దేశీయ ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంక్ అయిన ఐసీఐసీఐ బ్యాంక్ తాజాగా కీలక ప్రకటన చేసింది. డిపాజిట్లు చేసే తమ కస్టమర్లకు శుభవార్త అందించింది. రూ.2 కోట్ల లోపు ఉండే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరిస్తున్నట్లు తెలిపింది. సవరించిన కొత్త వడ్డీ రేట్లు ఫిబ్రవరి 17, 2024 నుంచే అమలులోకి వచ్చినట్లు వెల్లడించింది. ఈ సవరణ ద్వారా సీనియర్ సిటిజన్లకు గరిష్ఠంగా 7.75 శాతం.. మేర వడ్డీ అందిస్తున్నట్లు తెలిపింది. అలాగే జనరల్ కస్టమర్లకు వడ్డీ రేటు గరిష్ఠంగా 7.20 శాతానికి.. పెరిగినట్లు తెలిపింది.
ఇంకా చదవండి: కువైట్: అబ్దలిలో ఎంబసీ కాన్సులర్ క్యాంపు!...
డొమెస్టిక్ ఎఫ్‌డీ ఖాతా తెరిచేందుకు కనీస డిపాజిట్ అమౌంట్ రూ.10 వేలుగా ఉంది. జనరల్ కస్టమర్లతో పోలిస్తే సీనియర్ సిటిజన్లకు అదనంగా 50 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ ఆఫర్ చేస్తోంది. దీంతో స్పెషల్ టెన్యూర్ పై సీనియర్ సిటిజన్లకు గరిష్ఠంగా 7.75 శాతం.. మేర వడ్డీ లభిస్తోంది. వివరాలకు వెళితే..
ఇంకా చదవండి: సింగపూర్: జోరుగా ఆటపాటలతో సాగిన సంక్రాంతి...
7 రోజు నుంచి 29 రోజుల టెన్యూర్ పై జనరల్ కస్టమర్లకు 3 శాతం వడ్డీ అందిస్తోంది. 30 రోజుల నుంచి 45 రోజుల టెన్యూర్ ఎఫ్‌డీలపై 3.5 శాతం వడ్డీ అందిస్తోంది.
ఇంకా చదవండి: ఆస్ట్రేలియా: స్కూల్స్ లో ఇకపై ఇవి బంద్! నిరాశ...
46 రోజుల నుంచి 60 రోజుల టెన్యూర్ పై 4.25 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది. 61 రోజుల నుంచి 90 రోజులకు 4.50 శాతం, 91 రోజుల నుంచి 184 రోజుల వరకు 4.75 శాతం వడ్డీ అందిస్తోంది.
ఇంకా చదవండి: యూరోప్: భారం కాబోతున్న స్కెంజన్ వీసా...
185 రోజుల నుంచి 270 రోజుల వరకు 5.75 శాతం వడ్డీ అందిస్తోంది. 271 రోజుల నుంచి ఏడాది లోపు టెన్యూర్లకు 6 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది.
ఇంకా చదవండి: ఒమన్: నిషేధ లోయ ప్రాంతం అల్ దఖిలియా లో 36 మంది...
ఏడాది నుంచి 389 రోజులకు 6.70 శాతం, 390 రోజుల నుంచి 15 నెలలలోపు 6.70 శాతం వడ్డీ అందిస్తోంది. 15 నెలల నుంచి 18 నెలల లోపు డిపాజిట్లపై 7.20 శాతం వడ్డీ ఇస్తోంది.
ఇంకా చదవండి: ఖతార్: అందమైన అతి పెద్ద గాలిపటాల ఫెస్టివల్!...
18 నెలల నుంచి 2 ఏళ్లలోపు డిపాజిట్లపై 7.20 శాతం, 2 ఏళ్ల నుంచి మూడేళ్లలోపు వాటికి 7 శాతం ఇస్తోంది. 3 ఏళ్ల నుంచి 5 ఏళ్లకు 7 శాతం, 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల మెచ్యూరిటీ డిపాజిట్లకు 6.90 శాతం ఆఫర్ చేస్తోంది. 5 ఏళ్ల టెన్యూర్ గల ట్యాక్స్ సేవింగ్స్ డిపాజిట్లకు 7 శాతం వడ్డీ అందిస్తోంది.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి