New changes WhatsApp: ఆన్‌లైన్ బిజినెస్‌లు, సోషల్ యూజర్లకు సూపర్ గుడ్ న్యూస్ – వాట్సాప్‌లో కొత్త మార్పులు! Schemes: పథకాలు కొనసాగాలంటే ఆది తప్పనిసరి..! ప్రభుత్వం కీలక హెచ్చరిక..! Sbi clerk: ఫలితాలతో అభ్యర్థుల్లో ఉత్సాహం.. మెయిన్స్ కోసం సన్నాహాలు వేగవంతం! Pollution: ఢిల్లీలో వాయు కాలుష్యం 400 దాటింది..! చైనా సహాయ హామీ..! Russia: రష్యా నుంచి మరో సూపర్ డీల్..! Kh-69 స్టెల్త్ మిస్సైల్ టెక్నాలజీ భారత్‌కి బదిలీ..! BSNL Update: బీఎస్‌ఎన్‌ఎల్‌ సూపర్‌ ఆఫర్.. ప్రతిరోజూ 2GB డేటా ఫ్రీ.. మార్కెట్‌లో ఇదే చీపెస్ట్! 50 రోజుల వ్యాలిడిటీతో.. మళ్లీ ఏపీలో వర్షాలు... ఉపరితల ఆవర్తన ప్రభావం! రాబోయే 24 గంటల్లో... Data center: గూగుల్‌ సంచలన ప్రయోగం..! ఏఐ డేటా సెంటర్లు ఇక అంతరిక్షంలోనే..! Oman National Day: ఒమాన్‌లో కొత్త చరిత్ర.. జాతీయ దినోత్సవానికి రెండు రోజుల అధికారిక సెలవు! Sleep health : నిద్రకు ముందు రీల్స్‌ చూస్తున్నారా.. ఆరోగ్యానికి ముప్పు.. వైద్యుల హెచ్చరిక! New changes WhatsApp: ఆన్‌లైన్ బిజినెస్‌లు, సోషల్ యూజర్లకు సూపర్ గుడ్ న్యూస్ – వాట్సాప్‌లో కొత్త మార్పులు! Schemes: పథకాలు కొనసాగాలంటే ఆది తప్పనిసరి..! ప్రభుత్వం కీలక హెచ్చరిక..! Sbi clerk: ఫలితాలతో అభ్యర్థుల్లో ఉత్సాహం.. మెయిన్స్ కోసం సన్నాహాలు వేగవంతం! Pollution: ఢిల్లీలో వాయు కాలుష్యం 400 దాటింది..! చైనా సహాయ హామీ..! Russia: రష్యా నుంచి మరో సూపర్ డీల్..! Kh-69 స్టెల్త్ మిస్సైల్ టెక్నాలజీ భారత్‌కి బదిలీ..! BSNL Update: బీఎస్‌ఎన్‌ఎల్‌ సూపర్‌ ఆఫర్.. ప్రతిరోజూ 2GB డేటా ఫ్రీ.. మార్కెట్‌లో ఇదే చీపెస్ట్! 50 రోజుల వ్యాలిడిటీతో.. మళ్లీ ఏపీలో వర్షాలు... ఉపరితల ఆవర్తన ప్రభావం! రాబోయే 24 గంటల్లో... Data center: గూగుల్‌ సంచలన ప్రయోగం..! ఏఐ డేటా సెంటర్లు ఇక అంతరిక్షంలోనే..! Oman National Day: ఒమాన్‌లో కొత్త చరిత్ర.. జాతీయ దినోత్సవానికి రెండు రోజుల అధికారిక సెలవు! Sleep health : నిద్రకు ముందు రీల్స్‌ చూస్తున్నారా.. ఆరోగ్యానికి ముప్పు.. వైద్యుల హెచ్చరిక!

కూల్చివేతలు, అక్రమ కేసులు, వేధింపులు, హత్యలు, ఆత్యాచారాలు!! కనుచూపు మేర అభివృద్ధి లేని ఏపీ

2024-02-22 17:09:00

ఏపీలో ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో అధికార వైసిపి గ్రాఫ్ రోజు రోజుకు దిగజారిపోతుంది.

2019 ఎన్నికలలో 50 శాతానికి పైగా ఓట్లు సాధించి 151 ఎమ్మెల్యేలను గెలిచి అధికారం హస్తగతం చేసుకున్న వైసిపి పతనావస్తకు చేరింది.

ఈయన పాలన ప్రారంభం నుండి కూల్చివేతలు అక్రమ కేసులు వేధింపులు హత్యలు ఆత్యాచారాలు తప్ప అభివృద్ధి కనుచూపు మేర లో కనిపించడం లేదు.

గత సంవత్సర కాలంగా వివిధ సర్వే సంస్థలు చేస్తున్న సర్వేలలో వైసిపి ఓట్లు గణనీయంగా తగ్గుతూ వస్తున్నాయి.

అమెరికా నుండి టీడీపీ ప్రచారానికి వచ్చిన NRI ఆకస్మిక మృతి!!

ఇండియా టుడే ప్రతి మూడు నెలలకు ఒకసారి జరుపుతున్న సర్వేలలో వైసిపి పట్ల ప్రజా వ్యతిరేకత పెరుగుతూ వస్తుంది అన్నది స్పష్టం చేస్తున్నారు.

తెలుగుదేశం జనసేన పార్టీ ఓటమి కట్టిన తర్వాత వచ్చిన సర్వేలలో కూటమికి ఓట్ల శాతం గణనీయంగా పెరిగింది.

జనవరి 31వ తేదీ నాటికి ఇండియా టుడే జరిపిన సర్వేలో టిడిపి జనసేన కూటమికి 51 శాతం ఓట్లు వైసీపీకి 40% ఓట్లు వస్తాయని సర్వే ఫలితాలు వెల్లడించాయి.

వచ్చే ఎన్నికలలో టిడిపి జనసేన ప్రభంజనం సృష్టిస్తాయని సర్వే ఫలితాలు చెబుతున్నాయి.

ఈయన పాలనపై ప్రజలు తీవ్ర ఆగ్రహ వేషాలతో ఉన్న నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా టిడిపి జనసేన కూటమిని ప్రజలు ఎంచుకుంటున్నారు.

మరిన్ని ఆసక్తికర ఎక్స్ క్లూజివ్ వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

కడప,అరకు జిల్లాలు తప్పితే వైసిపికి గౌరవప్రదమైన సీట్లు దక్కే జిల్లాలు కనిపించడం లేదు.

సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండు నెలలు సమయం ఉన్నందున అప్పటికి వైసిపి పార్టీ మరింత పతనావస్థకు చేరుతుందని ప్రతిపక్షాలు బలంగా నమ్ముతున్నాయి.

టిడిపి జనసేన పార్టీలకు బిజెపి పార్టీ కూడా తోడువుతుందన్న సమాచారంతో కూటమి గ్రాఫ్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పై ఉన్న వ్యతిరేకత పై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు జగన్ చెల్లెలు వైయస్ షర్మిల బలం చేకూర్చేలా రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.

షర్మిల అడిగే ప్రశ్నలకు ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేని స్థితిలో వైసిపి పాలకులు ఉన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాక్షన్ అమలు చేయడానికి వైసిపి సన్నాహాలు! తెగించిన వారికే భూత్ ఏజెంట్లు?

ఈయన ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటినుండి ప్రతిపక్ష నాయకులపై తప్పుడు కేసులు వ్యక్తిగత దాడులు వ్యక్తిగత దూషణలు తప్ప రాష్ట్ర గురించి ఒక్క నిమిషం కూడా ఆలోచించిన దాఖలాలు లేవు.

ఎన్నికలలో ఇచ్చిన హామీలను గాలికి వదిలి నవరత్నాలు శ్రీరామరక్షగా ఈయన భావిస్తున్నారు.

మనుషులకు వ్యక్తిగత లాభంతోపాటు సామాజిక బాధ్యత కూడా ఉంటుందన్న విషయాన్ని ఈయన  విస్మరించారు.

వ్యక్తిగతంగా మీ కుటుంబాలకు లబ్ధి చేకూరి తేనె తనకు ఓట్లు ఎండని చెప్పడం వెనక ఈయన కుట్ర బహిర్గతమవుతుంది.

