ఇటీవల మీజిల్స్ వ్యాధి ఆస్ట్రేలియాలో కలకలం రేపుతుంది. విదేశాల నుంచి వచ్చిన ఏడాది వయసు ఉన్న చిన్నారికి ఈ వ్యాధి సోకింది. దీనితో సౌత్ ఆస్ట్రేలియా మరియు విక్టోరియన్ ఆరోగ్య అధికారులు హెచ్చరికను జారీ చేశారు. ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ వ్యాధి లక్షణాలు జ్వరం దగ్గు ముక్కు కారటం మరియు కళ్ళ నొప్పులు తో మొదలవుతాయి. తర్వాత శరీరంపై మచ్చలు దద్దుర్లు వ్యాపిస్తాయి. ఒకవేళ ఈ లక్షణాలు గనుక ఉంటే వెంటనే డాక్టర్ను సంప్రదించాలని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరించారు.
మరి కొన్ని తాజా ఆస్ట్రేలియా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
దుబాయ్ నుంచి మెల్బోర్న్ కి వచ్చి అక్కడ నుంచి అడిలైడ్ కు వచ్చిన ఒక చిన్నారికి ఈ వ్యాధి సోకింది. ఈ పాప తన తల్లిదండ్రులతో ఫిబ్రవరి 14న ఎమిరేట్స్ ఫ్లైట్ EK408 లో దుబాయ్ నుండి మెల్బోర్న్ కి రాత్రి 10.50 గంటలకు ల్యాండ్ అయింది. తర్వాత రోజు ఉదయం 1.20 గంటల వరకు మెల్బోర్న్ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ టెర్మినల్ 2 లో ఉన్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు టర్మినల్ 1కి తిరిగి వచ్చి. ఫిబ్రవరి 15న అడిలైడ్ కు QF685 విమానంలో బయలుదేరి, 3.45 కు అడిలైడ్ కు చేరుకున్నారు. ఫిబ్రవరి 15, 16 తారీకులలో రాత్రి 10 గంటల నుండి తెల్లవారుజామున 4 గంటల వరకు హాస్పిటల్లో ఎమర్జెన్సీ వార్డులో ఉన్నారు. ఈ ప్రదేశాలలో ఉన్న వారు ఎవరైనా మీకు కూడా లక్షణాలు ఉన్నాయేమో ఒకసారి పరీక్షించుకోవాలని అధికారులు తెలిపారు.
రేపు రాప్తాడులో సీఎం సభ!! పోలీసుల అత్యుత్సాహం!! మండిపడుతున్న స్థానికులు...
మరో రెండు నెలల్లో మారనున్న మంగళగిరి: నారా బ్రహ్మణి
మానవత్వంలేని ప్రభుత్వ అధికారంలో గాలిలో దీపంలా గిరిజనుల ప్రాణాలు!! లోకేష్ భరోసా
జనసేనలో అంతర్గత విభేదాలు!! ఎంపీగా నేను, ఎమ్మెల్యేగా నువ్వు??
నేడు (17-2-2024) యువనేత నారా లోకేష్ శంఖారావం వివరాలు!!
రాజాం శంఖారావం సభలో యువనేత లోకేష్ ప్రసంగం! అవి గోతులు కాదు.. స్విమ్మింగ్ ఫూల్స్
అనంతపురం: మడకశిరలో నారా భువనేశ్వరి పర్యటన!
ఎన్టీఆర్ ఆశయ సాధనలో ట్రస్టు అనేక రంగాల్లో సేవలందిస్తోంది -చంద్రబాబు
తెలుగు ప్రవాసులకు ఉపయోగపడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒకచోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.