్ను పోటు! ముచ్చటగా మూడు విషయాల్లో జాగ్రత్తపడకపోతే మీ సొమ్ము ఫసక్! 

లాక్‌పతి దీదీ పథకం వివరాలు

- వ్యాపారవేత్తలు కావాలనుకునే మహిళలు, ఒక వ్యాపారాన్ని ప్రారంభించి & అభివృద్ధి చేసుకోవడానికి ఈ పథకం కింద మార్గదర్శకత్వం పొందుతారు.

- లాక్‌పతి దీదీ యోజన కింద అందించే శిక్షణలో వ్యాపార ప్రణాళిక, మార్కెటింగ్ వ్యూహాలు, మార్కెట్ యాక్సెస్‌కు సంబంధించిన సాయం ఉంటుంది.

- మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సమగ్ర ఆర్థిక అక్షరాస్యత వర్క్‌షాప్‌లు నిర్వహిస్తారు. బడ్జెట్, పొదుపు, పెట్టుబడి వంటి వాటి గురించి నేర్పుతారు.

మరణించిన వ్యక్తి పేరిట ఐటీఆర్‌ ఫైల్‌ చేయాలా, ఎవరు సబ్మిట్‌ చేయాలి? 

- లాక్‌పతి దీదీ యోజన మైక్రో క్రెడిట్ సౌకర్యాన్ని కూడా అందిస్తుంది. దీని ద్వారా మహిళలు వ్యాపారం, విద్య, ఇతర అవసరాల కోసం సులభంగా చిన్న రుణాలు పొందొచ్చు.

- ఈ పథకం కింద, పొదుపు చేయడంలో మహిళలను ప్రోత్సహిస్తారు, నగదు రూపంలో ప్రోత్సాహకాలను కూడా అందిస్తారు.

- మహిళలకు బీమా కవరేజీ కూడా ఉంటుంది. దీంతో వారి కుటుంబ భద్రత మరింత పెరుగుతుంది.

- మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకు అనేక రకాల సాధికారత కార్యక్రమాలు నిర్వహిస్తారు.

బ్యాంక్‌, పోస్టాఫీస్‌ ఖాతాదార్లకు అలెర్ట్‌ - మార్చి 31లోగా ఈ పని చేయకపోతే జరిమానా 

- డిపార్ట్‌మెంటల్ ఔట్‌లెట్‌లు, వివిధ ప్రదేశాల్లో నిర్వహించే ప్రదర్శనల్లో వారి ఉత్పత్తుల విక్రయానికి సాయం అందుతుంది.

అర్హతలు

- దరఖాస్తుదారు తప్పనిసరిగా భారతదేశ పౌరురాలై ఉండాలి.

- వయోపరిమితి 18 నుంచి 50 సంవత్సరాలు.

- స్వయం సహాయక సంఘంలో చేరడం తప్పనిసరి.

సుకన్య సమృద్ధి యోజన పథకంలో మీ పెట్టుబడికి భారీ ఆదాయం! పన్ను ఆదా! 

అవసరమైన పత్రాలు

- ఆధార్ కార్డు

- ఆదాయ ధృవీకరణ పత్రం

- చిరునామా రుజువు

- పాన్ కార్డ్

- ఇ-మెయిల్ ఐడీ

- మొబైల్ నంబర్

- పాస్‌పోర్ట్ సైజ్‌ ఫోటో

- బ్యాంకు ఖాతా వివరాలు

ఈ బ్యాంకులో 1001 డేస్ స్పెషల్ స్కీమ్! 9.5 శాతం వడ్డీ! రూ.5 లక్షలకు ఎంతొస్తుంది? 

లాక్‌పతి దీదీ యోజన కోసం ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలి? (How to Apply Online for Lakhpati Didi Yojana?)

లాక్‌పతి దీదీ యోజన కోసం దరఖాస్తు చేసుకోవడానికి కొంత కాలం వెయిట్‌ చేయాలి. ఎందుకంటే, ఇప్పటి వరకు దీని కోసం అధికారిక వెబ్‌సైట్ విడుదల కాలేదు లేదా ఆన్‌లైన్ అప్లికేషన్స్‌ను ప్రారంభించలేదు. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించిన వెంటనే, ఆ వివరాలను మేము మీకు అందిస్తాం.

లాక్‌పతి దీదీ యోజన కోసం ఆఫ్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలి? (How to Apply Offline for Lakhpati Didi Yojana?)

ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి, మీ బ్లాక్ లేదా జిల్లాలోని మహిళా & శిశు అభివృద్ధి శాఖ కార్యాలయానికి వెళ్లాలి.

గత ఐదేళ్లలో బెస్ట్ రిటర్న్స్ ఇచ్చిన టాప్-10 మ్యూచువల్ ఫండ్స్ ఇవే! 

అక్కడ లాక్‌పతి దీదీ యోజన దరఖాస్తు ఫారం మీకు అందుతుంది.
దరఖాస్తు ఫారంలో అడిగిన సమాచారం మొత్తాన్నీ పూరించండి, అవసరమైన పత్రాలను జత చేయండి.

పత్రాలతో పాటు దరఖాస్తు ఫారాన్ని అదే కార్యాలయంలో సమర్పించి, రసీదును పొందాలి.
ఈ విధంగా లాక్‌పతి దీదీ యోజన కోసం ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రస్తుతం దేశంలో సుమారు 83,00,000 స్వయం సహాయక బృందాలు, 9 కోట్ల మందికి పైగా సభ్యులు ఉన్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, ఈ 9 కోట్ల మంది మహిళల జీవితాల్లో మార్పు వచ్చింది. ఇప్పటి వరకు, కోటి మంది మహిళలు స్వావలంబన సాధించి లాక్‌పతి దీదీలుగా మారారు.

ఇవి కూడా చదవండి: 

జగన్ అక్రమాస్తుల పిటిషన్లు తేల్చాలి!! తెలంగాణ హైకోర్టు సిబిఐ కు కీలక ఆదేశాలు 

వైసీపీ 8వ జాబితా విడుదల!! 

ఉపముఖ్యమంత్రి రాజన్నదొరకు చేదు అనుభవం!! 

వైసీపీ ఫేక్ ప్రచారంపై మండిపడుతున్న టీడీపీ నేతలు!! 

ఇవాళ ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం! 100 నుంచి 120 మందితో తొలి జాబితా.. 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group 

Spotlight

Read More →