నీ ఇల్లు తుడుచుకొని రోడ్డుపై చెత్త వేస్తే వచ్చే అంటూ వ్యాధులు కూడా నీకే అన్న విషయాన్ని ప్రజలు గ్రహిస్తున్నారు.

పేదలకు చేయూతనివ్వడం ప్రభుత్వ లక్ష్యం వీటిని ఈయన కాదు గత ప్రభుత్వాలు కూడా నిర్వర్తించాయి.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

సర్వేలలో వస్తున్న ఫలితాలను చూసి ఈయన కంటిమీద కునుకులేని పరిస్థితి.

వచ్చే ఎన్నికలలో ఈయన ప్రభుత్వం ఓడిపోతే తిరిగి జైలుకెళ్లడం తప్పితే మరొక మార్గం ఈయన  కనిపించడం లేదు.

రాష్ట్రంలో రైతులను ఉద్యోగులను నిరుద్యోగులను కాంట్రాక్టర్లను వ్యాపారస్తులను ట్రాన్స్పోర్ట్ రంగాన్ని ఇలా అన్ని రంగాలు జగన్ ప్రభుత్వం పై ఆగ్రహంతో ఉన్నాయి.

గతంలో పైన పేర్కొన్న అన్ని వర్గాలు ఈయన అండగా నిలిచాయి.

అండగా నిలిచిన వర్గాలను అణగద్రొక్కి దళితులను ఊచ కోత కోసి, దళిత సంక్షేమ పథకాలను రద్దుచేసి దళితులను అడుగడుగునా మోసం చేస్తున్న ఈయన ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న ఈయన బహిరంగ సభలలో ప్రజలను కులాలే వారిగా చీల్చి మాట్లాడడం పూర్తి రాజ్యాంగ విరుద్ధం.

ఆంధ్రప్రదేశ్లో పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం... అపహాస్యం అవుతున్న రాజ్యాంగం...

మైకు పట్టుకుంటే నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అంటున్న ఈయన వారి అభివృద్ధికి చేసిన ఒక్క పథకం చెప్పమంటే చెప్పే దిక్కులేదు.

ఈయన ప్రభుత్వం చేరడంతో వచ్చే ఎన్నికలలో ఘోర ఓటమి చూడబోతున్నారు అన్న విషయాన్ని గ్రహించిన పార్టీ వర్గాలు కూడా మళ్లీ పోటీకి విముఖత చూపుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో కోరం లేక శాసనసభ వాయిదా వేసిన సంఘటన ఇప్పటివరకు తెలియదు.

ఈయన ఓటమి భయంతో ఢిల్లీకి పరిగెడితే ఈ ఎమ్మెల్యేలు ఏం చేయాలో తెలియక శాసనసభకు డుమ్ము కొడితే శాసనసభలో సభ్యులు లేక వాయిదా పడింది.

ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇంతకంటే సిగ్గుపడవలసిన పరిస్థితి మరొకటి లేదు.

రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాక్షన్ అమలు చేయడానికి వైసిపి సన్నాహాలు! తెగించిన వారికే భూత్ ఏజెంట్లు?

అధికారంలో ఉన్నప్పుడు రెచ్చిపోయిన అధికార వర్గాలు ఓటమి సర్వేలతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.

సర్వే ఫలితాలు కంటే వైసీపీ పార్టీ మరీ ఇంత ఘోరంగా ఓటమి ఎదుర్కోబోతుందని రాష్ట్రంలో స్థానిక పరిస్థితులను బట్టి స్పష్టంగా తెలుస్తుంది.

వైసిపికి ఇచ్చిన 151 స్థానాలకు మించి టిడిపి జనసేన కూటమికి వస్తా అనడంలో అతిశయోక్తి లేదు.

ఎన్నికలలో రౌడీయిజం ద్వారా గలాటాలు సృష్టించి ఓట్లకు డబ్బులను వెదజల్లి ఎలాగైనా గెలవాలనుకునే వైసిపి పార్టీకి ఎన్నికలలో ఘోర పరాభవం తప్పదు.

ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ పరిస్థితి పై ఆవేదన చెందిన రిటైర్డ్ ఐ.ఎ.ఎస్ అధికారి!!

మరిన్ని ఆసక్తికర ఎక్స్ క్లూజివ్ వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →