ప్రధానమంత్రి ముద్ర యోజన పథకంలో రూ.10లక్షల వరకు బ్యాంక్ లోన్ పొందవచ్చు. ఎలాంటి గ్యారెంటీ అవసరం లేకుండానే ఈ మొత్తం లోన్ పొందవచ్చు. మీరు అర్హులో కాదో చెక్ చేసుకోండి...
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
MUDRA Yojana: భారత ప్రభుత్వం వివిధ పథకాలతో పారిశ్రామిక రంగాలకు ప్రోత్సాహకాలు అందిస్తోంది. కార్పొరేట్, వ్యవసాయేతర చిన్న/సూక్ష్మ సంస్థలకు ఆర్థిక సహాయం అందించే లక్ష్యంతో 2015 ఏప్రిల్ 8న ప్రధాని నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి ముద్ర యోజన (PMMY) పథకాన్ని ప్రారంభించారు. ఈ స్కీమ్ కింద కమర్షియల్ బ్యాంక్‌లు, RRBలు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లు, MFIలు, NBFCలు సహా వివిధ ఆర్థిక సంస్థల ద్వారా అర్హత కలిగిన వ్యక్తులకు రూ.10 లక్షల వరకు గ్యారంటీ అవసరం లేని లోన్లు మంజూరు చేస్తారు.
పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా?? ఈ ఐదు విషయాలు తెలుసా మీకు?? లేదంటే తిప్పలే!!
అర్హులు వీరే: మైక్రో యూనిట్స్ విభిన్న నిధుల అవసరాలను తీర్చడానికి, ముద్ర మూడు ప్రొడక్టులను ప్రవేశపెట్టింది. అవి శిశు, కిషోర్, తరుణ్ లోన్లు. శిశు కేటగిరీ కింద రూ.50,000 వరకు, కిషోర్ విభాగంలో రూ.50,000- రూ.5,00,000 వరకు రుణాలు అందిస్తారు. అయితే తరుణ్ కింద అత్యధికంగా రూ.5,00,000 నుంచి రూ.10,00,000 వరకు లోన్‌లు అందిస్తారు. యువతలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ని ప్రోత్సహించడానికి ప్రత్యేకంగా శిశు కేటగిరీ యూనిట్‌లపై ఫోకస్ చేశారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
50వేల నుంచి మొదలు: ముద్ర ఫండింగ్ రెండు విభిన్న పథకాల ద్వారా అందిస్తారు. మొదటిది మైక్రో క్రెడిట్ స్కీమ్ (MCS). ఇది రూ.1 లక్ష వరకు రుణాలను అందిస్తుంది. మైక్రోఫైనాన్స్ సంస్థల (MFIs) ద్వారా సులభతరం చేస్తుంది. రెండో స్కీమ్ రీఫైనాన్స్ స్కీమ్. ఇది వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు (RRBs), స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలకు (NBFCs) అందుబాటులో ఉంది. ఈ పథకం కింద, అర్హత కలిగిన రుణగ్రహీతలకు రుణాలను అందించడానికి ఈ ఆర్థిక సంస్థలు ముద్ర నుంచి రీఫైనాన్స్ సపోర్ట్ పొందవచ్చు.
ట్యాక్స్ పేయర్స్‌కి గుడ్‌న్యూస్!! లక్ష వరకు పెండింగ్ ట్యాక్స్ మాఫీ!!
Credit Card: SBI క్రెడిట్ కార్డ్‌తో ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసుకోవచ్చు.. ఇదిగో ఈవిధంగా
ప్రధాన మంత్రి ముద్ర యోజన ఫీచర్లు... కాంప్రహెన్సివ్ ఫైనాన్సింగ్: తయారీ, వ్యాపారం, సేవలు, పౌల్ట్రీ, డైరీ, తేనెటీగల పెంపకం వంటి అనుబంధ వ్యవసాయ కార్యకలాపాలు వంటి వివిధ రంగాలలో టర్మ్ లోన్‌లు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం PMMY రుణాలను అందిస్తుంది.
అనువైన వడ్డీ రేట్లు: ఆర్‌బీఐ మార్గదర్శకాలను అనుసరించి రుణ సంస్థల ద్వారా ముద్ర రుణాల వడ్డీ రేట్లు నిర్ణయిస్తారు. వర్కింగ్ క్యాపిటల్ కోసం, రుణగ్రహీత ఓవర్‌నైట్ హోల్డ్ చేసిన ఆధారంగా వడ్డీ వసూలు చేస్తుంది.
లోన్ అమౌంట్: మినిమం లోన్ రిక్వైర్‌మెంట్ లేనప్పటికీ, PMMY కింద లభించే గరిష్ట లోన్ మొత్తం రూ.10 లక్షలు.
దుబాయ్ లో బంగారం ధర చాలా తక్కువ! కారణం తెలుసా! మరీ అంత తేడానా?
ప్రాసెసింగ్ ఛార్జీలు: ముద్ర రుణాల కోసం దరఖాస్తు చేసేటప్పుడు రుణగ్రహీతలు ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. లేదా తాకట్టు అందించాల్సిన అవసరం లేదు.
సెక్టార్ ఇన్‌క్లూజివిటీ: PMMY వ్యవసాయేతర రంగంలో మాత్రమే కాకుండా ఉద్యానవన, మత్స్య పరిశ్రమ వంటి అనుబంధ వ్యవసాయ కార్యకలాపాలలో పాల్గొనే సంస్థలకు కూడా రుణాలు ఇస్తుంది.
పొరపాటున వీటిలో ఇన్వెస్ట్ చేసారా?? ఇంక మీ పిల్లల కలలు తీరినట్టే!!
వడ్డీ రేటు లెక్కింపు:ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం, ముద్ర రుణాలపై వడ్డీ రేటు మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేటు(MCLR) ఆధారంగా కాలిక్యులేట్ చేస్తారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి