అమరావతి: గుంటూరు జిల్లాలో జూన్ 4 తేదీన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ లో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ప్రయాణికులకు వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా గుంటూరు పట్టణం నుండి మరియు గుంటూరు జిల్లా పరిదిలో ట్రాఫిక్ మళ్లింపు, మరియు ఏర్పాట్లను గురించి జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపిఎస్ ఈ క్రింది విధంగా తెలిపారు
ది: 04.06.2024 న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ట్రాఫిక్ రద్దీని తగ్గించుటకు గాను గుంటూరు నగరం నుండి విజయవాడ వెళ్ళు ట్రాఫిక్ ను ఈ క్రింద సూచించిన విధంగా మళ్లింపు చేయడం జరిగిందని గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపిఎస్ తెలిపారు.
ఈ ట్రాఫిక్ మళ్లింపు ది.03-06-2024 తేదీ రాత్రి 10.00 గంటల నుంచి జరుగునని గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపిఎస్ తెలిపారు.
ది. 03.06.2024 రాత్రి 10.00 గంటల నుంచి ది 04-06-2024 తేదీ కౌంటింగ్ పూర్తి అగు నంత వరకు గుంటూరు నుండి విజయవాడ వైపు వెళ్ళు భారీ మరియు మద్యతరహ రవాణా వాహనముల రాకపోకలు మళ్లింపులు:
ఇంకా చదవండి: సజ్జలపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు! 41ఏ నోటీసులు!
గుంటూరు నుంచి విజయవాడ వైపు వెళ్ళు వాహనాలు బుడంపాడు జంక్షన్ వద్ద హైవే దిగి తెనాలి, వేమూరు, కొల్లూరు, వెల్లటూరు జంక్షన్, పెనుమూడి బ్రిడ్జ్, అవనిగడ్డ , పామూరు – గుడివాడ, హనుమాన్ జంక్షన్ మీదుగా వెళ్లవలెను. (ఇరువైపులా).
అదే విధంగా బాపట్ల వైపు వెళ్ళు వాహనాలు ను బోయపాలెం, ప్రత్తిపాడు మీదుగా బాపట్ల వైపు వెళ్లవలెను.
గుంటూరు నుంచి విజయవాడ వైపు వెళ్ళు హెవీ వాహనాలు హై వే లోనికి అనుమతించబోమని జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపిఎస్ తెలిపారు
III. హైదరాబాద్ వైపు వెళ్ళు వాహనాల మళ్లింపు:-
గుంటూరు నుంచి హైదరాబాద్ వైపు వెళ్ళు వాహనాలు ను పేరేచర్ల జంక్షన్ నుంచి సత్తెనపల్లి, పిడుగురాళ్ల మీదుగా హైదరాబాద్ వైపు వెళ్లవలెను. విజయవాడ వైపు అనుమతించబడవు.
చిలకలూరి పేట వైపు నుండి హైదరాబాద్ వైపు వెళ్ళుటకు వచ్చే వాహనాలు చిలకలూరి పేట Y-junction (గుంటూరు) నుండి చుట్టుగుంట, పేరేచర్ల మీదుగా వెల్లవలెను.
ఇంకా చదవండి: యూఏఈ: ఉన్నత విద్యకు పెరుగుతున్న డిమాండ్! టాప్ 14 చౌకైన యూనివర్సిటీలు! అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతలు!
మంగళగిరి నుండి విజయవాడ వైపు వెళ్ళుటకు వచ్చే వాహనాలు రేవేంద్రపాడు జంక్షన్ మీదగా తెనాలి, బట్టిప్రోలు, పెనుమూడి ఫ్లై ఓవర్ మీదగా విజయవాడ వైపు వెళ్లవలెను.
Note:- అత్యవసర వాహనాలు మరియు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కౌంటింగ్ నిమిత్తం వెళ్ళు అన్నీ వాహనాలు ను ఏ దారి నుంచి అయినా అనుమతించబడును.
కనుక గుంటూరు నుంచి ప్రయాణం చేసే వాహనదారులు జూన్ నెల 3 తేదీ రాత్రి 10 గంటల నుంచి గుంటూరు నుండి విజయవాడ వైపు వెళ్ళు ఎలాంటి వాహనాలకైన అనుమతులు లేవు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వద్దకు కౌంటింగ్ నిమిత్తం వచ్చే వాహనాలు తప్ప పోలీసు వారికి సహకరించాలని గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపిఎస్ ప్రజలకు తెలిపారు.
ఇంకా చదవండి: సిక్కింలో ప్రభావం చూపని బిజెపి, కాంగ్రెస్! అధికారం దిశగా ఆ పార్టీ!
మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
తెలంగాణ ఆత్మగౌరవానికి దశాబ్దం పూర్తి! సీఎం రేవంత్ రెడ్డి!
సార్వత్రిక ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ విడుదల!
సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్న సాక్షి! ఆ ఛానల్ లో మాత్రమే ఇలా!
ఆంధ్రప్రదేశ్ పై ఆరా సర్వే! కుప్పంలో చంద్రబాబుకు భారీ మెజార్టీ! పిఠాపురంలో భారీ మెజార్టీతో!
సోషల్ మీడియాలో వైరల్! బెంగాల్‌లో ఈవీఎం! వీవీప్యాట్లను కాల్వలోకి విసిరిన ఘటన!
సుప్రీం కోర్టుకు శరణు! శేషగిరిరావు ప్రాణహాని భయం!
ఎన్నారై నుండి ఐఎన్ఐ ఎస్ ఎస్ వరకు! డాక్టర్ అఖిల్ విజయం!
ప్రజలకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక! పలు మండలాల్లో తీవ్రవడగాల్పులు! అప్రమత్తంగా ఉండాలి!
కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్! కౌంటింగ్ రోజున ఆంక్షలు, భద్రతా చర్యలు!
సజ్జలపై క్రిమినల్ కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్! రెచ్చగొట్టేలా మాట్లాడడం కోడ్ ను..దేవినేని
నేటితో ముగియనున్న సార్వత్రిక సమరం! ఒడిశాలోని 42 అసెంబ్లీ స్థానాలకు! వారణాసి నుంచి బరిలో మోడీ!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: