విజయవాడ ముత్యాలంపాడులోని సాయిబాబా మందిరానికి ఓ యాచకుడు లక్ష రూపాయల విరాళం ఇచ్చాడు.
ఆలయం వద్ద బిచ్చమెత్తుకుని జీవించే యాదిరెడ్డి మందిర అభివృద్ధికి తనవంతు సాయంలో భాగంగా ఈ విరాళం ఇచ్చారు.
మందిరం గౌరవాధ్యక్షుడు గౌతమ్‌రెడ్డికి నిన్న ఆ సొమ్ము అందించారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఆలయం వద్ద భిక్షాటన చేస్తూ సంపాదించే సొమ్మును తిరిగి స్వామికే ఇవ్వడం ఆనందంగా ఉందని, ఇకపైనా ప్రతీ రూపాయి దైవ కార్యానికే అందిస్తానని ఈ సందర్భంగా యాదిరెడ్డి తెలిపారు.
తన జీవితం బాబా సేవకే అంకితమన్న ఆయన ఆలయ అభివృద్ధికి ఇప్పటి వరకు రూ. 8.54 లక్షల విరాళం ఇవ్వడం గమనార్హం.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి