ఏపీలో ఈరోజుతో ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఇప్పటి వరకు హోరెత్తించిన మైకులు సాయంత్రం 5 గంటలకు మూగబోనున్నాయి. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు, వారికి మద్దతుగా ప్రచారం చేస్తున్న వారు అందరూ సాయంత్రానికి తమ ప్రచారాన్ని ముగించనున్నారు. మరోవైపు తన బాబాయ్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోసం రామ్ చరణ్ పిఠాపురం వెళ్లారు. ఇదే సమయంలో తన మిత్రుడు, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రా రెడ్డి కోసం అల్లు అర్జున్ నంద్యాలకు చేరుకున్నారు. అల్లు అర్జున్ తో పాటు ఆయన భార్య స్నేహారెడ్డి కూడా నంద్యాలకు వెళ్లారు. ఇప్పటికే పవన్ కల్యాణ్ కు అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా మద్దతును ప్రకటించారు. మెగా హీరోలంతా పవన్ వెనుకే ఉన్నారు.
ఇంకా చదవండి: జగన్ వచ్చినా జనం రాలేదని రోజాకు దిగులు! మేడమ్ కు క్లారిటీ వచ్చేసిందా? రోజా పై వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు!
అయితే, శిల్పా రవిచంద్రారెడ్డితో ఎప్పటి నుంచో బన్నీకి మంచి అనుబంధం ఉంది. ఆ స్నేహం కోసమే ఆయన నంద్యాలకు వచ్చారు. ఇంకోవైపు స్నేహారెడ్డి, రవిచంద్రారెడ్డి భార్య నాగినీరెడ్డి ఇద్దరూ క్లాస్ మేట్స్ కూడా. మరోవైపు బన్నీని చూసేందుకు అభిమానులు పోటెత్తారు. ఈ సందర్భంగా రవిచంద్రారెడ్డి చేతిని పట్టుకుని అభిమానులకు బన్నీ చూపించారు. రవిచంద్రారెడ్డికి ఓటు వేయాలని కోరారు. 2019 ఎన్నికల్లో రవిచంద్రారెడ్డి నంద్యాల నుంచి పోటీ చేసినప్పుడు కూడా ఆయనకు అల్లు అర్జున్ మద్దతు తెలిపారు. రవిని ప్రజాసేవలో చూడటం తనకు ఎంతో గర్వంగా ఉందని అప్పట్లో ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు ఓ ఇంటర్వ్యూలో రవిచంద్రారెడ్డి మాట్లాడుతూ... స్నేహానికి అత్యంత విలువనిచ్చే వ్యక్తి అల్లు అర్జున్ అని కొనియాడారు. రాజకీయాలకు అతీతంగా అల్లు అర్జున్ తన స్నేహితుడి కోసం నంద్యాలకు వెళ్లడంపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
**తెలుసుకో మిత్రమా తొందరపడకు..**
** సహజ మరణానికి రూ. 5 లక్షలు, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ. 10 లక్షలు బీమా సౌకర్యం - కూటమికే మన ఓటు **
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
తమాషా కోసం: జగన్ కి షాక్ ఇస్తున్న ఏపీ ప్రజలు, వైసీపీ ఎమ్మెల్యే..మళ్ళీ అదే కుల రాజకీయాలు!
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
గోల్డ్ లోన్ తీసుకున్నారా! వడ్డీ ఎక్కువ కట్టించుకునే అవకాశం ఉంది! ఈ జాగ్రత్తలు పాటిస్తే నీకే ఉపయోగ!
కీర్తి సురేష్‌లో ఈ యాంగిల్ కూడా ఉందా! గ్లామర్ ట్రీట్‌తో అదరగొట్టిన మహానటి!
రూ.6 లక్షలకే కొత్త కారు ఇంటికి! ఆపై రూ.62వేల డిస్కౌంట్! అంతేకాదు వివిధ రకాల బెనిఫిట్స్ కూడా!
జగన్ సతీమణికి మరో చేదు అనుభవం! ఆ ఘటనతో ప్రచారానికి భయపడుతున్న భారతి!
రోజా కి తీవ్రమైన ఎదురుదెబ్బ! ఆమె దెబ్బకి వైసీపీ మొత్తం రాజీనామా!
ఎన్నికల ప్రచారానికి బయలుదేరిన సుష్మ అందారే! ల్యాండ్ అవుతూ కుప్పకూలిన హెలికాప్టర్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: