అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ నల్గొండ సభలో తొలిసారిగా మాట్లాడారు. నల్గొండ సభ రాజకీయ సభ కాదు పోరాట సభ... రాష్ట్రాన్ని దద్దమ్మలు, చేతకానివాళ్లు పాలిస్తున్నారని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆరోపించారు. తాను పదవి నుంచి తప్పుకోగానే రాష్ట్రంలో కరెంటు కోతలు మొదలయ్యాయన్నారు.

ప్రజల కోసం తాను ఎక్కడెక్కడి నుంచో కరెంటు తెచ్చి ఇచ్చానని, కానీ.. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వంలో అసెంబ్లీని కూడా జనరేటర్‌ పెట్టి నడిపించుకుంటున్నారని విమర్శించారు. ప్రజలు ఏ భ్రమలకో లోనై.. పాలిచ్చే బర్రెను కాదని దున్నపోతును తెచ్చుకున్నారని వ్యాఖ్యానించారు. అయినా తమకు అప్పజెప్పిన ప్రతిపక్ష బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తామని, తెలంగాణ ప్రజల హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. నీళ్లు లేకపోతే మనకు బతుకు లేదు.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

కృష్ణా జలాలు మన జీవన్మరణ సమస్య. కృష్ణా జలాలు పరిరక్షించుకునేందుకు అనారోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా వచ్చాను.నా కట్టె కాలేంత వరకు తెలంగాణ ప్రజల హక్కుల కోసం పోరాడుతాను అని కేసీఆర్‌ ఉద్ఘాటించారు. ఈ సభతో జల ఉద్యమం ఆగదని, కృష్ణాజలాల్లో తెలంగాణ హక్కులు సాధించేంత వరకు తాము విశ్రమించబోమని కేసీఆర్‌ అన్నారు..

ఎల్‌ఎండీ, ఎంఎండీ నింపి ఐదు లక్షల ఎకరాలను నీరివ్వాల్సి ఉంటే... ఆ పని చేయకుండా మేడిగడ్డకు పోతాం... బొందలగడ్డకు పోతామంటున్నారు. అక్కడేమైనా తోకమట్ట ఉందా? అక్కడికి వెళ్లి ఏం చేస్తారు? అని కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాలు ముగిశాక తాము కూడా అక్కడికే వెళ్లి కాంగ్రెస్‌ బండారం బయటపెడతామన్నారు. నల్గొండలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక జీరో ఫ్లోరైడ్ రహిత జిల్లాగా మార్చాం. భగీరథ నీళ్లతో ఫ్లోరైడ్ భయాలు పోయాయి అన్నారు.

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group