పారాసిటమాల్… దాదాపు అందరి ఇళ్లలోనూ ఉండే మాత్ర ఇది. జ్వరం తగ్గించడంతోపాటు చిన్నచిన్న నొప్పులను వెంటనే తగ్గించడంలో అద్భుతంగా పనిచేసే ఔషధం ఇది. దీని పనితీరు అమోఘమే అయినా నిపుణులు మాత్రం దాని వాడకంపై హెచ్చరికలు జారీచేశారు.
ఇంకా చదవండి: కీర దోసకాయ ఆరోగ్యానికే కాదు.. జుట్టు కూడా చాలా మంచిది! ఏంటి నిజమా? ఎందుకు ఆలస్యం చూసేయండి అదేంటో!
దీనిని అదేపనిగా తీసుకుంటే ఆరోగ్య సమస్యలు తప్పవని చెబుతున్నారు. ఎడిన్‌బరో యూనివర్సిటీ నిర్వహించిన తాజా అధ్యయనంలో విస్తుపోయే విషయం ఒకటి వెల్లడైంది. ఎలుకలకు అదే పనిగా పారాసిటమాల్ ఇస్తూ వాటిలో కలిగే మార్పులను పరిశీలించారు.
ఇంకా చదవండి: ప్రభుత్వ నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోతున్న గుంటూరు ప్రజలు!! హెల్త్ ఎమర్జెన్సీ??
ఈ సందర్భంగా కాలేయం దెబ్బతిన్నట్టు గుర్తించారు. పారాసిటమాల్‌ను అధికమోతాదులో తీసుకునే రోగుల్లోనూ ఇదే ఫలితం కనిపిస్తుందని హెచ్చరించారు. దీర్ఘకాలిక నొప్పులతో బాధపడుతున్నవారు రోజుకు 4 గ్రామల వరకు పారాసిటమాల్ తీసుకోవడం వరకు ఓకే అని, కానీ అంతకుమించి తీసుకుంటే మాత్రం ఆరోగ్యాన్ని పణంగాపెట్టడమే అవుతుందని తెలిపారు.
ఇంకా చదవండి: దిండు లేకుండా నిద్రపోవటం వల్ల ఇన్ని ఉపయోగాలు.. అరే పేస్ బ్యూటీని పెంచుదాం!
పారాసిటమాల్ డ్రగ్ అవయవాల్లోని కీలకమైన నిర్మాణాన్ని దెబ్బతీస్తున్నట్టు పరిశోధకులు గుర్తించారు. కాలేయం, ఇతర అవయవాలకు మధ్యనున్న కణజాలాన్ని పారాసిటమాల్ దెబ్బతీస్తున్నట్టు పరిశోధనలో వెల్లడైనట్టు పేర్కొన్నారు.
ఇంకా చదవండి: తస్మా జాగ్రత్త! రాత్రి పూట నిద్ర పట్టటం లేదా అయితే బి12 లోపం కావచ్చేమో? ఇవి తినేయండి..
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: