గౌరవ ప్రధాన మంత్రి రోడ్ షో సందర్భంగా బందోబస్తు నిర్వహించు అధికారులకు మరియు సిబ్బందికి ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమిషనర్ శ్రీ పి.హెచ్.డి.రామకృష్ణ ఐ.పి.ఎస్ దిశానిర్ధేశం చేసారు. ది.08.05.2024 తేదిన ఎన్.టి.ఆర్.జిల్లా, విజయవాడ నగరంలో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి పర్యటన నేపథ్యంలో ది.07.05.2024 తేదిన పోలీస్ కమిషనర్ శ్రీ పి.హెచ్.డి.రామకృష్ణ ఐ.పి.ఎస్.గారు ఇతర పోలీసు అధికారులతో కలిసి ఆంద్రా లయోలా కళాశాల స్టేడియం నందు బందోబస్త్ విధులు నిర్వహించడానికి వచ్చిన సిబ్బందికి దిశానిర్దేశం చేయడం జరిగింది.

మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ సిబ్బందితో మాట్లాడుతూ ....... ఈ కార్యక్రమానికి భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ  మరియు ఇతర వి.వి.ఐ.పి.,లు, వి.ఐ.పి.లు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొంటారు. కావునబందోబస్తులో పాల్గొనే అధికారులు మరియు సిబ్బంది వారికి కేటాయించిన విధులను అంకితభావంతో నిర్వహించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని, అదేవిధంగా పోలీసు సిబ్బంది వారికి కేటాయించిన పాయింట్లు యందు అప్రమత్తంగా ఉండాలని వీక్షకలుకు, ఆహ్వానితులకు వారికి కేటాయించిన ప్రకారము వారు వెల్లవలసిన మార్గాలును నిర్దేశిస్తూ చెప్పవలెనని ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే కంట్రోల్ రూమ్ కు గాని పై అధికారులుకు గాని వెంటనే తెలియ పరచవలెను అని తెలియజేశారు.

వైఎస్ షర్మిలపై కేసు! అరెస్ట్ కు కుట్ర! తెర వెనుక వైఎస్ భారతి?

బందోబస్త్ నిమిత్తం రోడ్ షో ఏరియా మరియు పరిసర ప్రాంతాలలలో ఏరియా డామినేషన్, రోడ్ ఓపెనింగ్ పార్టీస్, కట్ ఆఫ్ పార్టీస్, రూఫ్ టాప్స్, రోప్ పార్టీస్, యాంటిసబ్ టేజ్ చెక్, వివిధ బృందాలను ఏర్పాటు చేసి, ఎక్కడా ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించే విధంగా 06 మంది ఐ.పి.ఎస్.అధికారుల నేతృత్వంలో డి.సి.పి/ఎస్.పి. లు – 07, ఏ.డి.సి.పి.లు -22 మంది, ఏ.సి.పి.లు -50 మంది, ఇన్స్పెక్టర్లు -136 మంది, ఎస్.ఐ.లు -250 మరియు సిబ్బందితో కలిపి మొత్తం 5000 మంది లా & ఆర్డర్, ఏ.ఆర్., ఏ.పి.ఎస్.పి., పారామిలటరీ బలగాలతో కట్టు దిట్టమైన భద్రత, ను చేయడం జరిగింది.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

రోడ్ షో జరుగు ఏరియా అదేవిధంగా ముఖ్య ప్రాంతాలలో మరియు ముఖ్య జంక్షన్ లలో ఎక్కడా ట్రాఫిక్ అంతరాయాలు కలుగకుండా ఉండేందుకు సిబ్బందిని అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ పర్యవేక్షించాలని, ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రజలు తమ వాహనాలు పార్కింగ్ ప్రదేశాల్లోనే పార్కింగ్ చేసేటట్లు చూడాలని వి.ఐ.పి, వి.వి.ఐ.పి రోడ్లలలో ట్రాఫిక్ జామ్ లేకుండా చూడాలని అందరూ అంకితభావంతో పనిచేసి ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని అన్నారు.

తన కూతురు విషయంపై మండిపడ్డ ముద్రగడ! పవన్ పై కీలక వ్యాఖ్యలు! మేము NDA కే మద్దతు?

ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ పి.హెచ్.డి.రామకృష్ణ ఐ.పి.ఎస్ తోపాటు, ఐ.జి.పి. శ్రీ కె.వి.మోహన్ రావు ఐ.పి.ఎస్, డి.ఐ.జి. శ్రీ గోపీనాథ్ జెట్టి ఐ.పి.ఎస్., ఏ.ఐ.జి. శ్రీ ఎం.రవీంద్రనాథ్ బాబు ఐ.పి.ఎస్, శ్రీ వకుల్ జిందాల్ ఐ.పి.ఎస్, శ్రీమతి మల్లికా గార్గ్ ఐ.పి.ఎస్, శ్రీ ఏ.ఆర్.దామోదర్ ఐ.పి.ఎస్, డి.సి.పి.లు శ్రీ కె.శ్రీనివాసరావు ఐ.పి.ఎస్, శ్రీ అధిరాజ్ సింగ్ రాణా ఐ.పి.ఎస్, శ్రీ ఏ.బి.టి.ఎస్.ఉదయరాణి ఐ.పి.ఎస్, శ్రీ కరిముల్లా షరీఫ్, శ్రీ కె.చక్రవర్తి, శ్రీ టి.హరికృష్ణ , శ్రీ బి.రామకృష్ణ, ఏ.డి.సి.పి.లు, ఏ.సి.పి.లు మరియు ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి:    

వైసీపీ నేతలకు షాక్ ఇచ్చిన ఈసీ! ఆ అధికారులపై వేటు!

ఢిల్లీ : స్కిల్ కేసులో చంద్రబాబుకు బిగ్ రిలీఫ్! స్పష్టం చేసిన సుప్రీంకోర్టు

కూటమికి మద్ధతుగా తరిలి వస్తున్న జాతీయ సంస్థలు! తన్జీమ్ ఈ ముఫ్తియాన్! 14 ఏళ్ల సీఎం

ఏపీలో ప్రభుత్వ పథకాలకు నిధుల విడుదలకు నో చెప్పిన ఈసీ! ప్రతిపాదనలు పంపిన స్క్రీనింగ్ కమిటీ!

 Evolve Venture Capital 

ఏపీ అభివృద్ధికి మోదీ భరోసా! ప్రజలు గెలవాలి.. రాష్ట్రం నిలవాలని పవన్! మా కలయిక అమరావతి నిర్మాణం..చంద్రబాబు

వైసీపీ కు షాక్‌ ఇచ్చిన ఉద్యోగులు! ట్విస్ట్ అదిరింది!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group