పల్నాడు జిల్లా పోలీస్,
Dt.02.6.2024.
పల్నాడు జిల్లా నరసరావు పేట మండలం కాకాని గ్రామము వద్ద గల JNTU కాలేజీ లో జూన్ 4 వ తేదీ సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ప్రయాణికులకు, వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా నరసరావుపేట పట్టణం నుండి పలు ప్రాంతాలకు ట్రాఫిక్ మళ్లింపు, మరియు ఏర్పాట్లను గురించి పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ మతి మలిక గర్గ్ ఐపిఎస్ ఈ క్రింది విధంగా తెలిపారు
జూన్ 4 వ తేదీన సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా, కౌంటింగ్ కేంద్రం వద్ద ట్రాఫిక్ రద్దీని తగ్గించుటకు గాను నరసరావుపేట నగరం నుండి వినుకొండ వైపు వెళ్ళు ట్రాఫిక్ ను ఈ క్రింద సూచించిన విధంగా మళ్లింపు చేయడం జరిగిందని ఎస్పీ గారు తెలిపారు.
ఇంకా చదవండి: నరసరావుపేట ట్రాఫిక్ నియంత్రణ! జూన్ 4 కౌంటింగ్ నేపథ్యంలో మార్పులు!
ఈ ట్రాఫిక్ మళ్లింపు ది.03-06-2024 తేదీ రాత్రి 10.00 గంటల నుంచి జరుగునని పల్నాడు జిల్లా ఎస్పీ గారు తెలిపారు.
ది. 03.06.2024 రాత్రి 10.00 గంటల నుంచి ది 04-06-2024 తేదీ కౌంటింగ్ పూర్తి అగునంత వరకు నరసరావుపేట నుండి వినుకొండ వైపు వెళ్ళు భారీ మరియు మద్యతరహ రవాణా వాహనముల రాకపోకలు మళ్లింపులు:
ఇంకా చదవండి: సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్! గుంటూరు జిల్లాలో ట్రాఫిక్ మార్పులు!
✅నరసరావు పేట నుంచి వినుకొండ వైపు వెళ్ళు వాహనాలు స్టేషన్ రోడ్,లింగం గుంట్ల ,ఇక్కుర్రు, రొంపిచర్ల క్రాస్ రోడ్ మీదుగా అద్దంకి నర్కెట్ పల్లి హైవే మీదుగా సంతమగులూరు క్రాస్ రోడ్ మీదుగా వెళ్లవలెను.
✅అదే విధంగా నరసరావుపేట నుండి ఒంగోలు వెళ్ళు భారీ, మధ్య తరహా రవాణా వాహనాలు నరసరావుపేట నుంచి చిలకలూరిపేట మీదుగా వెళ్లి హైవే మీదుగా ఒంగోలు వెళ్లవలెను.
ఎట్టి పరిస్థితుల్లో వినుకొండ రోడ్డు వైపు ఉప్పలపాడు, పెట్లూరివారిపాలెం గ్రామాల మీదుగా వాహనాలు అనుమతించబడవు.
Note:- అత్యవసర వాహనాలు మరియు JNTU కి కౌంటింగ్ నిమిత్తం వెళ్ళు వాహనాలను ఏ మార్గం ద్వారా అయినా అనుమతించబడును.
✅ అదేవిధంగా కౌంటింగ్ సెంటర్ వద్ద, పరిసర ప్రాంతాలలో అణువణువు సీసీ కెమెరాల నిఘాలో ఉన్నదని చుట్టుపక్క ప్రదేశాలలో పోలీసు డ్రోన్ల తో నిఘా ఏర్పాటు చేసి ఉన్నాము.
✅ కౌంటింగ్ కు వచ్చు ఏజెంట్లు అందరూ తప్పనిసరిగా వారికి ఇచ్చిన ఐడీ కార్డులను తీసుకురావాలి.
✅ కౌంటింగ్ కి వచ్చు వాహనాలు నిర్ణీత/పోలీసు వారు సూచించిన ప్రదేశంలో పార్క్ చేసి రావలెను.
✅ కౌంటింగ్ కు వచ్చు ఏజెంట్లు ఎవరి వాహనాలు వారే డ్రైవ్ చేసుకొని రావలెను డ్రైవర్ అని లోనికి పంపరు.
✅ కౌంటింగ్ కేంద్రం లోకి ఏజెంట్లకు సెల్ ఫోన్స్ అనుమతించబడవు.
✅ కౌంటింగ్ కేంద్రం వద్ద భారీ సంఖ్యలో రాష్ట్ర పోలీసులు, రాష్ట్ర ప్రత్యేక పోలీసు బలగాలు,కేంద్ర సాయుద బలగాలు తో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగినది.
✅ కౌంటింగ్ సందర్భంగా జిల్లాలో అంతర్ జిల్లా చెక్ పోస్ట్ లు,అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ ల వద్ద తనిఖీలు చేస్తున్నాము ఏ అసాంఘిక కార్యక్రమమైన తారాసపడిన అట్టివారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాము.
✅అదేవిధంగా నరసరావుపేట టౌన్ లోకి కౌంటింగ్ రోజున బయట ప్రాంత వ్యక్తులు ఎవరుకి అనుమతి లేదు.
✅ జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నందున ఎక్కడ కూడా ముగ్గురు కంటే ఎక్కువ మంది గుమికూడరాదు.
✅ జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ప్రజలు ఎవరు బయటకు రాకుండా తమ ఇళ్లలోనే ఉండి ఫలితాలను టీవీలో చూడవలెను.
✅ రాజకీయ పార్టీల మధ్య గొడవలను , విద్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన సామాజిక మాధ్యమాల ద్వారా అటువంటి వాటిని ప్రచారం చేసిన అటువంటి వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోబడును.
✅ కౌంటింగ్ తర్వాత ఫలితాలు అనంతరం విజయోత్సవ ర్యాలీలకు, బాణాసంచాలు కాల్చుటకు, సభలు నిర్వహించుటకు,DJ లు పెట్టి ఊరేగింపులు చేయుటకు పర్మిషన్ లేదు అలా చేసిన ఎడల అట్టి వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకొనబడును.
కౌంటింగ్ ప్రశాంతంగా జరుగుటకు జిల్లాలో శాంతిభద్రతలకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండుటకు ప్రజలు, ప్రజాప్రతినిధులు పోలీసు వారి ముందస్తు సూచనలు పాటించవలనని కోరడమైనది.
మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
తెలంగాణ ఆత్మగౌరవానికి దశాబ్దం పూర్తి! సీఎం రేవంత్ రెడ్డి!
సార్వత్రిక ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ విడుదల!
సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్న సాక్షి! ఆ ఛానల్ లో మాత్రమే ఇలా!
ఆంధ్రప్రదేశ్ పై ఆరా సర్వే! కుప్పంలో చంద్రబాబుకు భారీ మెజార్టీ! పిఠాపురంలో భారీ మెజార్టీతో!
సోషల్ మీడియాలో వైరల్! బెంగాల్‌లో ఈవీఎం! వీవీప్యాట్లను కాల్వలోకి విసిరిన ఘటన!
సుప్రీం కోర్టుకు శరణు! శేషగిరిరావు ప్రాణహాని భయం!
ఎన్నారై నుండి ఐఎన్ఐ ఎస్ ఎస్ వరకు! డాక్టర్ అఖిల్ విజయం!
ప్రజలకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక! పలు మండలాల్లో తీవ్రవడగాల్పులు! అప్రమత్తంగా ఉండాలి!
కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్! కౌంటింగ్ రోజున ఆంక్షలు, భద్రతా చర్యలు!
సజ్జలపై క్రిమినల్ కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్! రెచ్చగొట్టేలా మాట్లాడడం కోడ్ ను..దేవినేని
నేటితో ముగియనున్న సార్వత్రిక సమరం! ఒడిశాలోని 42 అసెంబ్లీ స్థానాలకు! వారణాసి నుంచి బరిలో మోడీ!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: