US Culture: అమెరికాలో బట్టలు బయట ఆరబెడితే జరిమానా! 80 శాతం ప్రపంచం ఒకలా.. ఇక్కడ మరోలా!! Underground City: 280 అడుగుల లోతులో అద్భుతమైన భూగర్భ నగరం! 18 అంతస్తులు.. 20 వేల మందికి ఆశ్రయం... ఎక్కడో తెలుసా! 108 Services: ఏపీలో 108 విజయభేరి.. 10 నెలల్లో 6.4 లక్షల మందికి ప్రాణదానం!! Sea-Plane: విశాఖ టు పాడేరు కేవలం 20 నిమిషాలే.. సీప్లేన్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్!! PM Modi: ఈ రోజు రాత్రి 8:30 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం!! Delimitation: డీలిమిటేషన్ వెనుక బీజేపీ పెద్ద కుట్ర! ప్రియాంకా గాంధీ సంచలన ఆరోపణలు..! Chicken Skin: చికెన్ స్కిన్ ఆరోగ్యానికి మంచిదా? చేదు నిజాన్ని వెల్లడించిన నిపుణులు! Chandrababu: నిడదవోలులో బాబు నిరసన గళం.. మహిళా బిల్లుపై విపక్షాల తీరుకు వ్యతిరేకంగా ర్యాలీ! Prakash Raj: ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై ఆగ్రహం.. నోటీసులు జారీ చేసిన న్యాయవాదులు! Dwacra Womens: డ్వాక్రా మహిళలకు ఏపీ సర్కార్ బంపర్ ఆఫర్.. 72 గంటల్లోనే లోన్! US Culture: అమెరికాలో బట్టలు బయట ఆరబెడితే జరిమానా! 80 శాతం ప్రపంచం ఒకలా.. ఇక్కడ మరోలా!! Underground City: 280 అడుగుల లోతులో అద్భుతమైన భూగర్భ నగరం! 18 అంతస్తులు.. 20 వేల మందికి ఆశ్రయం... ఎక్కడో తెలుసా! 108 Services: ఏపీలో 108 విజయభేరి.. 10 నెలల్లో 6.4 లక్షల మందికి ప్రాణదానం!! Sea-Plane: విశాఖ టు పాడేరు కేవలం 20 నిమిషాలే.. సీప్లేన్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్!! PM Modi: ఈ రోజు రాత్రి 8:30 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం!! Delimitation: డీలిమిటేషన్ వెనుక బీజేపీ పెద్ద కుట్ర! ప్రియాంకా గాంధీ సంచలన ఆరోపణలు..! Chicken Skin: చికెన్ స్కిన్ ఆరోగ్యానికి మంచిదా? చేదు నిజాన్ని వెల్లడించిన నిపుణులు! Chandrababu: నిడదవోలులో బాబు నిరసన గళం.. మహిళా బిల్లుపై విపక్షాల తీరుకు వ్యతిరేకంగా ర్యాలీ! Prakash Raj: ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై ఆగ్రహం.. నోటీసులు జారీ చేసిన న్యాయవాదులు! Dwacra Womens: డ్వాక్రా మహిళలకు ఏపీ సర్కార్ బంపర్ ఆఫర్.. 72 గంటల్లోనే లోన్!

చంద్రబాబు ఆలోచనలు ఎప్పుడూ ప్రజల బాగోగుల గురించే... 50 రోజుల్లో కురుక్షేత్ర మహా సంగ్రామం: నారా భువనేశ్వరి

Gas Agency: కోనసీమ జిల్లాలో గ్యాస్ ఏజెన్సీలు కొత్త రకమైన మోసానికి తెరలేపాయి. వినియోగదారుల నుండి ఓటీపీ (OTP) తీసుకుని, సిలిండర్ డెలివరీ చేయకుండానే చేసినట్లు రికార్డుల్లో చూపిస్తున్నాయి.

Published : 2024-02-09 17:57:00

'నిజం గెలవాలి' యాత్రలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలోని చందర్లపాడు మండలం కోనాయపాలెంలో చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి పర్యటించారు. చంద్రబాబు అరెస్టుతో మనస్తాపానికి గురై గుండెపోటుతో మృతి చెందిన వనపర్తి మల్లికార్జున కుటుంబసభ్యులను పరామర్శించారు. మల్లికార్జున చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. టీడీపీ అండగా ఉంటుంది అని కుటుంబ సభ్యులకు భరోసా ఇస్తూ రూ.3 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

చంద్రబాబు అక్రమ అరెస్టుతో మనస్తాపానికి గురై మృతి చెందిన వారిలో ఇప్పటివరకు 60 కుటుంబాలను పరామర్శించానని భువనేశ్వరి తెలిపారు. ఇంకా 160 కుటుంబాలను పరామర్శించాల్సి ఉందని చెప్పారు. చంద్రబాబు ఆలోచనలు ఎప్పుడూ ప్రజల బాగోగుల గురించేనని... చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు తెలుగుదేశం కుటుంబ సభ్యులందరినీ పరామర్శించి ధైర్యం చెప్పాలని తనతో అన్నారని గుర్తుచేశారు. అందుకే 'నిజం గెలవాలి' చేపట్టానన్నారు. రానున్న 50 రోజుల్లో కురుక్షేత్ర మహా సంగ్రామం జరుగుతుందని.. తప్పకుండా మనమే గెలుస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

అనంతరం జగ్గయ్యపేట నియోజకవర్గంలో భువనేశ్వరి పర్యటించారు. పెనుగంచిప్రోలు మండలం, పెనుగంచిప్రోలు గ్రామంలో పార్టీ కార్యకర్త అలవాల గోపయ్య కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. గోపయ్య(63), 22-10-2023న గుండెపోటుతో మృతిచెందారు. గోపయ్య భార్య పుల్లమ్మ, కుమార్తె రమాదేవిలను భువనేశ్వరి ఓదార్చి, వారి యోగక్షేమాలడిగి తెలుసుకున్నారు. గోపయ్య కుటుంబ సభ్యులకు రూ.3లక్షల చెక్కు ఇచ్చి ఆర్థికసాయం అందించారు.

అనంతరం జగ్గయ్యపేట రూరల్ మండలం, గౌరవరం గ్రామంలో పార్టీ కార్యకర్త కుక్కుల ప్రభాకరరావు కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. ప్రభాకరరావు(60), 10-09-2023న గుండెపోటుతో మృతిచెందారు. ప్రభాకరరావు భార్య పుష్పమ్మ, కుమారులు సురేష్, జగదీష్, ప్రదీప్ లను భువనేశ్వరి ఓదార్చారు. వారికి రూ.3లక్షల చెక్కు ఇచ్చి ఆర్థికసాయం అందించారు.

తరువాత జగ్గయ్యపేట రూరల్ మండలం, బలుసుపాడు గ్రామంలో పార్టీ కార్యకర్త గండమాల వెంకటేశ్వర్లు కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. వెంకటేశ్వర్లు భార్య తేరోజమ్మ, కుమార్తెలు రమాదేవి, బేబిరాణి, లావణ్య, కుమారులు సురేష్, నాగరాజు, ఇతర కుటుంబ సభ్యులను ఓదార్చి, ధైర్యం చెప్పారు. వారి యోగక్షేమాలడిగి తెలుసుకుని వారికి రూ.3లక్షల చెక్కు అందించారు. పర్యటన ముగిసిన అనంతరం భువనేశ్వరి హైదరాబాద్ తిరుగుపయనమయ్యారు.

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →