భారత్ లో గతేడాది రికార్డు స్థాయిలో పాస్ పోర్టులు జారీ అయ్యాయి. రోజుకు 37,700 చొప్పున గతేడాది సుమారు 1.37 కోట్ల పాస్ పోర్టులు జారీ అయ్యాయని విదేశాంగ శాఖ నివేదికలు చెబుతున్నాయి. ఈ నివేదికల ప్రకారం, ప్రస్తుతం భారత్ లో వ్యాలిడిటీ ఉన్న పాస్ పోర్టులు సంఖ్య 9.26 కోట్లు. ఇందులో 4.93 కోట్ల పాస్ పోర్టు లను 2019 తరువాతే జారీ చేశారు. మొత్తం పాస్ పోర్టులలో 65 శాతం పురుషుల వద్ద, మిగతావి మహిళల వద్ద ఉన్నాయి.
పాస్ పోర్టుల జారీలో ఉత్తర ప్రదేశ్ దేశంలోనే నెంబర్ 1గా నిలిచింది. ఆ తరువాత స్థానంలో కేరళ, మహారాష్ట్ర ఉన్నాయి. మహిళా పాస్ పోర్టు హోల్డర్ లు కేరళలో అత్యధికంగా ఉన్నారు. ఆ తరువాతి స్థానంలో మహారాష్ట్ర నిలిచింది. మిజోరంలో పాస్పోర్టుదారుల్లో మహిళల వాటా 62 శాతం, నాగాలాండ్ లో 55 శాతంగా ఉంది. సిక్కింలోని పాస్పోర్టుదారుల్లో దాదాపు సగం మంది మహిళలు ఉన్నారు.
అచ్చెన్న నాయకత్వానికే మొగ్గు చూపించిన టెక్కలి పట్టణం! వైకాపా నుండి భారీగా చేరికలు!
గతేడాది ఏదాది మొత్తం పాస్ పోర్టులలో సగం కేరళ (15.47 లక్షలు), మహారాష్ట్ర (15.10 లక్షలు), ఉత్తరప్రదేశ్ (13.68 లక్షలు), తమిళనాడు (11.47 లక్షలు), పంజాబ్ (11.4 లక్షలు) రాష్ట్రాల్లోనే జారీ చేశారు. విదేశీ ప్రయాణాలు, పాస్ పోర్టు సులభంగా లభించడం తదితర కారణాల రీత్యా పాస్ పోర్టుకు దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య అధికంగా ఉంటోంది. విదేశాంగ శాఖ ప్రకారం, 2015లో పాస్పోర్టు జారీకి సగటున 21 రోజులు పడుతుండగా 2023 లో ఆరు రోజులు మాత్రమే పడుతుంది.
పాస్పోర్టు చట్టం-1967 ప్రకారం, కేంద్రం ప్రభుత్వం ఆర్డినరీ, డిప్లొమేటిక్, అఫీషియల్, ఎమర్జెన్సీ సర్టిఫికేట్, సర్టిఫికేట్ ఆఫ్ ఐడెంటిటీ పేరిట ఐదు రకాల పాస్పోర్టులను జారీ చేస్తుంది.
ఇవి కూడా చదవండి:
మంగళగిరిలో వైసీపీకి షాక్! టీడీపీలో భారీగా చేరికలు!
టీడీపీ అధినేత చంద్రబాబుతో గంటా శ్రీనివాసరావు సమావేశం!
కడపను డిప్యూటీ సీఎం గంజాయి నగరంగా మార్చారు -శ్రీనివాస్ రెడ్డి
ఓడిన దగ్గరే గెలవాలని మంగళగిరిలో మళ్లీ పోటీ చేస్తున్నా -నారా లోకేశ్
గన్నవరంలో టీడీపీ నేత యార్లగడ్డకు అపూర్వ ఆదరణ!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి